AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరాశి వారికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది… ఈరోజు రాశిఫలాలు..

ఇప్పటికీ రాశి ఫలాలను విశ్వసించి.. తమ రోజును ప్రారంభించేవారు చాలా మందే ఉన్నారు. ఈరోజున ఏం జరగబోతుందనేది ముందుగానే తెలుసుకోవాలని కోరుకుంటుంటారు.

Horoscope Today: ఈరాశి వారికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది... ఈరోజు రాశిఫలాలు..
Rajitha Chanti
|

Updated on: Mar 09, 2021 | 7:48 AM

Share

ఇప్పటికీ రాశి ఫలాలను విశ్వసించి.. తమ రోజును ప్రారంభించేవారు చాలా మందే ఉన్నారు. ఈరోజున ఏం జరగబోతుందనేది ముందుగానే తెలుసుకోవాలని కోరుకుంటుంటారు. అందుకోసం రాశిఫలాలను నమ్ముతుంటారు. ఈరోజు మార్చి 9 మంగళవారం చంద్రుడు రాత్రి, పగలు మకరంలో ఉండనున్నాడు. అలాగే ఈరోజు మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి..

ఈరోజు మీరు ఎక్కువగా ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యాక్రమాల్లో పాల్గోంటుంటారు. అలాగే రావాల్సినటువంటి బాకీల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయుకూడదు. ఐశ్యర్వ లక్ష్మీ ఆరాధించడం మంచిది.

వృషభ రాశి..

ఈరోజు మీరు సంఘ వ్యవహారిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి విషయంలో తొందరపడకూడదు. విశేషమైనటువంటి శ్రీరాముని నామస్మరణ మేలు చేస్తుంది.

మిధున రాశి..

ఈరోజు మీరు అనవసరమైన విషయంలో స్పందించడంలో జాగ్రత్తగా ఉండాలి. దక్షిణా మూర్తి వారి ఆరాదన మేలు చేస్తుంది.

కర్కాటక రాశి..

ఈరోజు నిరుద్యోగులకు కొంత అసహానాలకు కలుగుతాయి. కష్టపడితేకానీ ఫలితాలను పొందలేరు. శ్రీ రాజమతాంగై నమః అనే నామ స్మరణ మేలు చేస్తుంది.

సింహరాశి..

ఈరోజు మీరు సమాయానుకులంగా ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని అనవసర ఖర్చులు కూడా గురిచేస్తుంటాయి. శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.

కన్య రాశి..

ఈరోజు వీరికి అనుకొనటువంటి సంఘటనలు మేలు చేస్తుంటాయి. మీ ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశాలుంటాయి. విశేషమైనటువంటి లలితా అమ్మవారి నామస్మరణ మేలు చేస్తుంది.

తులరాశి..

ఈరోజు వీరికి సంఘంలో కొన్ని అదనపు బాధ్యతలు మేలు చేస్తుంది. రాజకీయంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండడం మంచిది. అష్టలక్ష్మీ స్త్రోత్ర పరాయణం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి..

ఈరోజు వీరికి అనవసరం ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, వ్యవహరిక విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. లలితా సహస్త్ర నామా స్త్రోత్ర పరాయణం నిర్వహించుకోని అమ్మవారికి పాయసం నివేదించడం మంచిది.

ధనస్సు రాశి..

ఈరోజు మీరు చేపట్టే కార్యాక్రమాల్లో సజావుగా సహకారం అందుతుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గా సప్తశ్లోకీ పరాయణం మేలుచేస్తుంది.

మకర రాశి..

ఈరోజు మీకు మానసికమైనటువంటి కొన్నిరకాల రుగ్మతలు ఎదురవుతుంటాయి. అనారోగ్యకరమైనటువంటి భావనలు తగ్గించుకోవడం మేలు చేస్తుంది. శివరాధన మేలు చేస్తుంది.

కుంభ రాశి..

ఈరోజు వీరు ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. దుబార ఖర్చులను నియంత్రణ చేసుకోవడం మంచింది. మహాలక్ష్మి అమ్మవారికి చక్కెర పొంగళికి నివేదించడం మంచిది.

మీనరాశి..

ఈరోజు మీకు మంచి మంచి వార్తలు అందుతుంటాయి. పిల్లల చదువలు విషయంలో సంతోషాలు ఉన్నప్పటికి కొన్ని రకాల ఒత్తిడికి గురిచేస్తాయి. గురుగ్రహ అర్చన మేలు చేస్తుంది.

Also Read:

Tamilnadu Ramanatha Swamy Temple: తమిళనాడులో ఉన్న అతి పురాతన రామనాథ స్వామి దేవాలయ రహస్యాలు..