AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayaka Chavithi: ముద్దులొలికే బాల వినాయకుడు.. కావాలంటే అంత ఈజీ కాదు.. ఎందుకో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీపై ఓ లుక్కేయండి!

వినాయక చవితి అనగానే మొదటగా గుర్తొచ్చేది గణేశుని విగ్రహమే. పూజలు.. సంబరాలు.. సరదాలు అన్నీ ఈ పండుగలో ఎంత ప్రాధాన్యత పొందినా.. అన్నిటికన్నా మొదటి ప్రాధాన్యం మాత్రం గణనాధుని విగ్రహ రూపానికే.

Vinayaka Chavithi: ముద్దులొలికే బాల వినాయకుడు.. కావాలంటే అంత ఈజీ కాదు.. ఎందుకో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీపై ఓ లుక్కేయండి!
Vinayaka Chavithi Bala Ganesh Idol
KVD Varma
|

Updated on: Sep 10, 2021 | 8:59 AM

Share

Ganesh Chathurthi 2021: వినాయక చవితి అనగానే మొదటగా గుర్తొచ్చేది గణేశుని విగ్రహమే. పూజలు.. సంబరాలు.. సరదాలు అన్నీ ఈ పండుగలో ఎంత ప్రాధాన్యత పొందినా.. అన్నిటికన్నా మొదటి ప్రాధాన్యం మాత్రం గణనాధుని విగ్రహ రూపానికే. వినాయకుడు ప్రజల మనస్సులలో ప్రత్యేకమైన దైవరూపం. ఒకరకంగా చెప్పాలంటే విఘ్నేశ్వరుడు జనాళికి ప్రియ మిత్రుడు. ఇంకా చెప్పాలంటే వక్రతుండుడు అంటే అందరికీ ఆరాధ్య దైవమే కాదు.. తమ జీవితంలో అత్యంత సన్నిహితుడు. మన దేశంలో దేవతార్చన అంటే ఎంతో పవిత్రత.. ఎన్నో నియమాల తోరణాల పరిదులతో కూడుకుని ఉంటుంది. కానీ, విఘ్నరాజుడికి చేసే ఉత్సవాలకు అవేవీ ఉండవు. శాస్త్రీయంగా జరిపే పూజ మాటున సామాన్యుని ఆరాధ్య నాయకునిగా వినాయకుడిని కొలుస్తారు. వినాయకుని పూజలో ప్రజల ఇష్టానికి అనుగుణంగా ఆయన రూపాన్ని సిద్ధం చేసుకుంటారు. ప్రజలు ఎలా కోరుకుంటే అలా వినాయకుని విగ్రహాన్ని సిద్ధం చేయించుకుంటారు.

భారీగా ఉండే గణేశుడు కావచ్చు.. తాము మెచ్చే సినీ నటుడి పోలికలతో ఉన్న వినాయకుడు కావచ్చు.. తాజాగా జరిగిన సంఘటనల నేపధ్యాన్ని ప్రతిబింబించే రూపం కావచ్చు.. సాంప్రదాయ బద్ధమైన విఘ్నరాజుని ప్రతిరూపం కావచ్చు.. ఇలా ఎన్నో రకాలుగా వినాయకుని విగ్రహాన్ని తయారు చేయించుకోవడం వినాయక చవితి స్పెషల్. మాన్యుడి నుంచి సామాన్యుడి వరకూ విఘ్నేశ్వర ఉత్సవాలకు సిద్ధమయ్యే రూపాలను అత్యంత ఆసక్తి కరంగా చూస్తూ ఉంటారు. వినాయక చవితి సందర్భంగా ఒక ప్రత్యేకమైన వినాయకుని విగ్రహం గురించి మీకు చెప్పబోతున్నాం. వినాయకుడి చిన్నారి రూపం ఇది. బాల గణేశుడిగా గణపతిని తీర్చిదిద్దే కళ ఇది. బుజ్జి గణపయ్య మనముందు ప్రత్యక్షం అయ్యాడా అనే అనుభూతిని కలిగించే విగ్రహ రూపం ఇది.

ముంబాయిలోని లోయర్ పరేల్ ప్రాంతంలో త్రిమూర్తి స్టూడియోలో సిద్ధమయ్యే బాల గణేశుడి క్రేజ్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మట్టి విగ్రహాల రూపకర్త విశాల్ షిండే బాల వినాయక రూపాలను సిద్ధం చేస్తారు. ఈయన చేసే విగ్రహాలకు అడ్వాన్స్ బుకింగ్ 2023 వరకూ ఫుల్. అంటే ఇప్పుడు ఆయన చేసిన విగ్రహం కావాలనుకుంటే మీరు కనీసం రెండేళ్ళ ముందు ఆర్డర్ ఇచ్చి ఉండాలి. లేదా ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి 2024 వరకూ వేచి ఉండాలి. ఎందుకు ఇంత క్రేజ్ అని అనుకుంటున్నారా? విశాల్ షిండే గణేష్ విగ్రహాలను తాయారు చేయడంలో విప్లవం తెచ్చిన వ్యక్తి. అయన చేతి వేళ్ళు మట్టితో మాట్లాడతాయి. ఆయన చేసే విగ్రహాలు సజీవ రూపాలుగా కనిపిస్తాయి. ఎన్నోరకాల విగ్రహరూపాలు మీరు చూసి ఉండవచ్చు కానీ, విశాల్ షిండే చేసిన బాల వినాయకుడిని చూస్తే మాత్రం మీ మనసు పులకరించి పోతుంది అంటారు ముంబయి వాసులు. ఒక్క ముంబయి అనే కాదు విదేశాలలో ఉన్న భారతీయులూ ఈయన దగ్గర విగ్రహాలకు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు.

చిన్నారి వినాయకుడి రూపాన్ని తయారు చేయడంలో ఈయన ప్రత్యేకత వేరు. షాదుమతి మట్టితో ఈ విగ్రహాలు రూపొందిస్తారు. రూపం, చూపులు, రంగు కలయిక, స్కిన్ టోన్ ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. ఆ విగ్రహాల ఫినిషింగ్ చూస్తె మీకు అది మట్టితో తయారైన విగ్రహం అని నమ్మబుద్ది కాదు. బాల వినాయకుడు అంటే.. ఎదో ఒక చిన్న పిల్లవాడిలా వినాయకుడి రూపం అనుకోవద్దు.. వందల కొద్దీ రూపాల్లో ఈ వినాయకుడిని ముస్తాబు చేస్తారు షిండే. ఊయాల ఊగుతున్న చిన్ని గణపయ్య.. అల్లరి చేస్తున్న బొజ్జ గణపయ్య.. చేతిలో లడ్డూలు పట్టుకుని సందడి చేస్తున్న బుజ్జి గణపతి.. రిలాక్స్ గా సోఫాలో సేద తీరుతున్న సుందర గణేశుడు ఇలా మన ఇంటిలో చిన్న పిల్లలు ఎలా ఉంటారో అలా షిండే చేసిన బాల గణపతి రూపాలు ఉంటాయి. ఈయన కంటె ముందు చాలా మంది కళాకారులు మట్టితో వినాయకుని రూపాలను చేసి ఉన్నారు. ఇంకా చేస్తూ ఉన్నారు కానీ, ఈయన చేసిన రూపాల్లో జీవకళ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అని ఈయన విగ్రహాలను కొనుగోలు చేసినవారు చెబుతారు.

ఈ బాల గణపతులకు మార్కెటింగ్ వ్యవస్థ లేదు. ఆనోటా.. ఈనోటా అంటే మౌత్ పబ్లిసిటీతోనే ఈయన చేసిన విగ్రహాలు అమ్ముడు పోతాయి. చేసిన విగ్రహాలు అనేకంటే.. చేయబోయే విగ్రహాలు అనడం కరెక్ట్ ఏమో. ఇక ఈ బాల గణపతులు 2 వేల రూపాయల నుంచి 18 వేల రూపాయల వరకూ ధరలో ఉంటాయి. విగ్రహం రూపం.. ఎత్తు వంటి విషయాలను బట్టి ఈ ధరలు ఉంటాయి. డబ్బు సంపాదించడానికి, వాటిని తయారు చేయడానికి నేను ఈ విగ్రహాలను తయారు చేయలేదని షిండే చెబుతారు. ఎంత ట్రంక్ (తొండం) ఉంచాలి, ఎంత శాలువా ఉంచాలి, కిరీటం ఎలా ఉండాలి, అంగుళాల సంఖ్య ఎంత ఉండాలి, విషయం ఏ రంగులో ఉండాలి అని నాకు చాలా పరిపూర్ణత కావాలి అని అంటారు. పరిపూర్ణతలో చిన్న రాజీ కూడా ఆమోదయోగ్యం కాదని ఆయన చెబుతారు. నేను కూడా కస్టమర్ మాటలను నమ్మను. అటోనిమ్స్ సమానంగా ఉండాలి. ప్రామాణికంగా ఉండాలి, నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. భావాలు అనుభూతి చెందాలి. అంటూ ఆయన తన బాల వినాయకుల రూపాల రూపకల్పనలో తన విధానం గురించి వివరిస్తారు.

కేవలం మూడు నెలలు..

విశాల్ షిండే విగ్రహాల ధర 2000 నుండి 18,000 రూపాయల వరకు ఉంటుంది. వారు మట్టి, ఫైబర్ రెండింటి నుండి శిల్పాలను తయారు చేస్తారు. ఫైబర్ శిల్పాల ధర 2000 నుండి ప్రారంభమవుతుంది. మట్టి విగ్రహాల ధర 12000 నుండి 18000 వరకు ఉంటుంది. జస్ట్ ట్రెడిషనల్ లుక్ లో విగ్రహం కావాలంటే ఒక విగ్రహం కోసం మూడు నుండి నాలుగు రోజులు పడుతుంది. వారు ఈ పనిని కేవలం మూడు నెలలు అంటే గణేష్ చతుర్థి సందర్భంగా చేస్తారు. దీని కోసం, ఆర్డర్ ముందుగానే తీసుకుంటారు. మిగిలిన రోజుల్లో వారు ఇతర విగ్రహాలను ఆర్డర్‌పై చేస్తారు. అంటే, కూడళ్ళలో ఏర్పాటు చేసే విగ్రహాల వంటివి.

2023 వరకు పూర్తి బుకింగ్.. 

తాను ఆర్డర్‌పై మాత్రమే విగ్రహాలను తయారు చేస్తానని అంటారు విశాల్. 2023 వరకు పూర్తి బుకింగ్ అయిపొయింది. ఈరోజు, ఎవరైనా విగ్రహం కోసం నా వద్దకు వస్తే, నేను ఇవ్వలేను ఎందుకంటే ఇవన్నీ రెండేళ్ల నాటి అర్దర్లపై చేసినవి. రెండు-మూడు సంవత్సరాల క్రితం, అంబానీ కుటుంబ సిబ్బంది నుండి విగ్రహాన్ని సేకరించడానికి వచ్చారు. కానీ, ఆ ఆర్డర్ ను షిండే తిరస్కరించారు. అదేవిధంగా పేర్లు చెప్పలేని వీఐపీలు చాలా మంది విగ్రహాలను అడుగుతారు. కానీ, మా సూత్రాల పై రాజీపదలేము. అందుకే మేము అటువంటి చాలా ఆర్డర్లు తిరస్కరించాము. అని ఆయన చెబుతారు. ఈయన ఒక సీజన్ లో 270 నుండి 300 విగ్రహాలను మాత్రమే తయారు చేస్తారు. అంతకంటే ఎక్కువ కాదు. దసరా నుండి డిసెంబర్ 31 వరకు మాత్రమే ఆర్డర్లు తీసుకుంటారు. ఈయన చేసిన విగ్రహాలు యుఎస్, యుకె, సింగపూర్, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియాకు వెళ్తాయి. అయితే, మట్టితో చేసిన విగ్రహాలు ఇక్కడకు వెళ్లలేవు, కాబట్టి ఫైబర్‌తో చేసిన శిల్పాలు తయారు చేసి పంపిస్తారు.

ఇవి కూడా చదవండి: Vinayaka Chavithi: ఎలాంటి విఘ్నాలు లేకుండా.. విఘ్నేశ్వరుడికి తొలిపూజ ఇలా చేద్దాం..