Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanteras 2022: ధరంతరాస్‌ రోజు చీపురును ఎందుకు కొంటారో తెలుసా.. ఆ రోజున కొంటే ఎన్ని రకాలుగా లాభమో తెలుసుకుందాం..

ధరంతరాస్‌ రోజు అంతా బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఆ రోజు చీపురును తప్పకుండా కొంటారు. ఎందుకంటే..

Dhanteras 2022: ధరంతరాస్‌ రోజు చీపురును ఎందుకు కొంటారో తెలుసా.. ఆ రోజున కొంటే ఎన్ని రకాలుగా లాభమో తెలుసుకుందాం..
Dharantaras
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 17, 2022 | 6:56 PM

హిందూ ధర్మంలో దీపావళికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ ధంతేరస్ రోజున ప్రారంభమై భాయ్ దూజ్‌తో ముగుస్తుంది. ధన్తేరస్ రోజున కుబేరుడు, లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఈ రోజున చిత్తశుద్ధితో పూజించడం వల్ల కుటుంబానికి ఆశీస్సులు, ఇంట్లోని సభ్యులకు ధన వర్షం కురుస్తుందని నమ్మకం. ధన్‌తేరస్ రోజు గురించి అనేక రకాల నమ్మకాలు ఉన్నాయి. ఈ రోజున కొంతమంది పాత్రలు కొంటారు. మరికొందరు వెండి వస్తువులను ఇంట్లోకి తీసుకురావడం శుభపరిణామంగా భావిస్తారు. మరికొందరు బంగారం కొనేందుకు ఇష్టపడుతారు. ధన్‌తేరస్‌ రోజున చీపుర్లు కొనేందుకు చాలా క్రేజ్‌ ఉంటుంది. ఈ రోజున చీపురు ఎందుకు కొంటారో తెలుసుకుందాం.

ధన్‌తేరస్‌లో చీపురు ప్రాముఖ్యత..

పురాణాల ప్రకారం, ధంతేరస్ రోజున ఏది కొనుగోలు చేసినా అది భవిష్యత్తులో పదమూడు రెట్లు పెరుగుతుంది. ధంతేరస్ రోజున చీపురు కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మత్స్య పురాణంలో చీపురు లక్ష్మీదేవి రూపంగా చెప్పబడింది. ఈ రోజున చీపురు కొనడం ఆనందం, శాంతి, సంపద చీపురుతో ముడిపడి ఉంటుంది. చీపురు ఇంటి దారిద్ర్యాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. 

ఇవి కూడా నమ్మకాలే..

ధంతేరస్ రోజున చీపురు కొనడం గురించిన మరో నమ్మకం ఏంటంటే, లక్ష్మీదేవి ఇంటిని విడిచిపెట్టదు. దీనితో పాటు, ఈ రోజున చీపురును ఇంటికి తీసుకురావడం వల్ల పాత అప్పులు తొలగిపోతాయని, ఇంట్లో సానుకూలత పెరుగుతుందని నమ్ముతారు. 

మీరు కూడా ఈ వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు

ధంతేరస్ రోజున బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజు చాలా మంది కొత్త బట్టలు కూడా కొంటారు. మీరు కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ధన్తేరస్ రోజు కొనడం మంచిదే.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం