Mike Tyson: వీల్‌చైర్‌లో వాకింగ్‌ స్టిక్‌తో మైక్‌ టైసన్‌.. లెజెండరీ బాక్సర్‌కు ఏమైందని ఫ్యాన్స్‌ ఆందోళన

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)నటిస్తోన్న లైగర్‌ (Liger) సినిమాతో మొదటిసారి భారతీయ సినిమా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు దిగ్గజ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ (Mike Tyson). దీంతో ఎప్పుడెప్పుడు సిల్వర్‌ స్ర్కీన్‌పై టైసన్‌ను చూద్దామా? అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Mike Tyson: వీల్‌చైర్‌లో వాకింగ్‌ స్టిక్‌తో మైక్‌ టైసన్‌.. లెజెండరీ బాక్సర్‌కు ఏమైందని ఫ్యాన్స్‌ ఆందోళన
Mike Tyson
Follow us
Basha Shek

|

Updated on: Aug 18, 2022 | 3:47 PM

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)నటిస్తోన్న లైగర్‌ (Liger) సినిమాతో మొదటిసారి భారతీయ సినిమా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు దిగ్గజ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ (Mike Tyson). దీంతో ఎప్పుడెప్పుడు సిల్వర్‌ స్ర్కీన్‌పై టైసన్‌ను చూద్దామా? అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మైక్‌ టైసన్‌కు సంబంధించిన కొన్ని తాజా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు లైగర్‌ ప్రమోషన్స్‌లో బిజిబిజీగా గడిపిన మైక్‌.. ఇప్పుడు వీల్‌చైర్లో కూర్చొని కదల్లేని పరిస్థితుల్లో కనిపించాడు. చేతిలో ఒక వాకింగ్‌ స్టిక్‌ కూడా ఉంది. ఈ ఫొటోలను చూసిన అభిమానులంతా లెజెండరీ బాక్సర్‌కు ఏమైందోనని తెగ ఆందోళన చెందుతున్నారు. లైగర్‌ షూటింగ్‌లో ఎంతో హుషారుగా కనిపించిన ఆయన సడెన్‌గా ఎందుకిలా అయిపోయారని టెన్షన్‌ పడుతున్నారు. ఈ దృశ్యాలు టైసన్‌ మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసినవని తెలుస్తోంది.

అయితే టైసన్‌ వీల్‌చైర్లో కూర్చొని కదల్లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కొందరు ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడిన తీరుపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా మైక్‌ గత కొంతకాలంగా వెన్నునొప్పి, సయాటికా సమస్యలతో బాధపడుతున్నారట. అందుకే వైద్యులు వీల్‌చైర్‌ను వాడాలని సూచించారట. ఇదిలా ఉంటే 56 ఏళ్ల మైక్‌ టైసన్‌ ఇటీవల ఓ సందర్భంలో తన ఎక్స్‌పైరీ డేట్‌ దగ్గర పడుతోందంటూ చేసిన వ్యాఖ్యలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కాగా పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్‌ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో లైగర్‌ను ఢీకొట్టే బాక్సర్‌గా మైక్‌ కనిపించనున్నాడని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..