Commonwealth Games 2022: ఆ సందడి.. ఆ జోష్ ఎక్కడా..! కామన్వెల్త్ గేమ్స్‌ను పట్టించుకోని స్థానిక జనం..
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ జూలై 28 నుంచి ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ప్రారంభం కానున్నాయి. 72 దేశాల నుండి 5000 మందికి పైగా క్రీడాకారులు ఈ పెద్ద క్రీడల ఈవెంట్‌లో పాల్గొంటున్నారు.
కామన్వెల్త్ గేమ్స్ 2022 ఇంగ్లండ్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన బర్మింగ్‌హామ్‌లో జరగనుంది. ఇప్పుడు ప్రారంభోత్సవానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. కానీ ఈ నగరంలో ఆ సందడి.. ఆ జోష్.. కనిపించడం లేదు. ప్రపంచం మొత్తం ఇటే చూస్తున్నా.. అక్కడివారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నా.. అక్కడి ప్రజలు తమకు పట్టనట్లుగా వ్యవహరించడం విచిత్రంగా కనిపిస్తోంది. 2012లో జరిగిన ఒలింపిక్స్ సందర్భంలో అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. చైనాను మించిన స్థాయిలో ఏర్పాట్లు చేశారు.. అదే జరగలేదు. ఇక్కడి హీత్రూ విమానాశ్రయం మాత్రం దేశ విదేశాల నుంచి వస్తున్నవారితో రద్దీగా మారింది. అయితే అక్కడి రోడ్లు సాధారణ రోజుల మాదిరిగానే కనిపిస్తాయి. కొన్ని పోస్టర్లు, బిల్‌బోర్డ్‌లు చూస్తుంటే ఏదో పెద్ద ఈవెంట్ జరగబోతోందని అనిపిస్తోంది.. కానీ ఇది కాకుండా అంతా మామూలే.
72 దేశాల నుంచి 5000 మందికి పైగా అథ్లెట్లు బర్మింగ్‌హామ్‌కు చేరుకున్నారు. ఖేల్‌గావ్‌లో దాని స్థానంలో సన్నాహాలు జరుగుతున్నాయి. బయటి వ్యక్తులు కూడా వస్తూ పోతూనే ఉన్నారు. కానీ స్థానిక ప్రజలు మాత్రం తమ దినచర్యలో నిమగ్నమై ఉన్నారు. లండన్ నుంచి బర్మింగ్‌హామ్‌కు రైలులో ప్రయాణిస్తున్న కొందరు ఈవెంట్ గురించి తమకు తెలియదని అనటం ఆశ్చర్యం. కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులు వాలంటీర్ల కోసం వెతుకుతున్నప్పుడు తాము దాని గురించి ఒకటి లేదా రెండు సంవత్సరాల క్రితం చదివామన్నారు. కానీ ఆ తర్వాత వాటి గురించి తనకు పెద్దగా తెలియదన్నారు. లండన్‌లో నివసిస్తున్న ఒక స్కాటిష్ వ్యక్తి, ‘ఈ ఆటలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో కూడా తమకు తెలియదని స్థానిక మీడియాకు చెప్పడం విచిత్రంగా ఉంది.
ఇదిలావుంటే కామన్వెల్త్ క్రీడల నిర్వాహకులు రానున్న రోజుల్లో ఇక్కడికి ఎంతో మంది ప్రేక్షకులు రాబోతున్నారని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్‌లోని వివిధ ఈవెంట్‌లను వీక్షించేందుకు ఇప్పటివరకు 12 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ కార్యక్రమం సాగుతున్న కొద్దీ సిటీలో దీని క్రేజ్ కూడా పెరుగుతుందని అంటున్నారు.
మరిన్న కామన్వెల్త్ గేమ్స్ 2022 న్యూస్ కోసం..