Shane Warne Death: క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ కన్నుమూత.. దిగ్భ్రాంతికి గురైన క్రికెట్ ప్రేమికులు

ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌(52) హఠాన్మరణం చెందారు. థాయ్​లాండ్​లో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసి క్రీడా ప్రపంచం షాక్​కు గురైంది.

Shane Warne Death: క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ కన్నుమూత.. దిగ్భ్రాంతికి గురైన క్రికెట్ ప్రేమికులు
Shane Warne
Follow us
Ram Naramaneni

| Edited By: Subhash Goud

Updated on: Mar 05, 2022 | 6:39 AM

Shane Warne Passes away: ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ (52) ఆకస్మికంగా మృతి చెందారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. థాయిలాండ్‌లోని కోహ్ సమీయులో షేన్ వార్న్ విల్లాలో అచేతనంగా పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వార్న్ మరణ వార్త తెలిసి.. క్రికెట్ ప్రముఖులతో పాటు ఆయన ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురవుతున్నారు.  15 సంవత్సరాల పాటు ఆస్ట్రేలియా తరఫున గ్రేట్ బౌలర్‌గా రాణించాడు వార్న్. 145 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు తీసుకున్నారు. ఒక ఇన్నింగ్స్ లో అత్యధికంగా ఎనిమిది వికెట్లు, ఒక మ్యాచ్ లో 12 వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. 194 వన్డేలు ఆడి.. 293 వికెట్లు పడగొట్టారు. బ్యాట్స్ మెన్ గా కూడా షేన్ వార్న్ రాణించారు. 3,154 పరుగులు చేశారు. షేన్​వార్న్​ టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్లు, 10 సార్లు 10 వికెట్లు తీసి రేర్ రికార్డు క్రియేట్ చేశారు. ఐపీఎల్​లో 2008లో రాజస్థాన్‌ రాయల్స్‌కు సారథిగా వ్యవహరించాడు. వార్న్ మరణం పట్ల భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో తన సంతాపాన్ని వ్యక్తం చేశాడు.

ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ కూడా శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. 1970 నుంచి 1984వ సంవత్సరం వరకు ఆస్ట్రేలియా తరపున 96 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రాడ్ మార్ష్ అడిలైడ్ ఆసుపత్రిలో మరణించినట్లు స్పోర్ట్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ శుక్రవారం తెలిపింది. రాడ్ మార్ష్ మృతిపై ఈ రోజు ఉదయం ట్వీట్ వేశాడు షేన్ వార్న్. అతడో లెజెండ్ అని.. ఎంతో మందికి ప్రేరణ అని పేర్కొన్నాడు. మార్నింగ్  సంతాప ట్వీట్ వేసిన వార్న్.. సాయంత్రానికి గుండెపోటుతో మరణించడం చర్చనీయాంశమైంది. 

Also Read: శివుని చెంత జాగారంలో జనం.. ఊర్లో నుంచి శబ్ధాలు.. పరుగు పరుగున వెళ్లి చూడగా..

టక్కులాడి.. కి’లేడీ’.. ఏం చేసిందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది..