Akshat Puja Tips: పూజలో అక్షతల ప్రాముఖ్యత.. పనిలో ఆటంకాలు తొలగడానికి, అదృష్టం కోసం ఏ విధమైన చర్యలు చేయాలంటే..

అక్షత్ అంటే -క్షతములు కానివి అంటే క్షీణించనివి. భగ్నముగాని బియ్యమును అక్షతలంటారు. అక్షతలు లేదా అక్షింతలు నీటితో తడిపిన బియ్యము, పసుపు తో తయారు చేస్తారు. ఇది చాలా పవిత్రమైనవిగా భావించి పూజలో ప్రత్యేకంగా సమర్పించబడటానికి కారణం ఇదే. అక్షతకు సంబంధించిన నిశ్చయాత్మక చర్యల గురించి తెలుసుకుందాం..

Akshat Puja Tips: పూజలో అక్షతల ప్రాముఖ్యత.. పనిలో ఆటంకాలు తొలగడానికి, అదృష్టం కోసం ఏ విధమైన చర్యలు చేయాలంటే..
Akshat Rules During Worship
Follow us
Surya Kala

|

Updated on: Aug 10, 2023 | 10:32 AM

హిందువుల పూజ సమయంలో, లేదా శుభకార్యాల్లో పూజా ద్రవ్యాలతో పాటు అక్షతలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం ప్రకృతిలో మనిషి పండించిన పంట వరి.. ఆ తర్వాత వరి పంటను  భగవంతుడికి నైవేద్యంగా సమర్పించారు. అప్పటి నుండి నేటి వరకు అక్షతలను పూజలో  ఉపయోగించబడుతున్నాయి. అక్షత్ అంటే -క్షతములు కానివి అంటే క్షీణించనివి. భగ్నముగాని బియ్యమును అక్షతలంటారు. అక్షతలు లేదా అక్షింతలు నీటితో తడిపిన బియ్యము, పసుపు తో తయారు చేస్తారు. ఇది చాలా పవిత్రమైనవిగా భావించి పూజలో ప్రత్యేకంగా సమర్పించబడటానికి కారణం ఇదే. అక్షతకు సంబంధించిన నిశ్చయాత్మక చర్యల గురించి తెలుసుకుందాం.. అంతేకాదు అక్షతలతో ఏ విధమైన చర్యలతో మనిషి కోరికలన్నీ రెప్పపాటులో నెరవేరుతాయి.

అక్షతకు సంబంధించిన జ్యోతిష్యం, పూజా చర్యలు

  1. హిందూ విశ్వాసం ప్రకారం ఒక వ్యక్తి గతంలో చేసిన శారీరక, దైవిక , మానసిక పాపాలు ఏవైనా సరే దేవత పూజ సమయంలో అక్షతను సమర్పించడం ద్వారా తొలగించబడతాయి.
  2. ఎంత కష్టపడి పనిచేసినా ఆహారంలో కొరత ఏర్పడితే.. ఇంట్లో పూజ గదిలో ఒక గిన్నెలో అక్షతలను వేసి అందులో అన్నపూర్ణదేవి ఫోటో లేదా ప్రతిమను ఉంచి రోజూ అన్నపూర్ణ దేవిని పూజించాలి.
  3. ఎన్ని ప్రయత్నాలు చేసిన కూడా వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందలేకపోతే, మీ కెరీర్, వ్యాపారంలో పురోగతిని పొందడానికి మీరు కాకి లేదా ఇతర పక్షులకు పరమాన్నం తినిపించాలి.
  4. శివుని ఆరాధనలో అక్షతను సమర్పించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. తమ కోరికను శివయ్యకు విన్నవిస్తూ.. అక్షతలను పూజ సమయంలో సమర్పించాలని నమ్మకం. ఇలా చేయడం వలన భోళాశంకరుడు ప్రసన్నుడై, కోరుకున్న వరాన్ని ఇస్తాడు అని విశ్వాసం.
  5. ఇవి కూడా చదవండి
  6. శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో పసుపుతో తయారు చేసిన 21 అక్షత గింజలను వేసి దానిని నైవేద్యంగా సమర్పించాలి. వాటికి అమ్మవారి ప్రసాదంగా భావించి ఐశ్వర్యస్థానంలో ఉంచితే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుందని నమ్మకం. అంతేకాదు ఆ ఇంటి సభ్యులపై లక్ష్మిదేవి అనుగ్రహం, ఆశీస్సులు కురుస్తాయని విశ్వాసం,
  7. హిందూ విశ్వాసం ప్రకారం ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో రోకుంకుమతో పాటు కొన్ని  అక్షతలను వేసి అర్ఘ్యం సమర్పిస్తే, ఆ వ్యక్తి  ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడి ఆశీర్వాదం లభిస్తుందని, అతని అదృష్టం బంగారంలా ప్రకాశిస్తుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే