Vastu Tips for Washing Clothes: రాత్రి బట్టలు ఎందుకు ఉతకరాదు? ఆరబెట్టకూడదో తెలుసా..

వాస్తు ప్రకారం, మురికి మరియు మురికి బట్టలు ఉతకడానికి సరైన సమయం కూడా ఉంది. అందుకే బట్టలు ఉతకాలని రాత్రిపూట కాకుండా ఉదయం పూట ఉతకాలని పేర్కొన్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ నియమం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ చాలా మంది ఉదయం హడావిడిగా పనికి బయలుదేరే ముందు సమయాన్ని వృథా చేయకుండా రాత్రికి అన్ని పనులను పూర్తి చేస్తారు.

Vastu Tips for Washing Clothes: రాత్రి బట్టలు ఎందుకు ఉతకరాదు? ఆరబెట్టకూడదో తెలుసా..
Vastu Tips For Washing Clothes
Follow us
Surya Kala

|

Updated on: Nov 19, 2024 | 6:50 PM

ప్రస్తుతం మనిషి జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. దీంతో ఉదయం చేసే పని రాత్రి.. రాత్రి చేసే పనులు చేయాల్సి వస్తుంది. తినే ఆహారం నుంచి నిద్ర, బట్టలు ఉతకడం వంటి అనేక విషయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం సమయంలో బిజీబిజీగా గడిపే చాలా మంది మురికి బట్టలను రాత్రి సమయంలో ఉతుక్కుంటున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడానికి లేదా ఇంట్లో వస్తువులను ఉంచడానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. ఈ నియమాలు మూఢనమ్మకాలు అనుకోవద్దు. కొన్ని నియమాలు ఆరోగ్యం కోసం.. అంతేకాదు కుటుంబం జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సానుకూల శక్తిని తెచ్చేందుకే.. కనుక ఇంట్లో వివిధ వస్తువులను ఎక్కడ ఉంచాలి, ఏ పరిమాణంలో ఉండాలి అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఈ నిబంధనలలో బట్టలు ఉతకడానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి.

వాస్తు ప్రకారం మురికి బట్టలు ఉతకడానికి సరైన సమయం కూడా ఉంది. అందుకే బట్టలను రాత్రి సమయంలో ఉతక కుండా ఉదయం సమయంలో ఉతకాలని పేర్కొన్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ నియమం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఉదయం హడావిడిగా ఉద్యోగానికి వెళ్ళే వారు సమయాన్ని వృథా చేయకుండా రాత్రి సమయంలో అన్ని పనులను పూర్తి చేసుకోవాలని భావిస్తారు. చేసుకుంటారు కూడా.. అయితే రాత్రి సమయంలో ఉతికిన బట్టలు ధరించడం చాలా అశుభకరమైనవిగా అనారోగ్య కరమైనవి గా పరిగణించబడుతున్నాయి.

రాత్రి సమయంలో ఎందుకు ఉతకకూడదంటే..?

  1. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో బట్టలు ఉతకడం సరికాదు. రాత్రి సమయంలో బట్టలు ఉతికితే.. ఆ తడి బట్టలు ఆరు బయట ఆరబెట్టవద్దు. ఇది ఆనందం, శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుంది.
  2. వాస్తు శాస్త్రం ప్రకారం బట్టలను ఎప్పుడూ సూర్యదయం తర్వాత మాత్రమే ఉతుక్కోవాలి. ఉతికిన బట్టలను సూర్య రశ్మిలో ఆరబెట్టడం మంచిది. ఎండలో బట్టలను అరబెట్టడం వలన ప్రతికూల శక్తి పోతుంది.
  3. అంతేకాదు ఎండలో ఆరబెట్టిన బట్టల్లో ఉండే హానికరమైన క్రిములు కూడా నాశనం అవుతాయి. అలా ఎండలో ఆరబెట్టిన దుస్తులు ధరించినప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం.. శరీరంలో పాజిటివ్ ఎనర్జీ కూడా ప్రసారం అవుతుంది.
  4. వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో ప్రతికూల శక్తి పుష్కలంగా ఉంటుంది. రాత్రి బట్టలు ఉతకడం, బయట ఆరబెట్టడం వల్ల బట్టల్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అంతేకాదు బట్టల్లో ఉన్న క్రిములు.. చల్లదనానికి అందులో ఉంటాయి. చల్లదనంలో ఆరబెట్టిన బట్టలను ధరించడం ఆరోగ్యానికి హానికరం. ప్రతికూల శక్తి శరీరానికి ఏ విధంగానూ మంచిది కాదు.
ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
వాణ్ణి వదిలేస్తే.. నేను, నా భార్య ఆత్మహత్య చేసుకుంటాం.! వీడియో..
వాణ్ణి వదిలేస్తే.. నేను, నా భార్య ఆత్మహత్య చేసుకుంటాం.! వీడియో..
పంబన్ బ్రిడ్జిపై హైస్పీడ్ రైలు పరుగులు.! భారతీయ రైల్వేలో అద్భుతం
పంబన్ బ్రిడ్జిపై హైస్పీడ్ రైలు పరుగులు.! భారతీయ రైల్వేలో అద్భుతం