Vastu Tips: ఇంటి పూజ గదిలో ఈ దేవుళ్ల విగ్రహాలను ఉంచవద్దు.. పెడితే కోరి ఆర్ధిక కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..

శనిశ్వరుడి వలె కాళికాదేవి అమ్మవారి విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని ఇంటి పూజ గదిలో ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే కాళికాదేవి ఉగ్ర దేవత. అందువల్ల ఇంట్లో ఉన్న వారు అమ్మవారిని తగిన విధంగా పూజ చేయలేరు. అంతేకాదు కాళికాదేవిని పూజించే నియమాలు కూడా చాలా కష్టం. కనుక కాళికాదేవిని పూజ గదిలో పెట్టుకోవడం పూజించడం నిషేధం.

Vastu Tips: ఇంటి పూజ గదిలో ఈ దేవుళ్ల విగ్రహాలను ఉంచవద్దు.. పెడితే కోరి ఆర్ధిక కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..
Vastu Tips For Puja Room
Follow us
Surya Kala

|

Updated on: Jun 07, 2024 | 7:14 AM

వాస్తవానికి ప్రతి ఇంట్లోని పూజ గదిలో వివిధ దేవుళ్ళు, దేవతల విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇంటిలో ఉండే పూజ గదిలో కొంతమంది దేవుళ్ళను లేదా దేవతల విగ్రహాలు లేదా చిత్రాలను ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వలన ప్రతికూల పరిణామాలు ఏర్పడతాయని విశ్వాసం. అటువంటి పరిస్థితిలో.. ఇంటిలోని పూజ గదిలో తెలిసి తెలియక కూడా కొంతమంది దేవుళ్ళ విగ్రహాలు లేదా చిత్రాలను ఉంచవద్దు. ఇలా ఉంచడం అశుభం అని వాస్తు శాస్త్రంలో పేర్కొంది. ఈ నేపధ్యంలో ఏయే దేవుళ్ళను ఇంటి పూజ గదిలో పెట్టుకోరాదో తెలుసుకుందాం..

శనిశ్వరుడు హిందూ మతంలో శనిశ్వరుడిను న్యాయ దేవుడిగా భావిస్తారు. చాలా మంది కర్మ ప్రదాత శనిశ్వరుడి కూడా పూజిస్తారు. అయితే అతని చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఇంటి పూజ గదిలో ఉంచడం నిషేధించబడింది. ఎందుకంటే శనిశ్వరుడి ప్రభావం ఏళ్లకు ఏళ్లు ఉంటుంది. కనుక శనిశ్వరుడిని ఇంట్లో కాకుండా ఆలయంలో ఉన్న విగ్రహాన్ని పుజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

కాళికా దేవి శనిశ్వరుడి వలె కాళికాదేవి అమ్మవారి విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని ఇంటి పూజ గదిలో ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే కాళికాదేవి ఉగ్ర దేవత. అందువల్ల ఇంట్లో ఉన్న వారు అమ్మవారిని తగిన విధంగా పూజ చేయలేరు. అంతేకాదు కాళికాదేవిని పూజించే నియమాలు కూడా చాలా కష్టం. కనుక కాళికాదేవిని పూజ గదిలో పెట్టుకోవడం పూజించడం నిషేధం.

ఇవి కూడా చదవండి

నటరాజ విగ్రహం చాలా మంది నటరాజ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అయితే నటరాజుడు నిజానికి శివుని ఉగ్రరూపంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో ఎవరైనా ఇంటి పూజ గదిలో పొరపాటున కూడా నటరాజ విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని ఉంచకూడదు. ఇలా నటరాజ విగ్రహం పెట్టుకోవడం వలన ఇంట్లోని సభ్యుల మధ్య విబేధాలు ఏర్పడతాయి.. అశాంతి వాతావరణం ఉంటుంది.

నిలబడిన గణేశుడు, లక్ష్మీదేవి దేవతలు, దేవతల విగ్రహాలు కూడా వివిధ భంగిమలలో కనిపిస్తాయి. అయితే ఇంట్లోకి ఎప్పుడూ కూర్చున్న గణేశుడు, లక్ష్మీదేవి విగ్రహాలను లేదా చిత్ర పాటలను మాత్రమే పెట్టుకోవాలి. పూజించాలి. అంతేకాని ఇంట్లోని పూజ గదిలో పెట్టుకునే దేవతామూర్తుల విగ్రహాలను నిలబడి లేదా మరేదైనా భంగిమలో ఉంచడం శ్రేయస్కరం కాదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు