Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi 2022 Telugu: ఉగాది పచ్చడిలో వేప పువ్వుకు అత్యంత ప్రాధాన్యత.. విశిష్టత ఏమింటంటే..

Ugadi 2022 Telugu: తెలుగు నూతన సంవత్సరాది వస్తుంటే చాలు.. వెంటనే మదిలో మెదిలేది ఉగాది పచ్చడి(Ugadi Pacchadi). ఎందుకంటే ఉగాది పచ్చడిలోని ఆరు రుచుల్ని మన జీవితంలోని భావోద్వేగాలతో..

Ugadi 2022 Telugu: ఉగాది పచ్చడిలో వేప పువ్వుకు అత్యంత ప్రాధాన్యత.. విశిష్టత ఏమింటంటే..
Neem As Lakshmi
Follow us
Surya Kala

|

Updated on: Apr 02, 2022 | 1:48 PM

Ugadi 2022 Telugu: తెలుగు నూతన సంవత్సరాది వస్తుంటే చాలు.. వెంటనే మదిలో మెదిలేది ఉగాది పచ్చడి (Ugadi Pacchadi). ఎందుకంటే ఉగాది పచ్చడిలోని ఆరు రుచుల్ని మన జీవితంలోని భావోద్వేగాలతో పోల్చుతుంటారు. తీపి (బెల్లం), చేదు (వేప పువ్వు), వగరు (మామిడి పిందె), కారం (కారం), ఉప్పు (ఉప్పు), పులుపు (చింత పండు).. వంటి షడ్రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకునేందుకు అనువుగా, శరీరంలో రోగ నిరోధకశక్తి(Immunity) ఉగాది పచ్చడి పెంపొందిస్తుంది. అయితే ఈ ఉగాది ప‌చ్చడిలో వేప పువ్వుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆయుర్వేద గుణాల్లో చెట్టంత ఔషధం వేప. అలాగే ప్రాణవాయువును అందించడంలోనూ కల్పతరువు ఈ వేపచెట్టు. లక్ష్మీవృక్షంగా పేరున్న వేప చెట్టు నిన్నమొన్నటి వరకు తెగులు పట్టి మొండి కొమ్మలతో దీనంగా కనిపించింది. ఇప్పుడు, తనకు పట్టిన చీడను తానే వదిలించుకొని ఉగాది వేళకు మళ్లీ జీవం పోసుకుంది. పచ్చని ఆకులతో, నిండైన పూతతో, మెండైన ఔషధ గుణాలతో ఉగాది పచ్చడికి ఆరోగ్యకరమైన చేదును అందిస్తుంది.

అంతేకాకుండా ఉగాది పచ్చడిలో చేదు కోసం వాడే వేప పువ్వుకు సుమారు 35 రకాల వ్యాధులతో పోరాడే శక్తి ఉందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. శరీరంలోకి చేరి మనల్ని అనారోగ్యాలకు గురిచేసే క్రిములు, ఇతర వైరస్‌-బ్యాక్టీరియాలను నాశనం చేయడంలో వేపకు సాటేది లేదనడంలో అతిశయోక్తి లేదు. రక్తాన్ని శుద్ధి చేసి అనేక చర్మ వ్యాధులను నివారించడంలో ఇది దోహదం చేస్తుంది. అలాగే మధుమేహులకు వేప చక్కటి ఔషధంలా పనిచేస్తుంది.

యద్వర్షాదౌ నింబ సుమం శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వమాయే స్యాత్‌ త ద్వర్షం సౌఖ్యదాయకం.. అని శాస్త్ర వచనం. ఆరు రుచుల ఉగాది పచ్చడి తింటే ఆరోగ్యంగా ఉంటారని పెద్దల మాట. ఇందులో ‘నింబ కుసుమం’ అంటే వేప పువ్వు. ఔషధం చేదుగానే ఉంటుంది. కానీ, దాని ప్రభావంతోనే వ్యాధులు నయమవుతాయి. ఉగాది పచ్చడి తీసుకుంటూ ‘శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం’ అని చెబుతారు. ఇందులోనూ వేప ప్రాధాన్యం కనిపిస్తుంది. ఒకరకంగా వేపపువ్వు తినడానికే ఉగాది పచ్చడిని సృష్టించారేమో అనిపిస్తుంది. వేపను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. దీని వెనుక ఒక పురాణగాథ కనిపిస్తుంది. ఒకసారి పార్వతీపరమేశ్వరులు కైలాసంలో ఏకాంతంగా ఉన్నారట. అప్పుడు అటుగా వచ్చిన అగ్నిదేవుడిని చూసి పార్వతి అగ్గిమీద గుగ్గిలం అయిందట. ‘మా ఏకాంతానికి భంగం కలిగించింది దేవతలే, వారంతా భూమి మీద వృక్షాలుగా మారిపోదురు గాక’ అని శపించిందట. అలా దేవతలంతా వివిధ వృక్షాల రూపంలో భూమి మీద స్థిరపడ్డారు. ఈ క్రమంలో లక్ష్మీదేవి వేపగా అవతరించిందట. పురాణ కథ ఎలా ఉన్నా, వేప నిజంగా లక్ష్మీదేవే! వేప చిగురు మొదలు వేర్ల వరకు ఉపయోగం లేనిదంటూ లేదు. వేర్లు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూత, గింజ, కాయ, పండు, బెరడు అన్నిట్లో విలువైన ఔషధ గుణాలు ఉన్నాయి. వేప నూనె కీళ్లు, కండరాల పటుత్వానికి దోహదం చేస్తుంది. వేప పుల్ల దంతరక్షణకు శ్రేయస్కరం. వేప పువ్వు జీర్ణ కోశ వ్యాధులను నివారిస్తుంది. వేప గుజ్జు వ్యవసాయ క్షేత్రంలో క్రిమిసంహారిణిగా ఉపయోగపడుతుంది. ఒక్క వేప చెట్టు రోజుకు సుమారు 250 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. మనిషి మనుగడకు ఇంతలా ఉపయుక్తమవుతున్న వేప చెట్టు ముమ్మాటికీ మహాలక్ష్మే. వేపకు నింబవృక్షంతో పాటు అరిష్ట, క్రిమిఘ్న, పించు మర్దనం అనే పేర్లున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడటంలో సూర్యభగవానుడితో సమానమైన శక్తి ఉంది కాబట్టి, వేపను ‘రవి సన్నిభ’ అని పిలుస్తారు.

Also Read: Andhra Pradesh: పేరుకే పొత్తులు.. పోరాటంలో ఎవరికీ వారే యమునాతీరే.. ఏపీలో హాట్ టాపిక్‌గా ఆ రెండు పార్టీల తీరు

Tirumala: ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్‌కు అధికారం శాశ్వతంగా ఉండాలంటున్న ఎమ్మెల్యే

Ravi Teja: మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన టైగర్‌ నాగేశ్వరరావు.. త్వరలోనే షూటింగ్..