AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: సచిన్‌, ధోని, కోహ్లీలాగే హిట్‌మ్యాన్‌కూ అరుదైన గౌరవం.. ఆ స్టేడియాల్లోని స్టాండ్స్‌కు రోహిత్‌ పేరు

భారత్‌లోని కొన్ని క్రికెట్‌ మైదానాలతో హిట్‌మ్యాన్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. సొంతగడ్డ ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్‌ మైదానం అలాగే కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానాలు టీమిండియా కెప్టెన్‌కు బాగా అచ్చొచ్చాయి.

Rohit Sharma: సచిన్‌, ధోని, కోహ్లీలాగే హిట్‌మ్యాన్‌కూ అరుదైన గౌరవం.. ఆ స్టేడియాల్లోని స్టాండ్స్‌కు రోహిత్‌ పేరు
Rohit Sharma
Basha Shek
| Edited By: |

Updated on: Jan 21, 2023 | 8:52 AM

Share

3 వన్డే డబుల్ సెంచరీలు.. 29 వన్డే సెంచరీలు.. 5 ఐపీఎల్‌ ట్రోఫీలు.. క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సాధించిన రికార్డుల్లో ఇవి కొన్ని మాత్రమే. సుమారు 15 ఏళ్ల క్రితం జట్టులోకి అడుగుపెట్టిన హిట్‌మ్యాన్‌ తనదైన స్ట్రోక్‌ ప్లేతో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి భీకర బౌలింగ్‌నైనా చిత్తు చేసే సామర్థ్యం హిట్‌మ్యాన్‌ సొంతం. అందుకే మరెవరికీ సాధ్యం కాని విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఏకంగా మూడు డబుల్‌ సెంచరీలు బాదాడు. సెంచరీల మీద సెంచరీలు బాదాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 30 వన్డే సెంచరీలు ఉన్నాయి. ఇక కెప్టెన్‌గానూ హిట్‌మ్యాన్‌ పేరిట ఘనమైన రికార్డులు ఉన్నాయి. అతని సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ ఏకంగా 5 సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌ నిలిచింది. ఈ రికార్డులనే చూసే టీమిండియా సారథ్య బాధ్యతలను రోహిత్‌కు అప్పగించింది. ఈ ఏడాది మనదేశంలోనే 50 ఓవర్ల ప్రపంచకప్‌ జరగనుంది. రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఈ టోర్నీలో అడుగుపెట్టనుంది. ఇదిలా ఉంటే భారత్‌లోని కొన్ని క్రికెట్‌ మైదానాలతో హిట్‌మ్యాన్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. సొంతగడ్డ ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్‌ మైదానం అలాగే కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానాలు టీమిండియా కెప్టెన్‌కు బాగా అచ్చొచ్చాయి. ఈక్రమంలో భారత క్రికెట్‌కు రోహిత్‌ అందించిన సేవలకు గుర్తుగా ఈ మైదానాల్లోని స్టాండ్స్‌లకు రోహిత్ పేరు పెట్టాలని సోషల్‌ మీడియాలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోరుతున్నారు.

నిజానికి క్రికెట్ గ్రౌండ్స్‌లో చాలా మంది మాజీ ఆటగాళ్ల పేర్లతో పెవిలియన్‌లు, స్టాండ్స్‌ ఉన్నాయి. అయితే ప్రస్తుత ఆటగాడి పేరు మీద పెవిలియన్‌లు పెట్టిన సందర్భాలు చాలా తక్కువ. కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే ఇది సాధ్యమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పెవిలియన్‌కు విరాట్‌ స్టాండ్‌గా పేరు మార్చారు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఈ జాబితాలో చేరనున్నాడు. అతనితో ప్రత్యేక అనుబంధమున్న కొన్ని స్టేడియాల్లోని స్టాండ్స్‌కు రోహిత్‌ పేరు పెట్టాలన్న ఆలోచన ఉంది. అవేంటంటే..

ఇవి కూడా చదవండి

ఈడెన్‌ గార్డెన్‌- కోల్‌కతా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో హిట్‌మ్యాన్‌కు ఘనమైన రికార్డులు న్నాయి. ఇక్కడ అన్ని ఫార్మాట్లలో కలిపి ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ 71.12 సగటుతో 569 పరుగులు చేశాడు. ఇక IPL 2015 విజయంతో పాటు శ్రీలంకపై 264 పరుగుల ఇన్నింగ్స్‌కు కూడా ఈ మైదానమే వేదికగా నిలిచింది. ఇక అతని టెస్ట్‌ అరంగేట్రం కూడా ఇక్కడే జరిగింది. 2013 నవంబర్‌6న వెస్టిండీస్‌తో జరిగిన ఆరంభ టెస్టులో రోహిత్‌ 177 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

వాంఖడే స్టేడియం- ముంబై ఇక వాంఖడే స్టేడియం రోహిత్‌కు సొంత అడ్డాలాంటిది. ఇక్కడి ఎర్రమట్టితో కూడిన వికెట్‌ హిట్‌మ్యాన్‌ శైలికి సరిగ్గా సరిపోతుంది. అందుకే టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కలిసి ఇక్కడ లెక్కలేనన్ని పరుగులు సాధించాడు రోహిత్‌. ఇక వాంఖడే స్టేడియం ప్రపంచంలోనే తనకు ఇష్టమైన మైదానాల్లో ఒకటని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు టీమిండయా కెప్టెన్.

బ్రబౌర్న్ స్టేడియం- ముంబై రోహిత్‌కు బాగా అచ్చొచ్చిన మైదానాల్లో బ్రబౌర్న్‌ స్టేడియం కూడా ఒకటి. 2009లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఇదే మైదానంలో గుజరాత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో సెంచరీ కొట్టాడు రోహిత్‌ . తద్వారాఈ ఘనత సాధించిన మొదటి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. అంతేకాదు అతని తొలి ఫస్ట్‌క్లాస్ ట్రిపుల్ సెంచరీకి కూడా ఈ మైదానమే సాక్షి. ఇక 2018లో ఇదే మైదానంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 162 పరుగుల సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..