Empathetic Advisors: ఈ 4 రాశుల మహిళలు మంచి సలహాలు ఇస్తారు.. తప్పక పాటించండి..
ఈ 4 రాశుల స్త్రీలు తమ పరిసరాలకు, ప్రియమైన వారికి మేలు చేసేందుకు, ఉత్తమమై, మంచి సలహాలను ఇస్తారు. ఒకవేళ మీరు సందిగ్ధంలో ఉన్నట్లయితే.. ఎలాంటి సంకోచం లేకుండా ఈ రాశుల వారిని సలహా అడిగితే ప్రయోజనం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అంతేకాదండోయ్.. ఈ 4 రాశుల స్త్రీల వ్యక్తిత్వం, లక్షణాలు, గుణగణాలు కూడా చాలా గొప్పవని చెబుతున్నారు వేదమూర్తులు. మరి ఆ నాలుగు రాశులు ఏంటి? రాశి చక్రం ప్రకారం వారు ఎలాంటి సలహాలు, సూచనలు చేస్తారు? వంటి ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వ్యక్తి జననానికి, సౌరకుటుంబానికి సంబంధం ఉందని, సౌరకుటుంబంలోని గ్రహాలు, నక్షత్రాలు వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రాశుల వారికి పుట్టినప్పటి నుంచి కొన్ని లక్షణాలు ఉంటాయి. దీని ప్రకారం.. ఈ 4 రాశుల స్త్రీలు తమ పరిసరాలకు, ప్రియమైన వారికి మేలు చేసేందుకు, ఉత్తమమై, మంచి సలహాలను ఇస్తారు. ఒకవేళ మీరు సందిగ్ధంలో ఉన్నట్లయితే.. ఎలాంటి సంకోచం లేకుండా ఈ రాశుల వారిని సలహా అడిగితే ప్రయోజనం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అంతేకాదండోయ్.. ఈ 4 రాశుల స్త్రీల వ్యక్తిత్వం, లక్షణాలు, గుణగణాలు కూడా చాలా గొప్పవని చెబుతున్నారు వేదమూర్తులు. మరి ఆ నాలుగు రాశులు ఏంటి? రాశి చక్రం ప్రకారం వారు ఎలాంటి సలహాలు, సూచనలు చేస్తారు? వంటి ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కర్కాటక రాశి..
కర్కాటక రాశికి సంబంధించిన మహిళలు లోతైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. ఇతరులపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. చంద్రుడి ప్రభావం చేత.. వీరు ఇతరుల భావాలను ఈజీగా గ్రహిస్తారు. ఇతరుల కష్టాలను ఓపికగా వింటూ.. ఆ కష్టాల నుంచి బయటపడేందుకు మార్గాలను పరిశీలిస్తారు. మంచి సలహాలను ఇస్తారు. వీరి శ్రవణ నైపుణ్యాలు.. ఎదుటి వారికి అర్థవంతమైన, ప్రయోజనకరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఉపకరిస్తాయి.
కన్యారాశి..
ఈ రాశి స్త్రీలు తమ జీవితంలో సున్నితమైన, విశ్లేషణాత్మక విధానాన్ని అవలంభిస్తారు. బుధుడు అధిపతి అయిన ఈ రాశి వారిలో వాక్చాతుర్యం ఎక్కువ. వారి క్యూమనికేషన్ స్కిల్స్, తార్కిక ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. సంక్లిష్ట సమస్యలను చేధించడంలో, ఇతరుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించడంలో వీరు ప్రతిభను కలిగి ఉంటారు. ఎదుటివారి సమస్యను, కష్టాలను అర్థం చేసుకుని, వారికి సమర్థమైన పరిష్కారాలను అందిస్తారు.
తులారాశి..
శుక్రగ్రహం ప్రభావంతో తులారాశికి చెందిన స్త్రీలు ఇతరుల చాలా అద్భుతంగా మాట్లాడుతారు. వీరు దౌత్యానికి ప్రసిద్ధి చెందుతారు. సామరస్యాన్ని పెంపొందించి, సమతుల్యతను కాపాడుతారు. సానుభూతిగల మనస్సు.. వీరిని ఆదర్శవంతమైన మధ్యవర్తులగా చేస్తుంది. వీరు ఎదుటి వారి సమస్యలను సావదానంగా విని, పరిస్కార మార్గాలను చూపుతారు.
మీన రాశి..
మీన రాశి వారు చాలా స్పష్టతతో ఉంటారు. సానుభూతి దృష్టితో, ఆధ్యాత్మిక భావనలను కలిగి ఉంటారు. అయితే, నిశితంగా పరిశీలించే లక్షణం వీరికి చాలా స్పెషల్ అని చెప్పాలి. వీరు ఇచ్చే సలహాలుగా అద్భుతంగా ఉపకరిస్తాయి. మంచి మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. అమూల్యమైన సలహాలు ఇస్తారు. కష్ట సమయాల్లో వీరిని ఆశ్రయించడం వలన.. వారు ఇచ్చే సలహాలు, సూచనలతో సమస్యల సుడిగుండం నుంచి బయటపడొచ్చు.
ఇలా ప్రతి రాశిచక్రం విభిన్నమైన కౌన్సెలింగ్ అవసరాలను తీర్చగల ప్రత్యేక నైపుణ్యాలను కలిగి ఉంటుంది. జీవిత ప్రయాణంలో మార్గదర్శకత్వం కోరుకునే వారికి ఇది భరోసా ఇస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..