AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Time Shield Match: షేక్ ఆడించాడు.. పట్ట పగలే బౌలర్లకు చుక్కలు చూపించిన కాటేరమ్మ కొడుకు!

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ అభిషేక్ శర్మ, టైమ్స్ షీల్డ్ మ్యాచ్‌లో 22 బంతుల్లో 60 పరుగులతో ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేశాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీతో ఆకట్టుకున్న అభిషేక్, సూర్యకుమార్ యాదవ్ T20 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు. IPL 2025కి ముందు SRH రిటైన్ చేసిన అభిషేక్, జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు.

Time Shield Match: షేక్ ఆడించాడు.. పట్ట పగలే బౌలర్లకు చుక్కలు చూపించిన కాటేరమ్మ కొడుకు!
Abhishek Sharma
Narsimha
|

Updated on: Dec 12, 2024 | 5:34 PM

Share

టైమ్స్ షీల్డ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 22 బంతుల్లో 60 పరుగులు చేసిన అభిషేక్, తన బ్యాటింగ్ తో పూర్తి టీ20 మోడ్‌లోకి వెళ్లి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా భారీ షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఆ వేగం, ధాటిగా ఆడటంలో ఆయన ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పాడు.

ఇప్పటికే ముస్తాక్ అలీ ట్రోఫీలో అభిషేక్ తన అద్భుత ఫామ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 28 బంతుల్లో సెంచరీ కొట్టిన అభిషేక్, అదే టోర్నమెంట్‌లో గుజరాత్ ఆటగాడు ఉర్విల్ పటేల్ చేసిన రికార్డును సమం చేశాడు. 11 సిక్సర్లతో అలరించిన అభిషేక్, ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక T20 సిక్సర్లు కొట్టిన భారతీయుడిగా సూర్యకుమార్ యాదవ్ రికార్డును తిరగరాశాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు, ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అభిషేక్ శర్మను రిటైన్ చేయడం ఆశ్చర్యం కాదు. IPL 2024లో అభిషేక్ 16 మ్యాచ్‌ల్లో 32.26 సగటుతో, 204.21 స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి అభిషేక్ నెలకొల్పిన ఓపెనింగ్ భాగస్వామ్యం SRH జట్టు విజయానికి వెన్నెముకగా నిలిచింది. వారి దూకుడు బ్యాటింగ్ ప్రత్యర్థి జట్లకు భారంగా మారింది.

అభిషేక్ శర్మ ఇప్పటి వరకు IPLలో 63 మ్యాచ్‌లను ఆడాడు, 155.13 స్ట్రైక్ రేట్‌తో 1376 పరుగులు చేశాడు. భారత్ జట్టులో అతని ప్రయాణం ఒక కొంత అస్థిరంగా ఉన్నప్పటికీ, T20I ఫార్మాట్‌లో 12 మ్యాచ్‌ల్లో 171.81 స్ట్రైక్ రేట్‌తో 256 పరుగులు చేశాడు. అభిషేక్ ఇప్పటికీ తన ప్రదర్శనలతో తానెంత విలువైన ఆటగాడో నిరూపిస్తున్నాడు.