కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభానికి ముందు ఒలింపిక్ పతక విజేత బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ సమాఖ్యపై తీవ్ర ఆరోపణ చేసి సంచలనం సృష్టించింది. రాజకీయాల కారణంగా తన పోటీలకు సన్నద్ధత దెబ్బతినడంతో పాటు మానసిక వేధింపులు కూడా ఎదురవుతున్నాయని లోవ్లీనా ఆరోపించింది. ఈ ఆరోపణలతో మళ్ళీ అంతర్జాతీయ పోటీలకు ముందు ఆటగాళ్లపై ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే విషయం మరోసారి తెరపైకి వచ్చింది. కామన్వెల్త్, ఆసియా లేదా ఒలింపిక్ క్రీడలలో, కోచ్, ఫిజియో గురించి ఎప్పటి నుండో ఇలాంటి వివాదాలు వినిపిస్తూనే ఉన్నాయి.