IND vs PAK, Asia Cup 2023: ఆసియాకప్‌లో భారత్-పాక్ మ్యాచ్.. లైవ్ ఎక్కడ, ఎలా చూడాలో తెలుసా?
IND vs PAK: ఆసియా కప్ 2023 టోర్నమెంట్ షెడ్యూల్ ఎట్టకేలకు ప్రకటించారు. ఈ ఏడాది ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుండగా ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న జరగనుంది. ఈసారి ఆసియా కప్ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతోంది.

ఆసియా కప్ 2023 టోర్నమెంట్ షెడ్యూల్ ఎట్టకేలకు ప్రకటించారు. ఈ ఏడాది ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుండగా ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న జరగనుంది. ఈసారి ఆసియా కప్ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతోంది. అంటే లీగ్‌లో నాలుగు మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో, తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం భారత్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరగనున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మూడుసార్లు తలపడే ఛాన్స్ ఉంది.
సెప్టెంబర్ 2న భారత్-పాక్ పోరు..
ప్రతిసారీ లాగానే భారత్, పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్‌లో నిలిచాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్‌తో పాటు నేపాల్ మూడో జట్టుగా నిలిచింది. సెప్టెంబరు 2న శ్రీలంకలోని క్యాండీలో పాకిస్థాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 4న అదే నగరంలో నేపాల్‌తో భారత్ తలపడనుంది.
ఆసియా కప్‌లో మూడు సార్లు చిరకాల ప్రత్యర్థల పోరు?
భారత్, పాకిస్థాన్ జట్లు తదుపరి రౌండ్ అంటే సూపర్-4 దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పుడు అంతా ప్లాన్ ప్రకారం జరిగితే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మధ్య కనీసం రెండు మ్యాచ్‌లు చూడొచ్చు. అలాగే ఇరు జట్లు ఫైనల్ కు చేరితే కేవలం 16 రోజుల్లోనే మూడోసారి భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను అభిమానులు వీక్షించవచ్చు.




భారత్-పాక్ మ్యాచ్ పూర్తి వివరాలు..
భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
సెప్టెంబర్ 2వ తేదీ శనివారం భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది
భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
క్యాండీలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది.
భారత్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌ను ఏ ఛానెల్ వీక్షించవచ్చు?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‌ను వీక్షించవచ్చు.
భారతదేశంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ని ఆన్‌లైన్‌లో ఎక్కడ చూడాలి?
భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌ను డిస్నీ+ హాట్‌స్టార్ వెబ్‌సైట్, యాప్‌లో ఆన్‌లైన్‌లో చూడొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




