CWG 2022: గ్రీకో-రోమన్ రెజ్లింగ్‌లో పసిడితో చరిత్ర సృష్టించిన సూరజ్.. కామన్వెల్త్ క్రీడల్లోని భారతీయ రెజ్లర్ల ఉత్సాహం రెట్టింపు

గత 32 ఏళ్ల తర్వాత సూరజ్ పసిడితో ప్రకాశిస్తూ చరిత్ర సృష్టించాడు. ఈ విజయం భారతదేశం పేరును మాత్రమే కాకుండా.. బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటున్న భారతీయ రెజ్లర్ల ఉత్సాహాన్ని  రెట్టింపు చేసింది

CWG 2022: గ్రీకో-రోమన్ రెజ్లింగ్‌లో పసిడితో చరిత్ర సృష్టించిన సూరజ్.. కామన్వెల్త్ క్రీడల్లోని భారతీయ రెజ్లర్ల ఉత్సాహం రెట్టింపు
Wrestler Suraj Vashisht
Follow us
Surya Kala

|

Updated on: Jul 27, 2022 | 11:19 AM

Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడలు ప్రారంభానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంగ్లాండ్ లోని బర్మింగ్‌హోమ్ వేదికగా రేపటి నుంచి ఆగష్టు 9వ తేదీ వరకూ ఈ పోటీలు జరగనున్నాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ పోటీల్లో ఈ సారి కూడా భారత్ సత్తా చాటుతుందని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 22వ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనడానికి భారత్ బృందం ఇప్పటికే బర్మింగ్‌హోమ్ కు చేరుకుంది. అయితే ఆదిలో భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది.. మంచి ఫామ్ లో ఉన్న నీరజ్ చోప్రా పై ఎన్నో ఆశలను పెట్టుకున్నారు.. అయితే ప్రారంభానికి ముందే.. మొదలు పెట్టకుండానే నీరజ్ పోటీల నుంచి గాయంతో అవుట్ అయ్యాడు. అయితే ఈ సారి పోటీల్లో భారత రెజ్లర్లు పతకాలు తెస్తారని ఆశతో ఉన్నారు క్రీడాభిమానులు. అంతేకాదు ఇప్పటికే భారత రెజ్లర్ల పోటీల్లో దుమ్ము రేపుతారంటూ బెట్టింగ్‌లు ప్రారంభించారు కూడా.

ముఖ్యంగా రెజ్లర్ సూరజ్ పతాకాన్ని తెస్తాడని భారీ ఆశలను పెట్టుకున్నారు.. 32 సంవత్సరాలుగా భారతదేశం కోల్పోయిన కీర్తి, గౌరవాన్ని తిరిగి సూరజ్ తెస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో చాపపై పోరాడిన భారత రెజ్లర్ సూరజ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అండర్-17 విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.

భారత్ తరఫున గ్రీకో-రోమన్ రెజ్లింగ్‌లో సూరజ్ చరిత్ర సృష్టించాడు. వాస్తవానికి..  గత 32 సంవత్సరాలుగా ఈ రెజ్లింగ్ ఈవెంట్‌లో అండర్-17 విభాగంలో భారతదేశానికి చెందిన క్రీడాకారులు పాల్గొనలేదు. అయితే ఈసారి ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో సూరజ్ ప్రకాశించించాడు. గ్రీకో-రోమన్ రెజ్లింగ్‌లో అండర్-17 విభాగంలో దేశానికి చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

ఇవి కూడా చదవండి

32 ఏళ్ల తర్వాత సూర్యుడు ప్రకాశిస్తూ చరిత్ర సృష్టించాడు 1990లో జరిగిన ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్‌షిప్ చాంపియన్‌షిప్‌లో అండర్-17 కేటగిరీ రెజ్లింగ్‌లో భారత రెజ్లర్ చివరిసారిగా ఛాంపియన్‌గా నిలిచాడు. అప్పుడు భారత రెజ్లర్ పప్పు యాదవ్ దేశం పేరును వెలుగులోకి తెచ్చాడు. మళ్ళీ గత 32 ఏళ్ల తర్వాత సూరజ్ పసిడితో ప్రకాశిస్తూ చరిత్ర సృష్టించాడు

ఈ విజయం భారతదేశం పేరును మాత్రమే కాకుండా.. బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటున్న భారతీయ రెజ్లర్ల ఉత్సాహాన్ని  రెట్టింపు చేసింది. అంతేకాదు ఇప్పుడు బజరంగ్ నాయకత్వంలోని భారత రెజ్లింగ్ జట్టు కూడా కామన్వెల్త్ గేమ్స్‌లో త్రివర్ణ పతాకాన్ని  రెపరెపలాడిస్తుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!