IND vs AUS: శార్దుల్ దెబ్బకు సీన్ రివర్స్.. గబ్బాలో ఆసీస్, ఓవల్‌లో ఇంగ్లండ్‌లకు ఘోర పరాభవం.. మరోసారి అదే సీన్?
India vs Australia, Shardul Thakur: 2020 నుంచి విదేశీ గడ్డపై 7వ వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం ఏర్పడినప్పుడల్లా శార్దూల్ ఠాకూర్ అందులో భాగమయ్యాడు. తాజాగా ఓవల్‌లోనూ రహానేతో కలిసి శార్దూల్ 109 పరుగులు జోడించాడు. దీంతో టీమిండియా లక్ మరోసారి మారుతుందని తెలుస్తోంది.

2021లో బ్రిస్బేన్‌లోని గబ్బా గ్రౌండ్‌లో ఏం జరిగిందో క్రికెట్ ప్రేమికులు అంత త్వరగా మర్చిపోలేరు. టీమిండియా సాధించిన చారిత్రాత్మక విజయాల్లో ఒకటిగా నిలిచిన.. ఆ అద్భుత విజయాన్ని ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఆ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించడమే కాకుండా దాని గర్వాన్ని కూడా బద్దలు కొట్టింది. గత 32 ఏళ్లుగా చెక్కుచెదరని కంగారుల గర్వాన్ని దారుణంగా దెబ్బ తీసింది. గబ్బాలో ఆస్ట్రేలియాను ఏ జట్టు ఓడించలేదు. అయితే ఆ హిస్టరీని టీమిండియా బ్రేక్ చేసింది. ఇప్పుడు అదే అదృష్టంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా అదే సీన్ కనిపిస్తోంది.
WTC ఫైనల్ మూడో రోజున టీమ్ ఇండియాతో ఇదే జరుగుతుందని అంతా అంటున్నారు. టీమిండియా అదృష్టం ఏంటని మీరు ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం.. గత 3 సంవత్సరాలలో, టీం ఇండియా విదేశీ మైదానాల్లో ఒక్క టెస్ట్ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. గెలిచుకుంటూ వస్తోంది.
ఆస్ట్రేలియా ‘గర్వం’ గబ్బాలో మటాష్..
టీమిండియా ఈ లక్ కనెక్షన్ బ్రిస్బేన్ నుంచే ప్రారంభమైంది. అయితే, భారత జట్టు ఆస్ట్రేలియా గర్వాన్ని బద్దలు కొట్టింది. ఈ మొత్తం అదృష్టం శార్దూల్ ఠాకూర్ 7వ వికెట్ భాగస్వామ్యంతో ముడిపడి ఉంది. 2021లో జరిగిన బ్రిస్బేన్ టెస్టులో, శార్దూల్ ఠాకూర్ వాషింగ్టన్ సుందర్ జోడీ భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ భాగస్వామ్యాన్ని అందించాడు. ఫలితంగా ఆ టెస్టులో టీమిండియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.




2021లో ఓవల్‌లో ఇంగ్లండ్..
శార్దూల్ ఠాకూర్ 7వ వికెట్ సెంచరీ భాగస్వామ్యానికి మరొక ఉదాహరణ. అదే సంవత్సరం ఓవల్‌లో విదేశీ మైదానంలో మళ్లీ కనిపించింది. ఈసారి రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్‌తో కలిసి శార్దూల్ జట్టు స్కోరు బోర్డుకు 100కు పైగా పరుగులు జోడించడంతో ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 157 పరుగుల తేడాతో ఓడిపోయింది.
WTC ఫైనల్‌లోనూ ఆస్ట్రేలియా ఓడిపోతుందా?
2020 సంవత్సరం నుంచి, విదేశీ గడ్డపై 7వ వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం వచ్చినప్పుడల్లా, శార్దూల్ ఠాకూర్ అందులో భాగమయ్యాడు. ఓవల్‌లో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రహానేతో కలిసి శార్దూల్ 109 పరుగులు జోడించాడు.
గబ్బాలో ఆస్ట్రేలియా అహంకారం, ఓవల్‌లో ఇంగ్లండ్ ఓడిపోవడం చూస్తే.. WTC ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఓడిపోవడం చూస్తామా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే టీమ్‌ఇండియాకు ఇప్పటికే అదృష్టం కలిసొచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




