Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Shivaratri: మహాశివరాత్రి పూజా చేస్తున్నారా ? పూజా సమయంలో పాటించవలసిన నియమాలెంటో తెలుసా..

Maha Shivaratri PoojaVidhi: అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. మహాశివుడు లింగాకృతిని పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటాం.

Maha Shivaratri: మహాశివరాత్రి పూజా చేస్తున్నారా ? పూజా సమయంలో పాటించవలసిన నియమాలెంటో తెలుసా..
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 09, 2021 | 1:51 PM

Maha Shivaratri PoojaVidhi: అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. మహాశివుడు లింగాకృతిని పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటాం. ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్దలతో పరమేశ్వరుడిని పూజిస్తే జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తుంటారు.  శివరాత్రి రోజున తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్లు దోషాలని కలుగజేస్తాయి. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండడం, జాగరణ చేయడం అందరికి తెలిసిన విషయాలే. అయితే పూజా చేసే సమయంలో ఏఏ నియమాలను పాటించాలి.. పరమేశ్వరునికి పూజా ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.

మహాశివరాత్రి రోజూ పూజా విధానంలో పాటించవలసిన నియమాలు…

➼ ముఖ్యంగా శివుడికి పంచామృతాలు, ఆవు పేడ, ఆవు పంచకం, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేయాలి. ➼ ఈ అభిషేకాలు చేస్తున్నంతసేపు ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రం ఉచ్చరిస్తూనే ఉండాలి. ➼ ముందుగా చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారలాతో శివుడిని పూజించి అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం వేయాలి. ఇలా చేసి పుర్ణాహుతి నిర్వహించాలి. ➼ శివకథలు వింటూ జాగరణ చేయాలి. అలాగే రథరాత్రి మూడు, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి. ➼ తెల్లవారి శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం ధానం చేయాలి. లింగోద్భవం జరిగిన అర్థరాత్రి రోజూ వస్తుంది కాబట్టి ప్రతిరోజూ శివరాత్రే. ➼ కృష్ణపక్ష చతుర్ధశి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి నెలా వచ్చే రోజును మాస శివరాత్రి అంటారు. ➼ అలాగే మాఘ బహుళ చతుర్ధశినే మహాశివరాత్రిగా జరపుకుంటాం. ➼ ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి.

➼ మహా శివరాత్రి రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. ➼ ఉపవాస, జాగరణ శివస్మరణలతో ఉండాలి. ఆ మరుసటి రోజు ఉత్తమ విప్రులు, శివభక్తులకు అన్నదానం చేయాలి. ➼ సూర్యోదయం వరకూ మౌనవ్రతం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి.

Also Read:

Vijaya Ekadashi 2021: విజయ ఏకాదశి రోజున ఉపవాస సమయంలో చేయకూడని పనులు.. ఏకాదశి ప్రాముఖ్యత..

Tamilnadu Ramanatha Swamy Temple: తమిళనాడులో ఉన్న అతి పురాతన రామనాథ స్వామి దేవాలయ రహస్యాలు..