Sreeleela: టాలీవుడ్లో ఆస్ట్రేలియా క్రికెటర్.. శ్రీలీల సినిమాలో డేవిడ్ వార్నర్.. ఏ మూవీ అంటే..
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రూపొందుతున్న ఓ సినిమాలో ఆయన కీలకపాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం నడుస్తుంది. అంతేకాదు.. ఆ చిత్రంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా కనిపించనుందని టాక్. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి చాలా మందికి తెలుసు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నప్పుడు తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తూ, రీల్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే గతంలో అనేక ప్రకటనలలో కనిపించాడు. ఇప్పుడు తెలుగు సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు సంబంధించిన అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ అనేక సూపర్ హిట్ చిత్రాలను అందించింది. ఇప్పుడు డేవిడ్ వార్నర్ సైతం ఈ సంస్థ నిర్మిస్తున్న సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సంస్థ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ ఒక ప్రెస్ మీట్ లో ఈ విషయం చెప్పారు. ఈ సంస్థ నిర్మిస్తున్న ‘రాబిన్ హుడ్’ చిత్రంలో డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించారు.
దీంతో ఈ చిత్రంలో రాబిన్ హుడ్ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులు కూడా అతన్ని పెద్ద తెరపై చూడటానికి ఎదురు చూస్తున్నారు. డేవిడ్ వార్నర్ వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. ఆయనకు తెలుగు ప్రేక్షకులతో మంచి అనుబంధం ఉంది కాబట్టి, ఆయనను మరింతగా ఇష్టపడే అవకాశం ఉంది. ‘రాబిన్ హుడ్’ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. డేవిడ్ వార్నర్ తరఫున షూటింగ్ రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తుండగా.. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. 2025 IPL లో డేవిడ్ వార్నర్ కోనుగోలు కాలేదు. అతని బేస్ ప్రైస్ రూ. 2 కోట్లు. 2024 టీ20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన తర్వాత వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..








