Vijaya Ekadashi 2021: విజయ ఏకాదశి రోజున ఉపవాస సమయంలో చేయకూడని పనులు.. ఏకాదశి ప్రాముఖ్యత..
vijaya ekadashi 9th march 2021: హిందూ సంప్రదాయం ప్రకారం ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అన్ని ఉపవాసలలో కంటే ఏకాదశి ఉపవాసం ఉత్తమమైనదని
vijaya ekadashi 9th march 2021: హిందూ సంప్రదాయం ప్రకారం ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అన్ని ఉపవాసలలో కంటే ఏకాదశి ఉపవాసం ఉత్తమమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఫల్ఘుణ మాసానికి చెందిన కృష్ణ పక్షానికి చెందిన ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం విజయ ఏకాదశి మార్చి 9న వచ్చింది. ఈరోజున విష్ణువును ఆరాధిస్తే.. కోరికలన్నీ నెరవేరుతాయని అంటుంటారు. ఈరోజున రామసేతు పూర్తయిన రోజుగా రామాయణం తెలియజేస్తోంది.
ఏకాదశి రోజున చేయకూడని పనులు..
➼ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు జూదం ఆడకూడదు. ➼ ఉపవాసం చేస్తూ.. రాత్రి సమయంలో నిద్రపోకుడదు. ➼ ఉపవాసం ఉన్న రోజున ఎలాంటి వస్తువులను దొంగిలించకూడదు. ఈరోజు చేసిన దొంగతనాల వలన 7 తరాలు శాపం కలుగుతుంది. ➼ ఏకాదశి నాడు విష్ణువు ఆరాధించడం మిక్కిలి ఉత్తమం. సాత్వికంగా ఉండడమే కాకుండా ఆహారం, సంయమనంతోపాటు ఉండాలి. ➼ ఉపవాసం ఉన్న సమయంలో కోపం, అబద్ధాలు చేప్పకూడదు. ➼ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. సాయంత్రాలు నిద్రపోకూడదు.
విజయ ఏకాదశి కథ..
పూర్వం ద్వాపర యుగంలో ధర్మరాజుకు యుధిష్టిర ఫాల్ఘుణ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. వెంటనే అతను శ్రీకృష్ణుడిని ఫాల్గుణ ఏకాదశి కథ చెప్పమని అడిగాడు. రావణుడు సీత దేవిని అపహరించినప్పుడు..అతడితో యుద్దం చేయడానికి సుగ్రీవుడి సైన్యాన్ని తీసుకోని లంకకు బయలుదేరతాడు. లంకకు వెళ్లడానికి మధ్యన ఉన్న సముద్రాన్ని దాటాలి. కాని వానర సైన్యానికి అది కష్టమైన పని. రాముడు ఈ సమస్యను పరిష్కరించాలనుకున్నాడు. అప్పుడు వారి వద్దకు చేరిన ఓ రుషి.. మీరందరూ.. ఏకాదశి ఉపవాసం చేయడం వలన ఈ సముద్రాన్ని దాటగలుగుతారు అని చెప్పుకోచ్చాడు. ఇక ఆ మాటతో రాముడితోపాటు వానర సైన్యం మొత్తం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం చేయడంతోపాటు రామసేతును నిర్మించి.. సముద్రం దాటి రావడుని వధించారని శాస్త్రాలు చెబుతున్నాయి.
Also Read:
Mundeshwari Temple: బీహార్లో ఉన్న అతి పురాతనమైన ముండేశ్వరి ఆలయం గురించి ఆసక్తికర విషయాలు….
వాస్తు శాస్త్రం: తులసి మొక్కను ఏ దిశలో నాటాలో తెలుసా.. బాల్కానీలో ఆ దిశలో పెడితే ఈ సమస్యలను తప్పవు..