WTC Final: ‘రాహుల్ ద్రావిడ్ ఓ జీరో, భారత్ బౌలర్లు టెస్ట్‌కి పనికిరారు’.. టీమిండియాపై పాక్ మాజీ తీవ్ర విమర్శలు..
WTC Final 2023: ఓవల్ మైదానంలో భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతోంది. మూడు రోజుల ఆట ముగిసే సమయానికి భారత్‌పై ఆస్ట్రేలియా తన ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌట్ కాగా....
WTC Final 2023: ఓవల్ మైదానంలో భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతోంది. మూడు రోజుల ఆట ముగిసే సమయానికి భారత్‌పై ఆస్ట్రేలియా తన ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే పరిమితమైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగుల లీడ్ సాధించిన కంగారుల జట్టు తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి 4 వికెట్ల నష్టానికి 123 పరుగులతో మూడో రోజు ఆట ముగించింది. ఇలా మూడు రోజుల ఆటలో ఆసీస్ జట్టు 296 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందనేది క్రికెట్ విశ్లేషకుల వాదన. ఇదిలా ఉంటే భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పనితీరుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ చర్చ లేవనెత్తాడు. 2021 T20 ప్రపంచ కప్ తర్వాత టీమిండియా కోచింగ్ బాధ్యతలు అందుకున్నాడు ద్రావిడ్. అతని కోచింగ్‌లోని భారత్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది.
అయితే ఈ టైటిల్ మ్యాచ్‌లో ద్రవిడ్ వ్యూహాన్ని పాకిస్థాన్ మాజీ ప్లేయర్ బాసిత్ అలీ ప్రశ్నించాడు. ద్రావిడ్ గొప్ప బ్యాట్స్‌మ్యాన్ కానీ ఓ కోచ్‌గా జీరో అంటూ పాక్ మాజీ బాసిత్ అలీ చెప్పుకొచ్చాడు. బాసిత్ అలీ తన యూట్యూబ్ ఛానెల్‌లో ద్రవిడ్‌కు పెద్ద అభిమానినని, ఎప్పటికీ అలాగే ఉంటానని చెప్పాడు. అయితే కోచ్‌గా ద్రావిడ్ ఓ జీరో అని.. తాను భారత్‌కు వెళ్లినప్పుడు స్పిన్నర్లకు సహాయపడే పిచ్‌లు ఉన్నాయని బాసిత్ అన్నాడు. ఆస్ట్రేలియాకు వెళితే బౌన్సీ పిచ్‌లు వస్తాయి. దేవుడు జ్ఞానాన్ని అందిస్తున్నప్పుడు ద్రవిడ్ పర్వతాల వెనుక దాక్కున్నాడని బాసిత్ చెప్పుకొచ్చాడు. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడే భారత్ మ్యాచ్ ఓడిపోయిందని బాసిత్ అభిప్రాయపడ్డాడు. భారత్ టాస్‌కి ముందు రెండు గంటల్లోనే నిర్ణయం తీసుకుందని, అందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకుందని.. భారత జట్టు బౌలింగ్ టెస్టు స్థాయి కాదని, ఐపీఎల్ స్థాయికి చెందినదని ఎద్దేవా చేశాడు.
కష్టాల్లో భారత్
కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా కష్టాల్లో ఉండని చెప్పుకోవాలి. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్‌లో బౌలర్లు తేలిపోవడంతో ఆస్ట్రేలియా తరఫున స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ సెంచరీలతో మెరిసారు. దీంతో టీమ్ స్కోర్ 469 పరుగులకు చేరింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన భారత్ తరఫున రహానే(89), శార్దుల్ ఠాకూర్(51), జడేజా(48) మినహా అంతా చేతులెత్తేయడంతో 296 పరుగులే టీమ్ ఆలౌట్ అయింది. దీంతో 173 పరుగుల ఆధిక్యంతో మూడో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 123 రన్స్ చేసింది. దీంతో భారత్‌పై ఆసీస్ జట్టు 296 పరుగుల ఆధిక్యంతో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..