AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. మళ్లీ తగ్గుతున్న ధరలు.. లేటెస్ట్‌గా తులం ఎంతుందంటే..

బంగారం, వెండి ధరల్లో మరోసారి స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.10 తగ్గి రూ.1,44,320కు చేరగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,32,290గా నమోదైంది. వెండి కిలో ధర కూడా రూ.100 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖతో పాటు ప్రధాన నగరాల్లో తాజా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Gold Price: బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. మళ్లీ తగ్గుతున్న ధరలు.. లేటెస్ట్‌గా తులం ఎంతుందంటే..
Gold Rate
Shaik Madar Saheb
|

Updated on: Jul 25, 2026 | 6:43 AM

Share

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన పసిడి ధరలు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఈ క్రమంలోనే మళ్లీ ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా.. ఇరాన్-అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, తదితర పరిణామాల వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా.. సోమవారం నుంచి పెరిగిన ధరలు.. శుక్రవారం కాస్త ఊరటనిచ్చాయి.. శుక్రవారం ఒక్కరోజే.. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై దాదాపు రూ.1700ల మేర ధర తగ్గింది. తాజాగా కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి..

పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా శనివారం (జులై 25) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ.10 మేర తగ్గి.. రూ.1,44,320 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 మేర తగ్గి రూ.1,32,290 గా ఉంది.

వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి.. రూ.2,34,900 లుగా కొనసాగుతోంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,44,320, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,32,290 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,44,320, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,32,290 ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,44,470, 22 క్యారెట్ల ధర రూ.1,32,440 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,44,320, 22 క్యారెట్ల ధర రూ.1,32,290 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,44,320, 22 క్యారెట్ల ధర రూ.1,32,290 ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,44,320, 22 క్యారెట్ల ధర రూ.1,32,290 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us