AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కావ్య మారన్‌తో పెళ్లి..? ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌

సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్, సంగీత దర్శకుడు అనిరుద్ధ్ వివాహం గురించి వస్తున్న పుకార్లను అనిరుద్ధ్ తన సోషల్ మీడియా ద్వారా ఖండించాడు. అయితే, డేటింగ్ పుకార్లకు ఆయన స్పందించలేదు. ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉందని అభిమానులు నమ్ముతున్నారు.

కావ్య మారన్‌తో పెళ్లి..? ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌
Kavya Maran And Anirudh
SN Pasha
|

Updated on: Jun 15, 2025 | 6:43 PM

Share

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్, యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్ రవిచందర్ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారని, ఈ ఇద్దరూ త్వరలో వివాహ జీవితంలోకి అడుగుపెడతారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అలాగే ఇద్దరూ కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారనే వార్త కూడా వైరల్ అయింది. ఈ వార్త దావానలంలా వ్యాపించినప్పటికీ, ఇప్పటివరకు ఇద్దరూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల అభిమానులు కూడా ఈ వార్త నిజమేనని భావించారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయంపై అనిరుధ్ స్పందించాడు. ఒక్క పోస్ట్‌తో కావ్య మారన్‌తో లవ్‌ డేటింగ్‌ విషయంపై క్లారిటీ ఇచ్చి పడేశాడు. ఇంతకీ అనిరుధ్‌ ఏమన్నాడంటే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్‌తో ప్రేమ, వివాహం గురించి వస్తున్న పుకార్లను అనిరుధ్ రవిచందర్ ఖండించాడు. తన అభిమానులు ప్రశాంతంగా ఉండమని విజ్ఞప్తి చేస్తూ, అనిరుధ్ తన అధికారిక ఎక్స్‌ హ్యాండిల్‌లో ‘వివాహం? హహ… ప్రశాంతంగా ఉండండి, దయచేసి పుకార్లు వ్యాప్తి చేయడం ఆపండి’ అని పోస్ట్‌ చేశాడు. ఈ ట్వీట్‌తో, కావ్య మారన్‌తో తన సంబంధం గురించి వస్తున్న అన్ని ఊహాగానాలను అనిరుధ్‌ పుల్‌స్టాప్‌ పెట్టేశాడు. అయితే, డేటింగ్ పుకార్లకు ఆయన ఎటువంటి స్పందన ఇవ్వలేదు. దీంతో ఇద్దరూ ఇంకా వివాహం చేసుకోనప్పటికీ, వారు కచ్చితంగా డేటింగ్ చేస్తున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అనిరుధ్, కావ్య గత ఏడాది కాలంగా డేటింగ్ చేస్తున్నారని, త్వరలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారని పేర్కొంటూ ఒక పోస్ట్ వైరల్ అయింది. ఒక ప్రైవేట్ విందులో ఇద్దరూ కలిసి గడపడం చూశామని కూడా కొంతమంది పేర్కొన్నారు. అనిరుధ్ బంధువు, సూపర్ స్టార్ రజనీకాంత్, కావ్య తండ్రి, సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ తో ఈ సంబంధం గురించి మాట్లాడారని అనే విషయం కూడా వైరల్‌ అయింది.