Steve Smith: ‘నువ్వు బోరున ఏడ్వడం టీవీలో చూశాం’.. స్టీవ్ స్మిత్‌ను ఘోరంగా అవమానించిన ఇంగ్లండ్ ఫ్యాన్స్
2018లో బ్యాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్‌ను తాజా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులోనూ గేలి చేశారు ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ నాలుగో రోజున, ఇంగ్లండ్ అభిమానులు స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు 'టీవీలో నువ్వు ఏడవడం చూశాం' అంటూ అవమానించారు.
క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల స్లెడ్జింగ్ సర్వసాధారణం. ముఖ్యంగా ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో చాలాసార్లు ఆటగాళ్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటాయి. అయితే 5 ఏళ్ల క్రితం చేసిన ఒక్క పొరపాటుకు ఇప్పటికీ తరచూ విమర్శలకు గురవుతున్నాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్. 2018లో బ్యాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్‌ను తాజా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులోనూ గేలి చేశారు ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ నాలుగో రోజున, ఇంగ్లండ్ అభిమానులు స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ‘టీవీలో నువ్వు ఏడవడం చూశాం’ అంటూ అవమానించారు. ఇంగ్లండ్ అభిమానుల ఈ వైఖరిపై స్మిత్ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంగ్లండ్ ఫ్యాన్స్ తనను ఇలా తిట్టడం గమనించిన స్మిత్ జస్ట్ నవ్వుతూ స్పందించాడు. వివరాల్లోకి వెళితే.. 2018లో ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఆపర్యటనలో ఆసీస్ పేసర్ టెస్టు మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆస్ట్రేలియా ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ ట్యాంపరింగ్ చేస్తూ కెమెరాకు చిక్కాడు. ఇందులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ప్రమేయం కూడా ఉన్నట్లు తర్వాతి విచారణలో రుజువైంది.
ఈ ఘటన తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ పరువంతా గంగలో కలిసిపోయింది. ఇక ఆసీస్ బోర్డు స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై ఏడాది పాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. ఈ పరిణామంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన స్మిత్, వార్నర్ మీడియా సమావేశంలో తమ తప్పును ఒప్పుకోవడమే కాకుండా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే ఘటనను గుర్తు చేస్తూ ఇంగ్లిష్ అభిమానులు స్మిత్ ను గేలిచేశారు. కాగా యాషెస్ సిరీస్ తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు స్మిత్. తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగుల వద్ద అవుట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. అయితే ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 44 పరుగుల నిర్ణయాత్మక ఇన్నింగ్స్ ఆధారంగా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 8 వికెట్ల కోల్పోయి ఛేదించింది.
Steve Smith heads over to the Hollies for the first time this series….#Ashes pic.twitter.com/Hs1cRB56Lb
— England’s Barmy Army ???????? (@TheBarmyArmy) June 19, 2023
Heartbreaking. Steve Smith has broken down delivering a message to young Aussie cricket fans. pic.twitter.com/l14AsvAhXz
— cricket.com.au (@cricketcomau) March 29, 2018
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..