IND vs ZIM: చెలరేగిన చాహర్.. ధావన్, గిల్ మెరుపులు.. మొదటి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ
IND vs ZIM 1st ODI: జింబాబ్వే పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. ఫాస్ట్ బౌలర్ల అద్భుత ప్రదర్శనకు తోడు ఓపెనింగ్ జోడీ శిఖర్ ధావన్ శుభ్‌మన్ గిల్ రాణించడంతో మొదటి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది.
IND vs ZIM 1st ODI: జింబాబ్వే పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. ఫాస్ట్ బౌలర్ల అద్భుత ప్రదర్శనకు తోడు ఓపెనింగ్ జోడీ శిఖర్ ధావన్ శుభ్‌మన్ గిల్ రాణించడంతో మొదటి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణతో పాటు స్పిన్నర్ అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఇద్దరూ అర్ధసెంచరీలత రాణించడంతో కేవలం 31 ఓవర్లలోనే విజయం ఖరారైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. మూడు వికెట్లు పడగొట్టి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన దీపక్ చాహర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
చాహర్ రీ ఎంట్రీ అదుర్స్..
కాగా ఆసియా కప్‌కు ముందు ఫామ్‌ను అందిపుచ్చుకునేందుకు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు వస్తాడని చాలా భావించారు. అయితే కరేబియన్ దీవుల్లో ఆకట్టుకున్న ధావన్- గిల్ జోడీనే మరోసారి ఓపెనింగ్‌కు దిగారు. మరో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు సులభమైన విజయాన్ని అందించారు. ఆరంభంలో ధావన్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేసినప్పటికీ గిల్ క్రమంగా గేర్లు మార్చుతూ బౌండరీల వర్షం కురిపించాడు. గిల్ 82 పరుగులతో (72 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) నాటౌట్ గా నిలవగా, ధావన్ 81 పరుగులు (113 బంతులు, 9 ఫోర్లు)తో తన వంతు సహాయం అందించాడు. అంతకుముందు దీపక్ చాహర్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ తలా 3 వికెట్లు పడగొట్టి జింబాబ్వేను కట్టడి చేశారు. ముఖ్యంగా చాలా కాలం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన చాహర్ భారత్‌కు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు . మొదటి పవర్‌ప్లేలోనే జింబాబ్వే టాప్ 3 వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు ఇతర బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో జింబాబ్వే తక్కువ స్కోరుకే పరిమితమైంది.
Shubman Gill scored a fine 82* off 72 deliveries and is our Top Performer from the second innings.