Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi: గరిక అంటే వినాయకుడికి ఎందుకు ఇష్టం..? గరిక లేనిది గణపతికి లోటేనట..!

Ganesh Chaturthi: వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వ శుభములు చేకూరుతాయి. వినాయకునికి గరికపోచలంటే ఎంతో ఇష్టం. ఎన్నిరకాల పత్రాలు, పుష్పాలతో..

Ganesh Chaturthi: గరిక అంటే వినాయకుడికి ఎందుకు ఇష్టం..? గరిక లేనిది గణపతికి లోటేనట..!
Ganesh Chaturthi
Follow us
Subhash Goud

|

Updated on: Sep 10, 2021 | 8:24 AM

Ganesh Chaturthi: వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వ శుభములు చేకూరుతాయి. వినాయకునికి గరికపోచలంటే ఎంతో ఇష్టం. ఎన్నిరకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడు లోటుగా భావిస్తాడు. గరికెలు లేని వినాయక పూజ వ్యర్థమని, ప్రయోజన రహితమని పురోహితులు చెబుతుంటారు. పురాణాల ఆధారంగా.. అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకు ఇష్టమో చూద్దాం. పూర్వంలో అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్నంత దహించసాగాడట. అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరకు వచ్చి తమను రాక్షసుడు వేడిని పుట్టించి ఇబ్బందుల పాలు చేస్తున్నాడని, తమకు వేడిని పుట్టిస్తున్నాడని, తమను ఎలాగైన కాపాడాలని వినాయకున్ని వేడుకోగా, వినాయకుడు తమ శరీరాన్ని పెంచేసి ఆ రక్షసున్ని మింగేశాడు. అందుకు వెంటనే వినాయకుడి నిండి వేడి మొదలైంది. అందుకు చంద్రుడు వచ్చి మంటను తగ్గిస్తానంటూ వినాయకుని తలపై నిలబడ్డాడు. అయినా కూడా తగ్గలేదు. విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు. మరమశివుడు పామును గణేషుని పొట్టచుట్టూ కట్టాడు. అయినా వేడి తగ్గలేదు. చివరకు కొంత మంది ఋషులు వచ్చి 21 గరిక పోచలతో వేడి తగ్గుతుందని చెప్పడంతో ఆ గరికను గణేషుని తలపై ఉంచారు. అంతే వెంటనే వినాయకుకి వేడి తగ్గిపోయింది. అప్పుడు వినాయకుడు అన్నాడు.. ఎవరైతే తనకు గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడు తన ఆశీర్వాదాలుంటాయని, కష్టనష్టాలు తీరుస్తానని చెప్పడంతో అప్పటి నుంచి వినాయకుడికి గరికతో పూజిస్తారు.

చతుర్ధీ పూజన ప్రీత:

వినాయకుని చతుర్ధి పూజంటే ప్రీతి. ఈ తిథినాడు విఘ్నేశ్వరుడు ఉద్భవించినాడు. భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక చవితిగా మనం గణపతిని పూజిస్తాం. అయితే ప్రతి మాసంలో వచ్చే చవితి గణపతికి ప్రీతికరమే. భాద్రపద శుక్ల చవితి రోజున పార్వతీ-పరమేశ్వరులకు కుమారునిగా వినాయకుడు అవతరించినాడు. బ్రహ్మదేవుడు సృష్టి ఆది నిర్వహణకు కలిగే విఘ్నాలు చూసి భయపడి, పరబ్రహ్మను ప్రార్థించాడు. ప్రణవ స్వరూపుడైన ఆ పరమాత్మ విఘ్నాల్ని నశింపజేయడానికి గజవదన రూపంలో సాక్షాత్కరించి తన వక్రతుండ మంత్రాన్ని బ్రహ్మకు ఉపదేశించి, విఘ్నాల్ని హరింపజేస్తాడు. ఇది తొలి ఆవిర్భావమని పండితులు అంటున్నారు. కాగా.. భయరోగాది కష్టాలు, సర్వ దారిద్ర్యాలు తొలగించే విఘ్నేశ్వరునికి ప్రీతికరమైనది చతుర్థీ వ్రతం. ముఖ్యంగా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి ముఖ్యమైనది. ప్రతినెలా ఆ చతుర్ధికి గణపతిని ఉద్దేశించి ఉపవాసమో లేక ఉండ్రాళ్ళు, మోదకాలు వంటివి నివేదిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

చతుర్థినాడు దూర్వాలు, బిల్వాలతో, పువ్వులతో గణపతిని అర్చించి, 21 ఉండ్రాళ్లు నివేదన చేస్తే గ్రహదోషాలు, గృహదోషాలు తొలగిపోతాయంటారు. కృష్ణ చతుర్థి వ్రతానికి చంద్రోదయంతో చవితి తిథి ఉండాలి. ఆ రోజున ఉపవాసం చేసి పూజ తర్వాత 21సార్లు ‘ఓం శ్రీ గణేశాయ నమ’ అని జపించాలని పురోహితులు చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Vinayaka Chaviti: వినాయక చవితి రోజు చంద్రున్ని చూస్తే ఏమవుతుంది..! ఎందుకు చూడకూడదు

Vinayaka Chaviti: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన గణేష్‌ పండుగ సందడి.. కోవిడ్ నిబంధనలు మాత్రం మస్ట్