AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccination: రేపటితో ముగియనున్న టీకా వారోత్సవం.. టీకా ఈక్విటీలో వెనుకబడిన మహిళలు..!

Vaccination: ప్రస్తుతం ప్రపంచం మొత్తం వింత వింత వ్యాధులతో సతమతంఅవుతోంది. ఇలాంటి టిరక రకాల వ్యాధుల నుంచి అన్ని వయసుల వారిని రక్షించాలనే ఉద్దేశంతో, టీకాల వినియోగాన్ని..

Vaccination: రేపటితో ముగియనున్న టీకా వారోత్సవం.. టీకా ఈక్విటీలో వెనుకబడిన మహిళలు..!
Narender Vaitla
|

Updated on: Jul 04, 2022 | 4:03 PM

Share

Vaccination: ప్రస్తుతం ప్రపంచం మొత్తం వింత వింత వ్యాధులతో సతమతంఅవుతోంది. ఇలాంటి టిరక రకాల వ్యాధుల నుంచి అన్ని వయసుల వారిని రక్షించాలనే ఉద్దేశంతో, టీకాల వినియోగాన్ని పోత్సహించడానికి ప్రతీ ఏటా ఏప్రిల్ చివరి వారంలో అంటే ఏప్రిల్ 24 నుంచి 30 తేదీల మధ్య ప్రపంచ ఇమ్యూనైజేషన్ వారోత్సవాన్ని జరుపుకుంటారు. ఈసంవత్సరం వరల్డ్ ఇమ్యునైజేషన్‌ వీక్‌ థీమ్ ‘అందరికీలాంగ్లైఫ్’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు నిర్వాహకులు. సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైనజీవితం కోసం టీకా ప్రాముఖ్యత, టీకా ఈక్విటీని సూచిస్తూ ఈ థీమ్‌ను రూపొందించారు.

వరల్డ్ ఇమ్యునైజేషన్‌ వీక్‌ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సీనేషన్ ఈక్విటీ అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా అవసరమైన టీకాలు పొందడంలో మహిళలు వెనుకబడిపోతున్న అంశం ప్రధానంగా చర్చకువచ్చింది. టీకా ఈక్విటీ విషయానికి వస్తే మహిళలు వెనుకబడి ఉన్నారని అనేక నివేదికలు చెబుతున్నాయి. టీకా తీసుకోలేకపోవడంతో స్త్రీలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇది నవ జాత శిశువుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. బెంగళూరులోని అపోలో క్రెడిల్ అండ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లోని సీనియర్‌ గైనకాలజిస్ట్‌ ప్రకారం.. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. అందుకే టీకాలు వేయడం అనివార్యమవుతుంది. ‘‘గర్భధారణ సమయంలో టెటానస్రెండుషాట్లు తప్పనిసరి. టెటానస్టీకానియమాన్ని బాగా అనుసరించడం వల్ల గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులలో టెటానస్‌ సమస్యను తొలగించగలిగాం.’’ అనిచెప్పుకొచ్చారు డాక్టర్గరిమాజైన్.

ఇకఢిల్లీలోనిఅపోలోహాస్పిటల్‌లోనిప్రసూతి, స్త్రీజ ననేంద్రియ నిపుణులు డాక్టర్ అంజనాశర్మమాట్లాడుతూ.. గర్భధారణ సమయంలో టీకాలు వేయడం వల్ల మహిళలను, 6 నెలల వరకు శిశువుల రక్షించగలం’ అని పేర్కొన్నారు. అలాగే.. MMR, Tdap, HPV వంటి టీకాలు గర్భిణీ స్త్రీలకు చాలా ముఖ్యమైనవని ఆమె తెలిపారు.

“యువత గల బాలికలు రుబెల్లాబారిన పడే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడానికి MMR వ్యాక్సిన్‌ని ఉపయోగిస్తారు. MMR అంటేగవదబిళ్లలు, మీజిల్స్మరియురుబెల్లా. వారు వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని తేలితే, గర్భధారణ సమయంలో రుబెల్లా తీవ్రనష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి మేము వాటిని తిరిగి టీకాలు వేయవచ్చు. అలాగే చికెన్పాక్స్మరియుహెపటైటిస్బి చాలా ముఖ్యమైనవి. గర్భాదారణ 24-28 వారాల మధ్య, మేము ఇన్ఫ్లుఎంజావ్యాక్సిన్లను కూడా సిఫార్సు చేస్తున్నాము. గర్భిణీ స్త్రీలకు టెటానస్, డిఫ్తీరియా, పెర్టుసిస్కోసం Tdap టీకా కూడా ముఖ్యమైంది. ఇంతకుముందెన్నడూ టెటానస్‌ వ్యాక్సిన్‌ తీసుకోని మహిళలు టెటానస్‌ వ్యాక్సిన మొదటి డోస్‌, tdap బూస్టర్‌ని తీసుకొచ్చు’ అని డాక్టర్‌ అంజనా చెప్పారు.

Vaccine

‘గర్భాశయ క్యాన్సర్కే సులు చాలా వరకు హ్యూమన్పాపిల్లోమా వైరస్ (HPV)తోసంబంధం కలిగి ఉంటాయి. ఇది మహిళల్లో నాల్గవ సాధారణ క్యాన్సర్. యువతులు, ముఖ్యంగా 9-15 సంవత్సరాల వయస్సులో శరీరం బలమైన ప్రతిరోధకాలను అభివృద్ధి చేయగలదు కావున టీకా తీసుకోవాలి.’’ అని డాక్టర్ అంజనా తెలిపారు. అలాగే.. ‘‘సర్వికల్క్యాన్‌ వైరస్‌ వల్ల వస్తుంది. ఇది లైంగిక సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. 9-15 ఏళ్ల వయస్సు గల బాలికలు టీకాను తీసుకోవడం మంచిది. ఆ సమయంలో శరీరం బలమైన ప్రతి రోధకాలను అభివృద్ధి చేస్తుంది. ఈవయస్సును కోల్పోయినట్లయితే.. మళ్లీ 26 సంవత్సరాల వయస్సులోపు మూడు మోతాదుల టీకాలు తీసుకోవచ్చు. ఆ గడువు కూడా పూర్తయితే.. మహిళలు 46 సంవత్సరాల వయస్సులోపు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. HPV గర్భాశయ క్యాన్సర్‌కు నానో వ్యాక్సిన్‌ అత్యంత ప్రభావవంతమైనది.’’ అని డాక్టర్ అంజనా వివరించారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..