Dussehra 2021: పాల పిట్ట దర్శనంతో ముగిసే దసరా ఉత్సవాలు.. ఎందుకు దర్శిస్తారంటే..

Dussehra 2021: నవరాత్రుల తర్వాత రోజున విజయదశమి లేదా దసరాగా పండగను జరుపుకుంటాం.  చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా..

Dussehra 2021: పాల పిట్ట దర్శనంతో ముగిసే దసరా ఉత్సవాలు.. ఎందుకు దర్శిస్తారంటే..
Dasara Palapitta
Follow us
Phani CH

| Edited By: Anil kumar poka

Updated on: Oct 15, 2021 | 10:49 AM

Dussehra 2021: నవరాత్రుల తర్వాత రోజున విజయదశమి లేదా దసరాగా పండగను జరుపుకుంటాం.  చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా పండగలో ఆయుధ పూజ, జమ్మి చెట్టు, పాల పిట్ట, రావణ దహనం ప్రముఖ పాత్రని పోషిస్తాయి. గత వందల ఏళ్లుగా దసరా రోజున పాల రంగుల రంగుల అందమైన పాల పిట్టను దర్శించుకోవడం ఆనవాయితీగా  వస్తుంది. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే శుభఫలితాలు కలుగుతాయని.. ముఖ్యంగా ఉత్తర దిక్కునుంచి వచ్చే పాల పిట్టను దర్శిస్తే.. చేపట్టిన పనుల్లో విజయం సొంతమవుతుందని నమ్మకం. అందుల్లనే జమ్మి చెట్టుకు (శమీ ) పూజను చేసిన అనంతరం పాల పిట్టను చూడడానికీ ప్రజలు ఆసక్తిని చూపిస్తారు. పల్లెలోకి పొలం బాట పడతారు.

విజయదశమి రోజున పాల పిట్టను దర్శించుకోవడానికి త్రేతా యుగం, ద్వాపర యువగం గురించి ప్రస్తావన ఉంది. త్రేతా యుగంలో రావ‌ణాసురుడితో శ్రీరాముడు యుద్ధానికి వెళ్తున్న సమయంలో మొదటిగా పాల పిట్ట ఎదురైంది. అనంతరం రాముడు రావణుడిని సంహరించి విజయం సాధించాడు. దీంతో పాల పిట్ట సందర్శనం విజయాన్ని ఇస్తుందని నమ్మకం. అంతేకాదు పాండవులు అజ్ఞాత వాసం వెళ్ళడానికి ముందు వారి ఆయుధాలను జమ్మి చెట్టుపై పెట్టగా.. పాల పిట్ట రూపంలో ఇంద్రుడు కాపలా ఉన్నాడని పురాణాల కథనం. అంతేకాదు పాండవులు అజ్ఞాత వాసం ముగించుకుని తిరిగి రాజ్యానికి వెళ్తున్న సమయంలో మొదట పాల పిట్ట దర్శనమయ్యిందట.. అప్పటి నుంచి వారికీ అన్నీ శుభ ఫలితాలే కలిగాయని అందువల్లనే దసరా రోజున పాల పిట్టను దర్శిస్తే.. మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. ఇక పాలపిట్టను ప‌ర‌మేశ్వరుడి స్వరూపంగా భావిస్తుంటారు.. దీంతో మ‌న‌శ్శాంతికి, ప్రశాంత‌త‌కు, కార్యసిద్ధికి సంకేతంగా భావిస్తారు. పురాణాల్లో మంచి ప్రాశస్త్యం ఉన్న పాల పిట్టకు పలు రాష్ట్రాలు పట్టంగట్టాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లతో పాటు.. కర్ణాటక, ఒడిశా, బీహార్ రాష్ట్రాల అధికారిక పక్షి పాలపిట్ట.. కావడం విశేషం.

Also Read:  ఆకట్టుకుంటున్న వాసు లుక్.. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న శ్యామ్ సింగ రాయ్