Plants For North Direction Vastu Tips: ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందా? శుభం కలగాలంటే ఈ చెట్లలో ఒకదానిని ఉత్తరం వైపు ఉంచండి

ఇంటి ఉత్తర దిక్కును సంపదకు అధిదేవత కుబేరుని దిక్కుగా భావిస్తారు. ఈ దిశలో డబ్బును ఆకర్షించే మొక్కలను నాటడం చాలా ప్రయోజనకరం. ఇంటికి ఉత్తరం వైపు బాల్కనీ ఉంటే, లేదా ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఉంటే మీకు అదృష్టాన్ని తీసుకుని వచ్చే మొక్కలను ఉంచవచ్చు. ఉత్తర దిశలో ఏ చెట్టును నాటితే మీ సంపద పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Plants For North Direction Vastu Tips: ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందా? శుభం కలగాలంటే ఈ చెట్లలో ఒకదానిని ఉత్తరం వైపు ఉంచండి
Vastu Tips For Plant
Follow us

|

Updated on: Aug 10, 2023 | 12:22 PM

వాస్తు శాస్త్రంలో దిక్కులకు ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరం వైపు సంపదకు అధిదేవత అయిన లక్ష్మి దేవి,  సంపదకు దేవుడు అయిన కుబేరుని నివాసం అని నమ్ముతారు. అందుకనే ఈ దిక్కుని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచడమే కాదు.. ఈ దిశలో కొన్ని ప్రత్యేకమైన చెట్లను నాటడం వల్లలక్ష్మి దేవి, కుబేరుల అనుగ్రహం  ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వాసం. ఇంటి ఉత్తర దిక్కును సంపదకు అధిదేవత కుబేరుని దిక్కుగా భావిస్తారు. ఈ దిశలో డబ్బును ఆకర్షించే మొక్కలను నాటడం చాలా ప్రయోజనకరం. ఇంటికి ఉత్తరం వైపు బాల్కనీ ఉంటే, లేదా ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఉంటే మీకు అదృష్టాన్ని తీసుకుని వచ్చే మొక్కలను ఉంచవచ్చు. ఉత్తర దిశలో ఏ చెట్టును నాటితే మీ సంపద పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వెదురు చెట్టు వాస్తు, ఫెంగ్ షుయ్లలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మొక్క వాస్తు శాస్త్రంలో  అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. మీ ఇంటికి ఉత్తరం వైపు బాల్కనీ లేకపోతే, మీరు ఈ మొక్కను గాజు గిన్నెలో ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాదు వెదురు మొక్క వాడిపోతే వెంటనే దానిని మార్చండి. ఏ మొక్క అయినా ఎండిపోయి ఉంటే ఇంట్లో ఉంచకూడదని గుర్తుంచుకోండి.

మనీ ప్లాంట్ డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఇది ఇంటి సభ్యులందరికీ అదృష్ట కారకంగా పరిగణించబడుతుంది. మనీ ప్లాంట్ ను చెట్టును ఉత్తర దిశలో నాటితే.. ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది.  డబ్బును ఆదా చేసుకోగలుగుతారు. అంతేకాదు ఎప్పుడూ ఆర్ధిక ఇబ్బందులు తలెత్తవు.

ఇవి కూడా చదవండి

తులసి మొక్కను లక్ష్మిదేవి రూపంగా భావిస్తారు. హిందువులందరూ తమ ఇళ్లలో తప్పనిసరిగా ఈ చెట్టును పెంచుతూ వాటిని పూజిస్తారు. ఈ మొక్కను నాటడం ఉత్తమ అంశం సమాధానంగా పరిగణించబడుతుంది. ఇంట్లో శాంతి, సౌఖ్యాలను ఇస్తుంది. ఈ మొక్క పెరగడానికి తగినంత సూర్యకాంతి అవసరం. కాబట్టి సూర్యరశ్మి ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఈ మొక్కను ఉంచండి.

ఉత్తర దిశలో నాటిన అరటి చెట్టు కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ చెట్టును నాటిన తరువాత, ప్రతిరోజూ పూజించాలి. ఇలా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులపై లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)