- Telugu News Photo Gallery Cricket photos Virat kohli to yuvraj singh these 5 records may not broken in t20 world
T20 World Cup: ఈ 5 రికార్డులు బ్రేక్ చేయడం చాలా కష్టం.. లిస్టులో ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..
T20 World Cup Records: టీ20 ప్రపంచ కప్‌లో ఎన్నో రికార్డులు ఉన్నాయి. వాటిని బద్దలు కొట్టడం అంత సులభం కాదు. అలాంటి ఐదు రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Oct 19, 2022 | 3:07 PM

T20 ప్రపంచ కప్ ఎనిమిదో ఎడిషన్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. అక్టోబర్ 16 నుంచి ప్రారంభమైన ఈ మహా సంగ్రామం.. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 13 న జరగనుంది. ప్రతి ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఎన్నో రికార్డులు క్రియేట్ అవుతూనే ఉంటాయి. అయితే ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయిన ఐదు రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. అత్యధిక సిక్సర్లు.. టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ తరచుగా సిక్సర్ల వర్షం కురిపిస్తుంటారు. టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్రిస్ గేల్ 63 సిక్సర్లు కొట్టాడు. ఈ సందర్భంలో ఏ ఆటగాడు కూడా అతని దగ్గర లేడు. దీని తర్వాత యువరాజ్ సింగ్ 33 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇది కాకుండా డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ తలో 31 సిక్సర్లు కొట్టారు. గేల్ ఈ రికార్డును బ్రేక్ చేయడం అంత తేలికకాదు.

2. భారీ తేడాతో విజయం.. 2007 టీ20 ప్రపంచకప్‌లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద విజయం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 260 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్‌లో ఏ జట్టు చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే కావడం విశేషం. ఆ తర్వాత దక్షిణాఫ్రికా రెండో స్థానంలో నిలిచింది. 2009లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 130 పరుగుల తేడాతో విజయం సాధించింది.

3. వేగవంతమైన అర్ధశతకం.. టీ20 ప్రపంచకప్‌లో భారత మాజీ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ 12 బంతుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు. 2007 ప్రపంచకప్‌లో అతను ఈ ఘనత సాధించాడు. ఈ అర్ధ సెంచరీలో ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కూడా ఉన్నాయి. యువరాజ్‌తో పాటు, నెదర్లాండ్స్ బ్యాట్స్‌మెన్ స్టీఫెన్ మైబెర్గ్ 2014 టీ20 ప్రపంచకప్‌లో 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

4. భారీ ఛేజింగ్.. 2016 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఈ స్కోరును ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల నష్టపోయి ఛేదించింది. ఇది కాకుండా 2007 సంవత్సరంలో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 208 పరుగులను ఛేదించింది.

5. అత్యధిక సగటు.. క్రికెట్‌లో బ్యాటర్ల సగటు బాగుంటే నిలకడగా పరుగులు సాధిస్తున్నారని అర్థం. ఇప్పటివరకు టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సగటు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు ఆడి 76.82 సగటుతో 845 పరుగులు చేశాడు. ఇందులో 10 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో యావరేజ్‌లో ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ మైఖేల్ హస్సీ రెండో స్థానంలో ఉన్నాడు. అతను 54.63 సగటుతో పరుగులు చేశాడు.




