AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankasta Chaturthi: జూన్ 9 లేదా 10 జూన్ సంకష్టహర చతుర్థి ఎప్పుడు? సరైన తేదీ, శుభ సమయం, పూజా విధానం

తిధుల్లో చతుర్థి తిథి కూడా గణేశుడి పూజకు చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి తిథి రెండూ గణేశుడికి అంకితం చేయబడ్డాయి. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి రాబోతోంది, దీనిని వినాయక చతుర్థి అంటారు. వినాయక చతుర్థి రోజున గణపతిని పూజించడం ద్వారా అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. వినాయక చతుర్థి ఉపవాసం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు జ్ఞానం, సంపద, శ్రేయస్సుకు అధినాయకుడైన గణపతి బప్పాకు అంకితం చేయబడింది

Sankasta Chaturthi: జూన్ 9 లేదా 10 జూన్ సంకష్టహర చతుర్థి ఎప్పుడు? సరైన తేదీ, శుభ సమయం, పూజా విధానం
Sankasta Chaturthi
Surya Kala
|

Updated on: Jun 07, 2024 | 7:44 AM

Share

హిందూ మతంలో క్యాలెండర్‌లోని ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడినట్లే.. ఒకొక్క తిథికి దాని సొంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రతి తిథి ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది. సోమవారం శివునికి, మంగళవారం హనుమంతునికి, గురువారం విష్ణువుకి అంకితం చేయబడినట్లే.. తిధుల్లో చతుర్థి తిథి కూడా గణేశుడి పూజకు చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి తిథి రెండూ గణేశుడికి అంకితం చేయబడ్డాయి. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి రాబోతోంది, దీనిని వినాయక చతుర్థి అంటారు. వినాయక చతుర్థి రోజున గణపతిని పూజించడం ద్వారా అన్ని ఆటంకాలు తొలగిపోతాయి.

వినాయక చతుర్థి ఉపవాసం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు జ్ఞానం, సంపద, శ్రేయస్సుకు అధినాయకుడైన గణపతి బప్పాకు అంకితం చేయబడింది. ఈ తిథిని సంకష్టి చతుర్థి అని కూడా అంటారు. వినాయక చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. అయితే ఈ నెలలో సంకష్టి చతుర్థి పూజ విషయంలో గందరగోళం ఉంది. కాబట్టి దాని ఖచ్చితమైన తేదీ, శుభ సమయం గురించి తెలుసుకుందాం..

జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి ప్రారంభం – జూన్ 9 మధ్యాహ్నం 3.44 గంటలకు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష చతుర్థి తిథి ముగింపు – జూన్ 10 సాయంత్రం 04:14 గంటలకు.

ఇవి కూడా చదవండి

సంకష్టి చతుర్థి వ్రతం ఎప్పుడంటే పంచాంగం ప్రకారం సంకష్టి చతుర్థి వ్రతం జూన్ 10, 2024న మాత్రమే చేయాల్సి ఉంది.

సంకష్టి చతుర్థి చంద్రోదయం- చంద్రాస్తమయం సమయం

సంకష్టి చతుర్థి చంద్ర దర్శన సమయం – 2 గంటల 47 నిమిషాలకు. సంకష్టి చతుర్థి చంద్రాస్తమయం సమయం రాత్రి 10:54. అటువంటి పరిస్థితిలో.. భక్తులు తమ సౌలభ్యం ప్రకారం ఈ కాలంలో వినాయకుడిని పూజించవచ్చు.

సంకష్టి చతుర్థి పూజ విధి:

సంకష్టి చతుర్థి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా పీటాన్ని శుభ్రం చేసి.. ఎర్రటి బట్ట పరచి దానిపై వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించండి. గణేశుడికి గంగాజలంతో స్నానం చేయించి.. పసుపు, కుంకుమ, గంధపు తిలకం దిద్దండి అనంతరం గణపతికి పసుపు పువ్వులు లేదా పూల దండను సమర్పించండి. గణేశుడికి మోదకం సమర్పించి.. దేశీ నెయ్యితో దీపం వెలిగించండి. వేద మంత్రాలతో గణపతిని ధ్యానించి పూజించండి. సంకష్టి చతుర్థి వ్రత కథను పఠించి, ఆరతి ఇవ్వండి అయితే వినాయకుని పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాన్ని ఉపయోగించవద్దు. పూజ అనంతరం పూజ సమయంలో తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని కోరుతూ వినాయకుడి విగ్రహం ముందు గుంజీలు తీయండి. ఉపవాస సమయంలో తామసిక ఆహారాన్ని తినకూడదు, ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. మర్నాడు గణేశుడికి సమర్పించిన ప్రసాదాన్ని తీసుకుని తమ ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుంది.

శ్రీ గణేష్ పూజ మంత్రం

త్రయీమయాఖిలబుద్ధిదాత్రే బుద్ధిప్రదీపాయ సురాయ ।

నిత్య సత్యాయ చ నిత్యబుద్ధి నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్.

అని విఘ్నములకధిపతి వినాయకుడిని తలచుకుంటూ ఈ మంత్రాన్ని జపించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు