AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: 3 మ్యాచ్‌ల్లో 452 పరుగులు.. టీమిండియా టెన్షన్ పెంచిన లెఫ్ట్ హ్యాండర్..

India vs Australia Test: నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ పెర్త్‌లో జరగనుండగా, రెండో మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరగనుంది. అలాగే 3వ మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లో జరగనుంది. మిగతా రెండు మ్యాచ్‌లు డిసెంబర్ 26, జనవరి 3 నుంచి ప్రారంభం కానున్నాయి.

IND vs AUS: 3 మ్యాచ్‌ల్లో 452 పరుగులు.. టీమిండియా టెన్షన్ పెంచిన లెఫ్ట్ హ్యాండర్..
Ind Vs Aus Alex Carey
Venkata Chari
|

Updated on: Nov 20, 2024 | 11:55 AM

Share

India vs Australia Test: నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ సిరీస్‌లో విజయం సాధించేందుకు ఆస్ట్రేలియా విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్‌లను టార్గెట్ చేస్తుందనడంలో సందేహం లేదు. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నేల వికెట్లు టీమిండియాకు కీలకం. ఈ మూడు వికెట్లు తీయాలని గొప్ప ప్లాన్ వేసిన టీమిండియాకు ఇప్పుడు అలెక్స్ కారీ ఫామ్ కొత్త ఆందోళన కలిగించింది. ఎందుకంటే, క్యారీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్‌లో ఆస్ట్రేలియాకు పిల్లర్‌గా నిలిచే అవకాశం ఉంది.

రెండు నెలల క్రితమే ఇంగ్లండ్ పర్యటనలో వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన కారీ.. ఇప్పుడు ఆస్ట్రేలియా దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో బ్యాటింగ్‌ను కొనసాగించాడు. బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌కు సన్నాహకంగా దక్షిణ ఆస్ట్రేలియా తరపున కారీ కేవలం 3 మ్యాచ్‌లు, 6 ఇన్నింగ్స్‌లలో 90 సగటుతో 452 పరుగులు చేశాడు.

ఈసారి, అలెక్స్ కారీ కూడా బ్యాట్‌తో 2 గొప్ప సెంచరీలు సాధించాడు. అలాగే, 6 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 90, 111, 42, 123*, 44, 42 పరుగులు చేశాడు. అలెక్స్ కారీ గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో 40కి తక్కువ స్కోరు చేయకపోవడం విశేషం.

ఇవి కూడా చదవండి

ఈ అద్భుతమైన ఫామ్ టీమిండియాకు డేంజరస్‌గా మారనుంది. ఎందుకంటే, భారత్‌తో జరిగే మ్యాచ్‌లో అలెక్స్ కారీ వికెట్ కీపర్‌గా నిలవడం ఖాయం. టాప్ ఆర్డర్‌లో ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, ట్రావిస్ హెడ్‌లు ఉండగా, ఫామ్‌లో ఉన్న కారీ ఇప్పుడు మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు.

అలెక్స్ కారీ ఈ గొప్ప ఫామ్ ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు మిడిల్ ఆర్డర్ ఆందోళనలను తొలగించింది. ఎందుకంటే, ఒకవైపు కారే క్రీజులోకొస్తే.. పాట్ కమిన్స్ సహా బౌలర్లు కూడా లోయర్ ఆర్డర్‌లో సపోర్ట్ చేస్తాడు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాట్ ఝుళిపించగల సత్తా ఉన్న కారీ.. వేగంగా బ్యాటింగ్ చేయడంలోనూ పేరు తెచ్చుకున్నాడు. తద్వారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ టెంపోను మార్చగల ఆటగాడు.

అందుకే, అలెక్స్ కారీ అద్భుతమైన ఫామ్‌తో ఆస్ట్రేలియా జట్టు పుల్ హ్యాపీగా ఉంది. అయితే, మరోవైపు స్టార్ ప్లేయర్ల కోసం పక్కా ప్లాన్ వేసిన టీమిండియా.. ఇప్పుడు అలెక్స్ కారీని కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్లాన్ వేసుకోవాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి