AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidura Niti: ఈ 3 అలవాట్లు చేసుకున్నవారు తక్కువ సమయంలోనే ధనవంతులు.. సంపద ఎప్పటికీ తగ్గదు!

మహాభారతంలోని యముడు అంశం విదురుడు. గొప్ప జ్ఞాని. ధర్మస్వరూపుడు. ధర్మ మార్గంలో నడిచిన విదురుడు .. శ్రీ కృష్ణుడు మహా భక్తుడు.. మహాభారతంలో ముఖ్యమైన పాత్రలలో ఒకడు. దృతరాష్ట్రుడికి ఎప్పుడూ మంచి చెడుల గురించి చెబుతూ ఉండేవాడు. అయన చెప్పిన విషయాలు విదురు నీతిగా ప్రసిద్దిగంచాయి. ఆ విషయాలు నేటికీ అనుసరణీయం అని పెద్దలు చెబుతారు. ఈ రోజు విదురుడు చెప్పిన మూడు అలవాట్లను అలవరుచుకుంటే.. చిన్న వయసులోనే ధనవంతుడు అవుతారు. ఎటువంటి ప్రతి రంగంలో ఉన్నా కొత్త శిఖరాలను చేరుకోగలరు. జీవితాన్ని మెరుగుపరిచే ఈ 3 ప్రత్యేక అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం?

Vidura Niti: ఈ  3 అలవాట్లు చేసుకున్నవారు తక్కువ సమయంలోనే ధనవంతులు.. సంపద ఎప్పటికీ తగ్గదు!
Vidura Niti
Surya Kala
|

Updated on: Sep 01, 2025 | 1:45 PM

Share

మహాభారతంలోని గొప్ప జ్ఞాని విదురుడు. ఆయన చెప్పిన విషయాలు కలియుగంలో కూడా జీవితానికి మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. ఆయన రచించిన విదురు నీతి అనే పుస్తకం జీవితంలోని ప్రతి అంశం గురించి, సమాజంలోని ప్రతి అంశం గురించి లోతైన విషయాలను వెల్లడిస్తుంది. విదుర నీతిలో 3 ప్రధాన అలవాట్లను ప్రస్తావించారు. ఈ అలవాట్లను పాటించే వ్యక్తి ఎవరైనా సరే ధనవంతుడు అవుతాడు. అంతేకాదు కాదు జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధిస్తాడు. గౌరవాన్ని పొందుతాడు. జీవితాన్ని మెరుగుపరిచే ఈ 3 ప్రత్యేకమైన అలవాట్లు ఏమిటో తెలుసుకోండి..

శ్రద్ధ, కృషి విదుర నీతి ప్రకారం..కష్టపడి పనిచేసే వ్యక్తి, నిజాయితీగా, అంకితభావంతో పనిని చేసే వ్యక్తి జీవితంలో డబ్బుకి లోటు ఉండదు. ఏ పని మొదలు పెట్టినా విజయం సాధిస్తాడు. కష్టపడి పనిచేయడమే విజయానికి మెట్లు అని విదురుడు చెప్పాడు. సోమరితనం, వాయిదా వేసే వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ పురోగతి సాధించలేరు. అదృష్టం కూడా అలాంటి వారికి మద్దతు ఇవ్వదు. మరోవైపు కష్టపడి పనిచేసే వ్యక్తి తన బాధ్యతలను అర్థం చేసుకుని సమయానికి తన పనిని పూర్తి చేస్తాడు. దీంతో అతనికి సంపదన చాలా సులభం.

నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి కొత్తది నేర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించే వ్యక్తి ఎప్పుడూ విఫలం కాడని విదురుడు చెప్పాడు. అంతేకాదు అలాంటి వ్యక్తి జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధించగలడు. జీవితంలో జ్ఞానం, నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా ఒక వ్యక్తి తన సామర్థ్యాన్ని బలపరుచుకుంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడం ద్వారా అతను కాలంతో పాటు ముందుకు సాగి, అవకాశాలను సద్వినియోగం చేసుకోగలడు. విద్యావంతుడు, అవగాహన ఉన్న వ్యక్తి తన తెలివితేటలతో సంపదను సంపాదించగలడని విదుర నీతి చెబుతోంది.

ఇవి కూడా చదవండి

నిగ్రహం, పొదుపు విదుర నీతి ప్రకారం సంయమనంతో కూడిన జీవితం, ఖర్చులపై నియంత్రణ ఒక వ్యక్తిని ధనవంతుడిని చేస్తుంది. ఒక వ్యక్తి తన కోరికలను, అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటే.. అతను తన ఆదాయాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలడు. పొదుపు అంటే మీ అవసరాలు.. కోరికల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం .. తక్కువ డబ్బుతో గొప్ప ఫలితాలను సాధించడం. సంయమనం, పొదుపు పాటించే వ్యక్తులు ఎల్లప్పుడూ ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు. అవసరమైనప్పుడు డబ్బు లేకపోవడం అన్న మాటే వీరి జీవితంలో ఉండదు.

విదుర నీతి ఈ 3 విషయాలు మనకు నేర్పుతాయి. కష్టపడి పనిచేయడం, జ్ఞానం, నిగ్రహంతో జీవితాన్ని గడిపే వ్యక్తి ధనవంతుడు కావడమే కాదు సమాజంలో అటువంటి వ్యక్తికి గౌరవం కూడా పెరుగుతుంది. ఈ అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ఏ వ్యక్తి అయినా విజయం, శ్రేయస్సును సాధిస్తాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే