Vastu Tips for Money: వ్యాపారంలో నష్టాలా.. క్యాష్ కౌంటర్ విషయంలో ఈ వాస్తు నియమాలు పాటించి చూడండి..

కొత్త దుకాణంలో వాస్తుకు సంబంధించిన కొన్ని నియమాలను పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. దిశ గురించి చెప్పాలంటే.. లక్ష్మీదేవి ముఖం తూర్పు వైపు ఉండాలి. క్యాష్ కౌంటర్ ఉంచేటప్పుడు నియమం ఏమిటంటే మీ నగదు పెట్టె  డ్రాయర్ మీకు కుడి వైపున ఉండాలి.

Vastu Tips for Money: వ్యాపారంలో నష్టాలా.. క్యాష్ కౌంటర్ విషయంలో ఈ వాస్తు నియమాలు పాటించి చూడండి..
Vastu Tips
Follow us
Surya Kala

|

Updated on: Jul 28, 2023 | 8:11 AM

జీవితంలో డబ్బుఒక భాగమే.. అదే విధంగా డబ్బు జీవితం నడవనికి అత్యంత అవసరం. దీంతో వివిధ రకాల వృత్తులను ఎంచుకుంటారు. వ్యాపారస్తులు తమ ఆర్ధిక వృద్ధిని కోరుకుంటూ.. ఆదాయాన్ని పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మీ ఆదాయం పెరగకపోతే.. మీ కొత్త దుకాణంలో వాస్తుకు సంబంధించిన కొన్ని నియమాలను పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. దిశ గురించి చెప్పాలంటే.. లక్ష్మీదేవి ముఖం తూర్పు వైపు ఉండాలి. క్యాష్ కౌంటర్ ఉంచేటప్పుడు నియమం ఏమిటంటే మీ నగదు పెట్టె  డ్రాయర్ మీకు కుడి వైపున ఉండాలి. క్యాష్ కౌంటర్‌ను తెరిచేటప్పుడు.. దానిని ఉత్తరం లేదా దక్షిణం వైపు తెరవాలి.

క్యాష్ డ్రాయర్ లోపల గ్లాస్ ఉండాలి. నగదు పెట్టె లోపల డబ్బు మాత్రమే ఉంచండి. అందులో ఎలాంటి ఆయుధం, తోలు వస్తువులు వంటివి ఉంచవద్దు. సాలెపురుగులు మొదలైనవి ఉండకుండా కాలానుగుణంగా శుభ్రం చేయండి. శుభ్ లాబ్ , సిద్ధి, బుద్ధి, స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలను దుకాణం తలుపుపై ​​ముద్రించుకోవాలి. ఇలా చేయడం వలన దుకాణంలోని వాస్తు దోషం తొలగిపోతుంది. అంతేకాదు సుఖ సంపదలు లభిస్తాయి. దుకాణంలో పూజగది ఉంటే.. దీనిని ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి.

ప్రధాన ద్వారం ముందు స్తంభం, చెట్టు వంటి అడ్డంకులు ఉండకూడదు. ఎందుకంటే ఇలాంటివి శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. షాపు యజమానులు ఈశాన్య, వాయువ్య , దక్షిణ దిశల్లో షాపులో ఎప్పుడూ కూర్చోకూడదు. మీరు మీ సీటును నైరుతి, తూర్పు లేదా ఉత్తరంలో ఏర్పాటు చేసుకోండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)