IND vs ZIM: 15 ఏళ్ల బుడ్డోడి రికార్డ్‌కే ఎసరు పెట్టేలా ఉన్నాడే.. మరో 8 మాత్రమే.. అదేంటంటే?
Abhishek Sharma Records: భారత యువ క్రికెటర్లు చూపిస్తున్న ఈ దూకుడు అంతర్జాతీయ స్థాయిలో టీమిండియా ఆధిపత్యాన్ని మరింత పెంచుతోంది. తొలి టీ20లో అభిషేక్ శర్మ వైభవ్ రికార్డును క్రాస్ చేస్తాడో లేక వైభవ్ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంటాడో చూడటం అభిమానులకు వినోదాన్ని అందించనుంది.

Abhishek Sharma Records: క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు సిక్సర్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా భారత యంగ్ గన్ అభిషేక్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమయ్యాడు. జింబాబ్వేతో జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో మరో 8 సిక్సర్లు బాదితే, 2026 క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డును బద్దలు కొడతాడు.
హరారే వేదికగా సంచలనం.. యంగ్ గన్స్ మధ్య సిక్సర్ల వార్..!
జింబాబ్వే పర్యటనలో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పోరులో భారత ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగుతున్న అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల మధ్య ఓ ఆసక్తికరమైన సిక్సర్ల రేసు నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పొట్టి ఫార్మాట్‌లో పరుగుల వరద పారిస్తున్న ఈ ఇద్దరు హిట్టర్లు 2026లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో అగ్రస్థానాల కోసం పోటీ పడుతున్నారు. అయితే, తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే, వైభవ్ సూర్యవంశీ మాత్రం 4 సిక్స్‌లతో రెచ్చిపోయాడు. దీంతో ఈ జాబితాలో వైభవ్ దూకుడు పెంచాడు.
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..!
ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది విధ్వంసకర ఫామ్‌లో ఉన్నాడు. 2026 క్యాలెండర్ ఇయర్ లో అత్యధికంగా 81 సిక్సర్లు బాది భారత్ తరఫున అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో ఐపీఎల్ 2026 సీజన్‌లోనే ఏకంగా 72 సిక్సర్లు విసిరి, 237.3 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
రికార్డుకు 8 సిక్సర్ల దూరంలో ఐసీసీ నంబర్ 2 బ్యాటర్..!
ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న అభిషేక్ శర్మ, 2026 లో ఇప్పటివరకు 74 సిక్సర్లు సాధించి వైభవ్ వెనుకే ఉన్నాడు. ఒకవేళ తొలి టీ20లో వైభవ్ సిక్సర్లు ఏమీ కొట్టకపోతే, అభిషేక్ కేవలం 8 సిక్సర్లు బాదడం ద్వారా వైభవ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంటాడు. ఈ అటాకింగ్ బ్యాటర్ ఫామ్ చూస్తుంటే ఈ రికార్డు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని అనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Team India: ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే..!
2026 మోస్ట్ సిక్సర్స్ జాబితాలో మిగతా మనోళ్లు వీరే..!
ఈ ఇద్దరే కాకుండా మరికొందరు భారత ఆటగాళ్లు కూడా ఈ ఏడాది సిక్సర్ల మోత మోగించారు. ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ ఇషాన్ కిషన్ 69 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. జింబాబ్వే టూర్‌కు దూరమైన సంజూ శామ్సన్ 52 సిక్సర్లతో నాలుగో స్థానంలో ఉండగా, సీఎస్కే ఆల్ రౌండర్ శివం దూబే 49 సిక్సర్లు బాది 50 సిక్సర్ల మైలురాయికి ఒక్క సిక్స్ దూరంలో నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




