Viral Video: కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్న వీడియో.. బిస్కెట్ ప్యాకెట్ గురించి కోతి, మనిషి మధ్య పోటీ..

కోతి తెలివి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందుకనే కోతికి సంబంధించిన వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తూనే ఉంటాయి. తాజాగా ఓ బిస్కెట్ ప్యాకెట్‌ గురించి కోతి, మనిషి మధ్య చోటు చేసుకున్న ఫన్నీ వాదన వీడియో ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోను ఇప్పటి వరకు 40 లక్షల మందికి పైగా లైక్ చేయగా ఈ క్లిప్ చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నామని వ్యాఖ్యానిస్తున్నారు.

Viral Video: కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్న వీడియో.. బిస్కెట్ ప్యాకెట్ గురించి కోతి, మనిషి మధ్య పోటీ..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Nov 19, 2024 | 6:43 PM

ప్రస్తుతం ఒక మనిషి, కోతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ వీడియోను చూసి ప్రజలు తమ నవ్వును నియంత్రించుకోలేకపోతున్నారు. ఇందులో ఓ వ్యక్తి, కోతికి మధ్య బిస్కెట్ ప్యాకెట్ కోసం వాదన జరిగింది. ఈ వీడియో ఇప్పటి వరకు మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. దీనిని ఆస్వాదిస్తున్న నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియో జంతుప్రదర్శనశాలలో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. అక్కడ బోనులో బంధించిన కోతి దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు. అయితే మరు క్షణంలో చోటు చేసుకున్న సంఘటనతో చూసిన వారు ఒక్కసారిగా నవ్వుకున్నారు. కోతి, వ్యక్తీ ఇద్దరూ బిస్కెట్ ప్యాకెట్ లాక్కోవడం మొదలు పెట్టారు. ఈ సమయంలో ఇద్దరూ ప్యాకెట్‌ను ఒకరి నుంచి ఒకరు క్షణ కాలంలో లాక్కున్నారు. మనిషితో సమానంగా కోతి బిస్కెట్ ప్యాకెట్ ను తీసుకునే స్పీడ్ జనాలను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

కోతి చేతిలో బిస్కెట్ ప్యాకెట్‌ని పెట్టి.. అది తీసుకునేలోగా వెంటనే ఆ వ్యక్తి ఆ ప్యాకెట్‌ను తీసుకున్నాడు. అప్పుడు కోతి స్పందన చూడాల్సిందే.. ఎంత వర్ణించినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి చేతి నుంచి బిస్కెట్ ప్యాకెట్ ను కోతి మెరుపు వేగంతో లాక్కుంది. మరుక్షణం ఆ వ్యక్తి మళ్లీ కోతి నుంచి అదే పని చేశాడు. ఇలా ఇద్దరి మధ్య రెండు మూడు సార్లు జరిగింది. అయితే వీరిద్దరూ ప్యాకెట్‌ని లాక్కున్న స్పీడ్ చూడాల్సిందే. చివరకి కోతి మెరుపు వేగంగా బిస్కెట్ ప్యాకెట్ ను తన నోటిలో పెట్టుకుని ఇప్పుడు తీసుకో అన్నట్లు ఆ వ్యక్తీ వైపు చూసింది. ఆ సమయంలో కోతి యాక్షన్ చూడాల్సిందే.

ఇక్కడ వీడియో చూడండి

@asemone_abii888 ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఈ వీడియోను చూడటం ద్వారా మీ మూడ్‌ని ఫ్రెష్ చేసుకోవచ్చు. చిన్న చిన్న సంఘటనలు కూడా ప్రజల ముఖాల్లో చిరునవ్వు తెప్పిస్తాయనే విషయానికి ఈ వీడియో సజీవ సాక్ష్యం. అయితే జంతుప్రదర్శనశాలల్లో బందీలుగా ఉన్న జంతువులను ఈ పద్ధతిలో ట్రీట్ చేయొద్దని TV9 తన పాఠకులందరికీ విజ్ఞప్తి చేస్తుంది. అంతేకాదు ఇలా జంతువుల పట్ల ప్రవర్తించడం.. టీజ్ చేయడం చట్ట రీత్యా నేరం..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే