Watch Video: పతక పోరులో ఫైనల్ ఛాన్స్.. అంతా సిద్ధం.. కట్ చేస్తే.. ఊహించని ప్రమాదంలో ఆటగాడు..
World Athletics Championship: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఒక ఆటగాడికి బాధాకరమైన ప్రమాదం జరిగింది. దాని కారణంగా అతను పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో పతకాన్ని కోల్పోయాడు.
ప్రస్తుతం అమెరికాలో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు. కానీ ఈ ఛాంపియన్‌షిప్‌లో, ఆటగాడు పొరపాటున ప్రమాదంలో చిక్కుకపోయాడు. ఈ టోర్నీలో చెక్ రిపబ్లిక్ ఆటగాడికి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఆటగాడు పోల్ వాల్టర్ జిరి సియాకోరా. పతకం సాధించాలని జిరి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ, మధ్యలో అతనికి ప్రమాదం జరిగింది. నెట్టింట్లో షేర్ చేసిన ఈ వీడియో, అభిమానులకు భావోద్వేగానికి గురి చేసింది.
డెకాథ్లాన్ ఎనిమిదో ఈవెంట్‌లో జిరి తన సత్తాను చాటేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలోనే ఆయనకు ప్రమాదం జరిగింది. ఈ పోల్ వాల్టర్ తన మొదటి ప్రయత్నంలోనే 4.10 మీటర్ల దూరాన్ని అధిగమించాడు. ఆ తర్వాత 4.30 మీటర్ల దూరాన్ని కూడా అధిగమించాడు.
Pértiga rota para el decatleta checo Jiri Sýkora… espero que sea diestro para lanzar jabalina, porque se ha hecho un corte importante en la mano izquierda.
Se había llevado un buen susto al saltar la primera altura (4.60) a la tercera, pero no tan gordo como éste. pic.twitter.com/f2uamudbgU
— Miguel del Pozo (@ricohill8) July 24, 2022
జిరి మూడో ప్రయత్నం చేయబోతుండగా, అతని కర్ర విరిగింది. దీంతో ఆయన గాయపడ్డాడు. పరుగెత్తుకుంటూ వచ్చి, తన కర్రను నేలపై ఉంచి దూకడానికి ప్రయత్నించిన వెంటనే అది రెండు ముక్కలైంది. విరిగి నేలపై పడిపోవడంతో కొన్ని మీటర్లు మాత్రమే వెళ్లగలిగాడు. దీంతో జిరి తన పేరును ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో అతని చేయి విరిగింది. జిరి ఒక జూనియర్ డెకాథ్లాన్ ఛాంపియన్. జిరి ఈ ఈవెంట్‌లో పతకం కోసం రేసులో ఉన్నాడు. కానీ, గాయం కారణంగా రేసు నుంచి తప్పుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అతని ప్రయాణం ముగిసింది.
డెకాథ్లాన్ ఈవెంట్‌లో ఫ్రెంచ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కెవిన్ మీర్ విజేతగా నిలిచాడు . ఆదివారం సాధించిన పాయింట్లే అతని విజయానికి కారణం. తనను తాను ఆరో స్థానం నుంచి ప్రథమ స్థానం దూసుకరావడంతో, బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..