AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు శాస్త్రం: తులసి మొక్కను ఏ దిశలో నాటాలో తెలుసా.. బాల్కానీలో ఆ దిశలో పెడితే ఈ సమస్యలను తప్పవు..

హిందూ సంప్రదాయం ప్రకారం తులసి మొక్కను పూజించటం మన ఆనవాయితీ. తులసి మొక్కను అమ్మవారికి విశ్వసిస్తుంటాం. పూర్వం నుంచి ఈ మొక్కను ఇంట్లో నాటి.. రోజూ పూజిస్తూంటాం.

వాస్తు శాస్త్రం: తులసి మొక్కను ఏ దిశలో నాటాలో తెలుసా.. బాల్కానీలో ఆ దిశలో పెడితే ఈ సమస్యలను తప్పవు..
Rajitha Chanti
|

Updated on: Mar 06, 2021 | 5:41 PM

Share

హిందూ సంప్రదాయం ప్రకారం తులసి మొక్కను పూజించటం మన ఆనవాయితీ. తులసి మొక్కను అమ్మవారికి విశ్వసిస్తుంటాం. పూర్వం నుంచి ఈ మొక్కను ఇంట్లో నాటి.. రోజూ పూజిస్తూంటాం. తులసి మొక్కను తులసి దేవి అని.. లక్ష్మీ దేవి అని కీర్తిస్తుంటాం. తులసి మొక్క ఉన్న చోట.. లక్ష్మీ దేవి నివాసం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది. దీని శాస్త్రీయ నామం ఓసిమం టెన్యూఫ్లోరం (Ocimum tenuiflorum). ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు.తులసి మొక్క కేవలం దేవతలకు ప్రతిరూపం మాత్రమే కాదు.. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మనకు ఎదురయ్యే అనారోగ్య సమస్యలను కూడా తులసి మొక్క దూరం చేస్తుందని విశ్వాసం. అయితే ఈ తులసి మొక్కను పూజించడం, ఏ ప్రదేశంలో పెట్టాలి అనే విషయంలో చాలామంది పొరపాట్లు చేస్తుంటారు.

తులసి చెట్టును ఏ దిశలో ఉంచకూడదు…

తులసి చెట్టును ఇంట్లో సరైన దిశలో ఉంచాలి. దీనివలన ఇంట్లో సౌభాగ్యం సంప్రాప్తిస్తుంది. అయితే ఈ చెట్టును దక్షిణ దిశలో ఉంచకూడదు. ఎందుకంటే ఆ దిక్కులో తులసి మొక్క ఉండడం అపవిత్రంగా భావిస్తారు. ఒకవేళ అనుకోకుండా లేదా తెలియకుండా ఇలా చేసినట్లయితే మీ వెంటే దురదృష్టం తాండవిస్తుంది. దురదృష్టవశాత్తు మారడానికి ఎక్కువ సమయం పట్టదు. దీని ఫలితంగా, మీ ఇంట్లో పేదరికం వస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవ పెరుగుతుంది.

ఏ దిశలో నాటాలి..

సనాతన ధర్మం ప్రకారం తులసి చెట్టును ఇంటికి ఉత్తర, ఈశాన్య లేదా తూర్పు దిశలో నాటాలి. ఈ దిశలో మొక్కను నాటడం వలన ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటవచ్చు.

తులసిని నాటేముందు గుర్తుంచుకోవల్సిన విషయాలు..

చాలా మంది తులసి చెట్టును పైకప్పుపై ఉంచుతారు. కానీ అలా అస్సలు చేయకూడదు. అలా పెట్టడం వలన నిందలపాలు కావాల్సి వస్తుంది. మీజాతకంలో మెర్క్యూరీ స్థానం తెలుసుకోవాలి. మెర్క్యూరీ స్థానాన్ని బట్టి మీరు డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

Also Read:

సంవత్సరానికి కేవలం 5 గంటలు మాత్రమే తెరచి ఉండే ఆలయం.. అమ్మవారికి ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు.. ఎక్కడుదంటే..