Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath Yatra 2023: శివయ్య భక్తులకు శుభవార్త.. జూలై నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. షెడ్యూల్ పూర్తి వివరాలివే..

మంచు రూపంలో దర్శనం ఇచ్చే శివయ్యను చూసేందుకు ప్రతి సంవత్సరం లక్షల మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్తుంటారు. భక్తులు ఎంతో శ్రమ కోర్చీ ఈ పుణ్యక్షేత్రానికి వెళ్తారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాత్రికులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అమర్ నాథ్ యాత్ర షెడ్యూల్ ఖరారు..

Amarnath Yatra 2023: శివయ్య భక్తులకు శుభవార్త.. జూలై నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. షెడ్యూల్ పూర్తి వివరాలివే..
Amarnath Yatra 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 09, 2023 | 8:28 PM

Amarnath Yatra 2023: భారతదేశంలోని అత్యంత పవిత్ర శైవ పుణ్య క్షేత్రాల్లో అమర్ నాథ్ ఒకటి. అమర్‌నాథ్ యాత్ర‌కు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని చాలా మంది శివభక్తులు కోరుకుంటారు. ఎందుకంటే.. అమర్‌నాథ్ అంత పవిత్ర పుణ్య క్షేత్రం. ఎత్తైన పర్వతాల మధ్య అమర్‌నాథ్ ఆలయం ఉంటుంది. అయితే భక్తులు ఇక్కడికి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వెళ్లడం కుదరదు. హిమాలయాల్లో కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే ఈ యాత్రకు అవకాశం కల్పిస్తారు. కేవలం రెండు నెలలు మాత్రమే ఇక్కడికి అనుమతిస్తారు. ఆ తేదీల కోసం భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు.

అయితే ఈ యాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అమర్ నాథ్ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు అమర్‌నాథ్ యాత్రకు కేంద్రం ఏర్పాటు చేసింది. దక్షిణ కశ్మీర్​లోని హిమాలయ పర్వతాల్లో, భూమికి 3,880 మీటర్ల ఎత్తులో అమర్​నాథ్​ ఆలయం ఉంది. అమర్‌నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలివెళ్తుంటారు. అనంతనాగ్​జిల్లా పహల్గామ్, గండర్​బాల్​ జిల్లా బల్టాల్​ మార్గాల్లో 2023 అమర్‌నాథ్​యాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంకా ఉదయం, సాయంత్రం ప్రార్థనలను ఈసారి లైవ్ టెలికాస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే.. అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాలు, భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మరోవైపు ఈ యాత్రను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నట్లు ఇటీవల నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఇద్దరు కశ్మీరీ యువకులకు దాడి బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇవి కూడా చదవండి
డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఈ పదార్థాలకు దూరంగా ఉండటమే బెటర్..
డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఈ పదార్థాలకు దూరంగా ఉండటమే బెటర్..
ఈ ఏటీఎంలో బంగారం పెడితే డబ్బులు..గోల్డ్ నాణ్యత కూడా చెప్పేస్తుంది
ఈ ఏటీఎంలో బంగారం పెడితే డబ్బులు..గోల్డ్ నాణ్యత కూడా చెప్పేస్తుంది
ఎండు ద్రాక్ష నీళ్లతో మీ జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది..!
ఎండు ద్రాక్ష నీళ్లతో మీ జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది..!
రెండు వారాల్లోనే బరువు తగ్గాలనుకుంటున్నారా? ఉదయాన్నే ఇది తాగండి
రెండు వారాల్లోనే బరువు తగ్గాలనుకుంటున్నారా? ఉదయాన్నే ఇది తాగండి
ఇవి తింటే మీ ఒంట్లో జబ్బులన్నీ పారిపోతాయ్
ఇవి తింటే మీ ఒంట్లో జబ్బులన్నీ పారిపోతాయ్
భారత్‌తో అట్లుంటాది.. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులు
భారత్‌తో అట్లుంటాది.. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులు
KPHBలో దారుణం..భర్తపై విరక్తి చెంది భార్య ఏం చేసిందంటే!
KPHBలో దారుణం..భర్తపై విరక్తి చెంది భార్య ఏం చేసిందంటే!
బాత్రూం నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడింది చూసి ఆశ్చర్యం
బాత్రూం నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడింది చూసి ఆశ్చర్యం
ధోని డీఆర్‌ఎస్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మోత!
ధోని డీఆర్‌ఎస్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మోత!
పతంజలి మందులతో సోరియాసిస్‌కు చికిత్స.. పరిశోధనలో వెల్లడి
పతంజలి మందులతో సోరియాసిస్‌కు చికిత్స.. పరిశోధనలో వెల్లడి