Yuzuvendra Chahal: ‘విడాకుల వార్తల’పై స్పందించిన చాహల్.. అలాంటివి నమ్మోద్దంటూ..
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ (Yuzuvendra Chahal), అతని సతీమణి ధనశ్రీవర్మ (Dhanashree Verma) విడాకుల తీసుకుంటున్నట్లు గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాతో పాటు
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ (Yuzuvendra Chahal), అతని సతీమణి ధనశ్రీవర్మ (Dhanashree Verma) విడాకుల తీసుకుంటున్నట్లు గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాతో పాటు పలు వెబ్‌సైట్లలోనూ ఈ దంపతులపై ఇబ్బడిముబ్బడిగా కథనాలు వస్తున్నాయి. పరస్పర అంగీకారంతో పంజాబ్ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని పుకార్లు వచ్చాయి. దీనికి తోడు ధనశ్రీ వర్మ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఇంటిపేరును తొలగించుకోవడం, కొత్త జీవితం లోడ్ అవుతోంది అంటూ ఇన్‌స్టా రీల్‌లో చాహల్ ఓ ఫొటోను పంచుకోవడంతో వీరి విడాకుల వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. తాజాగా ఈ వదంతులపై చాహల్ స్పందించాడు. తమ రిలేషన్‌షిప్‌కి సోషల్ మీడియాలో వస్తోన్న పుకార్లు, వదంతులను నమ్మోద్దని సూచించాడు. దయచేసి ఇలాంటి రూమర్లను క్రియేట్ చేయద్దని విజ్ఞప్తి చేశాడు. కాగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANI సోషల్ మీడియా ఖాతాల పేరిట వీరి డైవోర్స్ వార్తలు, పోస్టులు షేర్ చేయడంతో చాలామంది నిజమేనని భావించారు. అయితే అవన్నీ నకిలీ అకౌంట్లని ANI స్పష్టం చేసింది. ఈ మేరకు తమ అధికారిక ఖాతాల్లో ఫేక్ అకౌంట్స్ పోస్టులను షేర్ చేసింది. ఇలాంటి నకిలీ అకౌంట్లను చూసి మోసపోవద్దని సూచించింది.
కాగా యుజువేంద్రా చాహల్, ధనశ్రీ వర్మ 2020 డిసెంబర్20న పెళ్లిపీటలెక్కారు. చాహల్ టీమిండియాలో స్పిన్నర్‌గా రాణిస్తోంటే.. ధనశ్రీ ఫేమస్ యూట్యూబర్‌గా, కొరియోగ్రాఫర్‌గా రాణిస్తోంది. కాగా ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ లవ్లీ కపుల్ విడిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ దీనిపైనే చర్చ సాగుతోంది. మరి ఈ వదంతులకు బ్రేక్ పడాలంటే ఇద్దరిలో ఒకరైనా నోరు విప్పాల్సిందే.
Please note: All three are fake accounts impersonating ANI. No such news has been flashed. pic.twitter.com/rIRwhzneit
— ANI (@ANI) August 18, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..