AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో ప్రశాంతత లేదా? వాస్తు సమస్యలు కావొచ్చు.. ఇలా చేస్తే ఆల్ హ్యాపీస్..!

Home Vastu Tips: ప్రస్తుత కాలంలో చాలామంది మనశ్శాంతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృత్తిపరంగా, పెరుగుతున్న ఉద్యోగ, కుటుంబ బాధ్యతలు, ఆదాయాన్ని పెంచుకోవాలనే తాపత్రయం,..

Vastu Tips: ఇంట్లో ప్రశాంతత లేదా? వాస్తు సమస్యలు కావొచ్చు.. ఇలా చేస్తే ఆల్ హ్యాపీస్..!
Vastu Tips
Shiva Prajapati
|

Updated on: Mar 15, 2023 | 5:30 PM

Share

ప్రస్తుత కాలంలో చాలామంది మనశ్శాంతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృత్తిపరంగా, పెరుగుతున్న ఉద్యోగ, కుటుంబ బాధ్యతలు, ఆదాయాన్ని పెంచుకోవాలనే తాపత్రయం, ఇతర అనేక కారణాల వల్ల మానసిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దీంతో శరీరంలో బీపీ, షుగర్‌ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి అయోమయంగా, ఆందోళనగా, నిస్పృహలో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే, దీనికి అనారోగ్య కారణాలు ఒకటైతే.. వాస్తు కారణాలు మరొకటిగా చెబుతున్నారు వాస్తు పండితులు. కొన్ని వాస్తు పొరపాట్ల కారణంగా.. ప్రజలు తమ ఇళ్లలో, జీవితంలో సమస్యలు ఎదుర్కంటారని చెప్పారు. ఈ సమస్యలన్నింటికీ ఆచారణాత్మక వాస్తు నివారణలు తెలిపారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే..

1. ఈశాన్య మూలను పవిత్రంగా, శుభ్రంగా ఉంచాలి.

2. టాయిలెట్, సెప్టిక్ ట్యాంక్, స్టోర్ రూమ్, విరిగిన వస్తువులు, చెత్త బుట్ట కూడా ఈశాన్య మూలలో ఉంచడం మంచిది కాదు. వాటిని వెంటనే తొలగించాలి.

ఇవి కూడా చదవండి

3. ఈశాన్యంలో వాటర్ పాట్, వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఈ మూలలో నీరు ఏదో ఒకవిధంగా ప్రవహిస్తుంది కాబట్టి, ఇంటి మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.

4. ఈ కోనేరులో దేవుడి విగ్రహం లేదా గుడి ఉంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఎలాంటి మానసిక ఒత్తిడి, టెన్షన్, ఆందోళనలు ఉండవు. మానసికంగా ఎంతో దృఢంగా, స్థిరంగా ఉండగలుగుతారు.

5. ఈశాన్య మూలలో చెట్లు నాటడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

6. మానసిక ఆరోగ్యం విషయంలో ఈశాన్యం తర్వాత, నైరుతి మూల చాలా ముఖ్యమైనది. ఈశాన్య మూలను పెంచడం సాధ్యం కానప్పుడు నైరుతి వాస్తుకు అనుకూలంగా ఉండేలా ప్రయత్నించడం మంచిది. నైరుతి మూలను శుభ్రంగా ఉంచుకోవడం మానసిక ఆరోగ్యానికి మంచిది.

7. నైరుతి మూలలో మాస్టర్ బెడ్‌రూమ్ ఉండటం అవసరం. దీని వల్ల ఇంటి యజమానిలోనే కాకుండా కుటుంబంలో కూడా నాయకత్వ లక్షణాలు పెరిగి మానసిక ధైర్యం కలుగుతుంది. డిప్రెషన్ మాయమవుతుంది. ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు.

8. దక్షిణ దిశలో, నైరుతి మూలలో విగ్రహం లేదా పూజా మందిరాన్ని ఏర్పాటు చేయవద్దు. దీనివల్ల ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడి మనశ్శాంతి లోపిస్తుంది. వాటిని వెంటనే ఈశాన్య మూలకు తరలించడం మంచిది. నైరుతి మూలలో నీలం రంగు మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. గోడలకు నీలం రంగు వేయకూడదు, అక్కడ నీలిరంగు బల్బులు అమర్చకూడదు.

గమనిక: వాస్తు వివరాలు, జాతకాలు నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రజల ఆసక్తి, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు.

మరిన్ని జీవనశైలి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..