AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారు ఈరోజు షేర్లు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..

ఇప్పటికీ రాశి ఫలాలను విశ్వసించి.. తమ రోజును ప్రారంభించేవారు చాలా మందే ఉన్నారు. ఈరోజున ఏం జరగబోతుందనేది ముందుగానే తెలుసుకోవాలని కోరుకుంటుంటారు.

Horoscope Today: ఈ రాశివారు ఈరోజు షేర్లు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..
Rajitha Chanti
|

Updated on: Mar 10, 2021 | 7:16 AM

Share

ఇప్పటికీ రాశి ఫలాలను విశ్వసించి.. తమ రోజును ప్రారంభించేవారు చాలా మందే ఉన్నారు. ఈరోజున ఏం జరగబోతుందనేది ముందుగానే తెలుసుకోవాలని కోరుకుంటుంటారు. అందుకోసం రాశిఫలాలను నమ్ముతుంటారు. ఈరోజు మార్చి 10 బుధవారం గురుడు, శని, చంద్రుడు, బుధుడు మకరంలో ఉండనున్నారు. అలాగే ఈరోజు మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి..

ఈరోజు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలను సజావుగా పూర్తిచేసుకుంటారు. అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు శ్రీరాముని అర్చన చేయడం మేలు చేస్తుంది.

వృషభరాశి..

ఈరోజు మీరు దూర ప్రాంతాలలో ఉన్నటువంటి కుటుంబసభ్యులను కలుసు ప్రయాత్నిస్తుంటారు. అలాగే విలువైనటువంటి వస్తువులు, అభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు నవగ్రహ స్త్రోత్ర పరాయణం మేలు చేస్తుంది.

మిథున రాశి..

ఈరోజు మీరు చేపట్టునటువంటి పనులు ఒక ప్రణాళిక బద్ధంగా పూర్తిచేయవలసిన అవసరం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు ఈరోజు పేదవారికి అన్నదానం నిర్వహించడం మంచిది.

కర్కాటక రాశి..

ఈరోజు మీరు వేర్వేరు రూపాల్లో అందివస్తున్న వార్తల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతేకాకుండా పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ఈరోజున లలిత అమ్మవారి ఆరాధన మేలు చేస్తుంది.

సింహరాశి..

ఈరోజు మీకు నిరుద్యోగులకు కొన్ని రకాల శుభవార్తలు అందుతాయి. అలాగే ఉద్యోగాదీ విషయాల్లో కొంత ప్రోత్సాహరకరమైన వార్తలు అందుతుంటాయి. ఈరోజు రాజామతాంగై నమః స్త్రోత్రం మేలు చేస్తుంది.

కన్యరాశి..

ఈరోజు ఈరాశి విద్యార్థులు చక్కగా రాణిస్తారు. పెద్దవారి సహయ సహాకారాలు అందుతాయి. విలువైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేసే సందర్బాలు ఉన్నాయి. ఈరోజున మహాలక్ష్మీ అమ్మవారి అర్చన మేలు చేస్తుంది.

తులరాశి..

ఈరోజు మీరు పెద్ధవారి సహయంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. అంతేకాకుండా విందు, వినోదాలు కూడా ఉంటాయి. ఈరోజు మహాలక్ష్మీ అమ్మవారికి గులాబీ పూవ్వులతో అర్చన చేయడం మంచిది.

వృశ్చిక రాశి..

ఈరోజు మీరు ప్రయాణ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు నియంత్రణ చేసుకోవడం మంచిది. సుబ్రమణ్య స్వామి భుజంగా స్త్రోత్రం మంచిది.

ధనస్సు రాశి..

ఈరోజు ఈ రాశి నిరుద్యోగులు పెద్ధవారి సహయాన్ని ఆశిస్తుంటారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈరోజు శివాభిషేకం మేలు చేస్తుంది.

మకర రాశి..

ఈరోజు మీరు దీర్ఘకాలిక లాభాలను పొందుతారు. ప్రయాత్నపూర్వకంగా కొన్ని ఖర్చులను నియంత్రిస్తుంటారు. అలాగే ఆస్తి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. గణపతి స్త్రోత్ర పరాయణం మేలు చేస్తుంది.

కుంభ రాశి..

ఈరోజు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో కొంత నిదానంగా వ్యవహరించడం మేలు చేస్తుంది. శ్రీవెంకటేశ్వర ఆరాధన మేలు చేస్తుంది.

మీన రాశి..

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడిటప్పుడు కాస్తా సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య స్త్రోత్ర పరాయణం మేలు చేస్తుంది.

Also Read:

Maha Shivaratri: మహాశివరాత్రి పూజా చేస్తున్నారా ? పూజా సమయంలో పాటించవలసిన నియమాలెంటో తెలుసా..