Budhaditya, Gajkesri Raja yog: ఉగాది నుంచి రెండు రాజయోగాలు.. ఈ మూడు రాశులకు అన్నింటా అదృష్టం.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి
ఈ ఏడాది ఉగాది రోజున బుధాదిత్య, గజకేసరి అనే రెండు రాజయోగాలు ఏర్పడనున్నాయి. మరోవైపు మీన రాశిలో దేవ గురువు బృహస్పతి, గ్రహాలకధిపతి సూర్యుడు, బుధుడు, చంద్రుడులతో పాటు..రాహువు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఈ అరుదైన సంయోగంతో ఈ ఉగాది నుంచి కొన్ని రాశులవారికి అన్నింటా అదృష్టం కలుగుతుంది.
తెలుగు పంచాంగం ప్రకారం నూతన సంవత్సరం ఉగాది పర్వదినం నుంచి మొదలవుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. తెలుగు వారు అత్యంత ఘనంగా జరుపుకునే ఉగాది పండగ ఈ ఏడాది మార్చి 22వ తేదీన వచ్చింది. ఈరోజు నుంచి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం శోభకృతు నామ సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. శోభకృతు అంటే లాభాలను కలిగించేది అని అర్ధం.. యుగాదికి స్వాగతం చెబుతూ పంచాంగ శ్రవణం చేస్తారు. అంతేకాకుండా రుచికరమైన ఉగాది పచ్చడి కూడా చేస్తారు. అయితే ఈ ఏడాది ఉగాది రోజున బుధాదిత్య, గజకేసరి అనే రెండు రాజయోగాలు ఏర్పడనున్నాయి. మరోవైపు మీన రాశిలో దేవ గురువు బృహస్పతి, గ్రహాలకధిపతి సూర్యుడు, బుధుడు, చంద్రుడులతో పాటు..రాహువు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఈ అరుదైన సంయోగంతో ఈ ఉగాది నుంచి కొన్ని రాశులవారికి అన్నింటా అదృష్టం కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఆ రాశులు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..
ధనుస్సు రాశి
ఈ రాశివారికి ఉగాది నుంచి అన్నింటా అదృష్టం కలిసి వస్తుంది. శుభవార్తలు వింటారు. మంచి రోజులు మొదలవుతాయి. ఈ రాశివారి జాతకంలో నాల్గవ ఇంట్లో రెండు రాజయోగాలు ఏర్పడనున్నాయి. దీంతో రాశి వారి ఆదాయం బాగా పెరుగురుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. వీరికి తమ పూర్వీకుల అస్థికలిసి వచ్చే అవకాశం ఉంది. తమదైన వ్యక్తిత్వంతో అందరి మన్ననలను పొందుతారు. కారు, బంగారం నగలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మిథున రాశి
ఈ రాశివారికి తెలుగు నూతన సంవత్సరం నుంచి మహాయోగం ఏర్పడనుంది. దీంతో అన్నింటా ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశి వారి జాతకంలో బృహస్పతి, సూర్యుడు మంచి స్థానంలో ఉన్నారు.ఉద్యోగం వెదుకుతున్న వారు శుభవార్త వింటారు. మంచి ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు.
సింహ రాశి:
ఈ రాశివారు తెలుగు నూతన సంత్సవంలో శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తుల జాతకంలో ఎనిమిదవ ఇంట్లో బుధాదిత్య , గజకేసరి రాజయోగాలు ఏర్పడనున్నాయి. దీంతో ఈ రాశి వారు ఆర్ధికంగా ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు. శాస్త్ర, విద్యార్థులకు శుభకాలం. ఆధ్యాత్మిక ప్రయాణాలను చేస్తారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)