Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Memory Power: పిల్లల ఆహారంలో తప్పక ఉండాల్సిన ఆహారాలు.. తిన్నారంటే జ్ఞాపకశక్తి రెట్టింపు కావడం ఖాయం..!

Memory Power: పిల్లలు నిత్యం ఆరోగ్యంగా, చురుకుగా ఉండేందుకు వారితో పోషకాహారం తినిపించడం తప్పనిసరి. అప్పుడే వారు మానసికంగా, శారీరికంగా కూడా ఎదుగుతారు. లేదంటే వారి ఎదుగుదల కుంటుపడి, భవిష్యత్‌లో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పిల్లలకు బాల్యంలోనే..

Memory Power: పిల్లల ఆహారంలో తప్పక ఉండాల్సిన ఆహారాలు.. తిన్నారంటే జ్ఞాపకశక్తి రెట్టింపు కావడం ఖాయం..!
Health Tips For Kids
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 09, 2023 | 4:31 PM

Memory Power: పిల్లలు నిత్యం ఆరోగ్యంగా, చురుకుగా ఉండేందుకు వారితో పోషకాహారం తినిపించడం తప్పనిసరి. అప్పుడే వారు మానసికంగా, శారీరికంగా కూడా ఎదుగుతారు. లేదంటే వారి ఎదుగుదల కుంటుపడి, భవిష్యత్‌లో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పిల్లలకు బాల్యంలోనే పౌష్టికాహారం అందేలా చేయాలని తల్లిదండ్రులకు పోషకాహార నిపుణులు, వైద్యులు పదేపదే సూచిస్తుంటారు. అయితే ఆహారం అనేది పిల్లల ఆరోగ్యం కోసమే కాక జ్ఞాపకశక్తిని పెంచడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్రమంలో పిల్లలకు నిత్యం కొన్ని రకాల ఆహారాలను విధిగా తినిపించాలని.. తద్వారా వారి జ్ఞాపకశక్తి మెరుగుపడడంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వారు చెబుతున్నారు. మరి వారి సూచనల ప్రకారం పిల్లలు ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

పెరుగు: పెరుగును నిత్యం తినడం ద్వారా అందులోని మంచి బ్యాక్టీరియాతో పాటు అనేక రకాల పోషకాలు కూడా శరీరానికి లభిస్తాయి. ముఖ్యంగా పెరుగులోని ప్రోటీన్‌, బి12, జింక్, సెలీనియం, పాలీఫెనాల్స్ మెదడుకి పదునుపెట్టడంలో కీలకంగా పనిచేస్తాయి. ఫలితంగా పిల్లల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

ఆకు కూరలు: ఆకుకూరలు కూడా పిల్లల జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆకుకూరల్లోని విటమిన్లు ఇ, కె, ఫోలేట్, కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు ఇందుకు సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

గింజలు: బీన్స్, గుమ్మడికాయ, పుచ్చకాయలోని గింజల్లో జింక్, ఫైబర్, ఫోలేట్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వీటిని తినడం వల్ల మానసిక ప్రశాంతత కూడా మెరుగుపడుతుంది.

డ్రైఫ్రూట్స్‌: పిల్లల డైట్‌లో డ్రై ఫ్రూట్స్ ఉండడం కూడా తప్పనిసరి. ఎందుకంటే డ్రైఫ్రూట్స్‌లో పుష్కలంగా ఉండే ఒమేగా-3, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జ్ఞాపకశక్తిని పెంచడానికి పని చేస్తాయి.

అరటిపండు: అరటిపండుతో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని మనకు తెలిసిన విషయమే. అయితే ఇందులోని ప్రొటీన్, ఐరన్, క్యాల్షియం వంటి పలు రకాల పోషకాలు పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…