‘ఎ’ గ్రేడ్‌‌కు పంత్…‘ఎ+’ నుంచి ధావన్‌, భువి ఔట్

ముంబయి: 2018-19 సంవత్సరానికి గాను బిసిసిఐ ఇండియన్ ప్లేయర్స్‌కు కాంట్రాక్ట్ గ్రేడ్స్ ఎలాట్ చేసింది. మొత్తానికి రిషబ్ పంత్ పడిన కష్టానికి ఫలితం లభించింది. బీసీసీఐ అతడికి ‘ఎ’ గ్రేడ్‌ ప్లేయర్ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. దీని విలువ ఒక్క ఏడాదికి రూ. 5 కోట్లు. 21 ఏళ్ల పంత్‌ 2017-18లో 26 మంది కాంట్రాక్ట్‌ గల ఆటగాళ్ల జాబితాలోనే లేడు. ఎ+ తర్వాత అత్యధిక మొత్తం లభించేది ‘ఎ’ గ్రేడ్‌లోనే. బీసీసీఐ గతేడాది ‘ఎ+’ విభాగాన్ని […]

‘ఎ’ గ్రేడ్‌‌కు పంత్...‘ఎ+’ నుంచి ధావన్‌, భువి ఔట్
Follow us

|

Updated on: Mar 08, 2019 | 4:16 PM

ముంబయి: 2018-19 సంవత్సరానికి గాను బిసిసిఐ ఇండియన్ ప్లేయర్స్‌కు కాంట్రాక్ట్ గ్రేడ్స్ ఎలాట్ చేసింది. మొత్తానికి రిషబ్ పంత్ పడిన కష్టానికి ఫలితం లభించింది. బీసీసీఐ అతడికి ‘ఎ’ గ్రేడ్‌ ప్లేయర్ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. దీని విలువ ఒక్క ఏడాదికి రూ. 5 కోట్లు. 21 ఏళ్ల పంత్‌ 2017-18లో 26 మంది కాంట్రాక్ట్‌ గల ఆటగాళ్ల జాబితాలోనే లేడు. ఎ+ తర్వాత అత్యధిక మొత్తం లభించేది ‘ఎ’ గ్రేడ్‌లోనే.

బీసీసీఐ గతేడాది ‘ఎ+’ విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి రూ.7 కోట్లు లభించే ఈ విభాగంలోకి అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు వస్తారు. నిరుడు ఈ విభాగంలో ఐదుగురు ఉండగా.. ఈసారి ముగ్గురే ఉన్నారు. వాళ్లు కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా. గతేడాది ఇదే కాంట్రాక్ట్‌లో ఉన్న భువనేశ్వర్‌, ధావన్‌లు ‘ఎ+’లో చోటు కోల్పోయారు. 2018 అక్టోబరు 1 నుంచి 2019 సెప్టెంబరు 30 వరకు కొత్త కాంట్రాక్టు అమలులో ఉంటుంది. పుజారా గ్రేడ్‌-ఏలో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. హనుమ విహారికి గ్రేడ్‌ ‘సి’ కాంట్రాక్ట్‌ దక్కింది. మహిళల విభాగంలో అత్యుత్తమ గ్రేడ్‌ అయిన ‘ఎ’ గ్రేడ్‌ (రూ.50 లక్షలు)లో మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన, పూనమ్‌ యాదవ్‌లకు చోటు లభించింది. తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి రూ.10 లక్షలు లభించే గ్రేడ్‌ ‘సి’లో ఉంది.

భారత ఆటగాళ్ల గ్రేడ్ల వివరాలు: గ్రేడ్‌ ‘ఎ+’ (రూ.7 కోట్లు): కోహ్లి, రోహిత్‌ శర్మ, బుమ్రా గ్రేడ్‌ ‘ఎ’ (రూ.5 కోట్లు): పుజారా, రహానె, ధోని, ధావన్‌, షమి, ఇషాంత్‌, కుల్‌దీప్‌, రిషబ్‌ పంత్‌, అశ్విన్‌, జడేజా, భువనేశ్వర్‌ గ్రేడ్‌ ‘బి’ (రూ.3 కోట్లు): చాహల్‌, హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌, ఉమేశ్‌ యాదవ్‌ గ్రేడ్‌ ‘సి’ (రూ.1 కోటి): మనీష్‌ పాండే, హనుమ విహారి, ఖలీల్‌ అహ్మద్‌, సాహా, కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌, అంబటి రాయుడు

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?