Zodiac Signs: ఈ రాశులకు చెందిన సినీ నటులకు మహా యోగం.. అనూహ్య అదృష్టంతో అందలాలు దక్కుతాయి..

.ఈ నెల 16వ తేదీ నుంచి శుక్ర, రాహువులు మేష రాశిలో కలవబోతున్నందువల్ల సినిమా, టీవీ రంగాలకు చెందిన కొన్ని రాశుల వారికి విపరీత రాజయోగం, మహా భాగ్యయోగం వంటి అదృష్ట యోగాలు పట్టబోతున్నాయి.

Zodiac Signs: ఈ రాశులకు చెందిన సినీ నటులకు మహా యోగం.. అనూహ్య అదృష్టంతో అందలాలు దక్కుతాయి..
Zodiac SignsImage Credit source: TV9 Telugu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 14, 2023 | 6:23 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు కళలకు, నటనకు కారకుడు. సినిమా టీవీ నాటక కళా రంగాలకు చెందిన వారి జీవితాలు శుక్ర గ్రహం స్థితిగతుల మీదే ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా రాహు గ్రహం సినిమాటోగ్రఫీ కి కారకుడు. చంద్ర గ్రహం కూడా కళలకు సంబంధించిన గ్రహమే అయినప్పటికీ ప్రధానంగా సినిమా, టీవీ రంగాలు శుక్రుడి మీదే ఆధారపడి ఉంటాయి. ఈ నెల 16వ తేదీ నుంచి శుక్ర, రాహువులు మేష రాశిలో కలవబోతున్నందువల్ల సినిమా, టీవీ రంగాలకు చెందిన కొన్ని రాశుల వారికి విపరీత రాజయోగం, మహా భాగ్యయోగం వంటి అదృష్ట యోగాలు పట్టబోతున్నాయి. ఈ రెండు గ్రహాల కలయిక ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటే ఆ రాశుల వారు ఈ ఏడాది అందలాలు ఎక్కడం జరుగుతుంది.
అనుకూల రాశులు..
ఈ శుక్ర, రాహు గ్రహాల కలయిక మేషం, మిధునం, కర్కాటకం, తుల, ధనస్సు, మకర రాశి వారికి బాగా అనుకూలంగా ఉండి ఎన్నడూ ఊహించని అదృష్టాన్ని కలగజేస్తుంది. ఈ రంగాలలో బాగా తక్కువ స్థాయిలో ఉన్నవారు కూడా ఇప్పటి నుంచి కొద్ది ప్రయత్నంతో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. సినిమా, టీవీ రంగాలకు సంబంధించి అన్ని విభాగాలకు ఇది వర్తిస్తుంది. కానీ అందరికంటే కొద్దిగా ఎక్కువగా నటీనటులకు రాజయోగం, మహాభాగ్య యోగం పట్టడం జరుగుతుందని చెప్పవచ్చు. వీరికి కుబేర యోగం పట్టడమే కాకుండా మంచి గుర్తింపు రావటం, పలుకుబడి పెరగటం వంటివి కూడా జరుగుతాయి.
మేష రాశి
ఈ రాశి లోనే శుక్ర, రాహు గ్రహాల కలయిక చోటు చేసుకుంటున్నందువల్ల వీరి విషయంలో ఈ గ్రహాలు తప్పనిసరిగా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు రంగాలకి చెందిన ఈ రాశి వారికి సమాజంలో గౌరవ అభిమానాలు పెరుగుతాయి. ముఖ్యంగా డిమాండ్ పెరుగు తుంది. కొత్త అవకాశాలు అప్రయత్నంగా కలిసి వస్తాయి. అదృష్టం తడుతుంది. దేశ విదేశాల్లోని అందమైన ప్రదేశాలను సందర్శించడం జరుగు తుంది. ప్రజల నుచే కాక ప్రభుత్వాల నుంచి కూడా గుర్తింపు లభిస్తుంది.
మిథున రాశి
ఈ రాశి వారికి లాభ స్థానమైన మేషరాశిలో శుక్ర, రాహులు యుతి చెందటం అదృష్ట యోగం కిందే భావించాల్సి ఉంటుంది. లాభ స్థానం అంటే పురోగతికి, అభివృద్ధికి, విశేష ఆదాయానికి, భాగ్యానికి సంబంధించిన స్థానం అన్నమాట. సినిమా టీవీ రంగాలలో ఏ విభాగానికి చెందిన వారైనప్పటికీ ఈ రాశి వారికి తప్పకుండా అనూహ్యమైన అభివృద్ధి ఉంటుందని చెప్పాలి. ఈ రాశి వారి పేరు ప్రఖ్యాతులు మారుమోగి పోతాయి. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. యాక్టివిటీ ఎక్కువవుతుంది. క్రియేటివ్ రంగాలకు చెందినవారు మరీ ఎక్కువగా శుభ ఫలితాలను అనుభవిస్తారు.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి దశమ స్థానంలో అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన స్థానంలో శుక్ర, రాహు గ్రహాల కలయిక జరుగుతోంది. ఈ కలయిక వల్ల సినిమా, టీవీ రంగాలలో ఉన్న వారికి మహాభాగ్య యోగం పడుతుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ రాశి వారి సలహాలను, సూచనలను స్వీక రించి ఆదరించడం తప్పకుండా జరుగుతుంది. ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాల రీత్యా విస్తృతంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణాల వల్ల కూడా వీరి ఆర్థిక పరిస్థితి విశేషంగా మెరుగుపడుతుంది. నటన విభాగంలో ఉన్నవారికి బాగా అవకాశాలు కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతులు వ్యాపిస్తాయి.
తులా రాశి
ఈ రాశి వారికి ఏడవ స్థానంలో అంటే ప్రజా సంబంధాల స్థానంలో శుక్ర, రాహు గ్రహాల కలయిక చోటు చేసుకుంటుంది. ఈ రాశి వారికి కళల పరంగా గుర్తింపు లభించడంతోపాటు ప్రజాకర్షణ విపరీతంగా పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారి వల్ల సినిమా, టీవీ రంగాలకు కలసి వస్తుంది. ఈ రాశికి చెందిన మహిళలు అద్భుతమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించడం, పెద్ద సంఖ్యలో అభిమానులను కూడగట్టుకోవడం తప్పకుండా జరుగుతుంది. ఈ రాశి వారు సినిమా టీవీ రంగాలలో మల్టీ టాస్కింగ్ చేయవలసి వస్తుంది. దీనివల్ల వీరి జీవితం, వీరి జీవనం, ఇతర స్థితిగతులు సమూలంగా మారిపోవడం ఖాయం అని చెప్పవచ్చు. వృత్తిరీత్యా విపరీతంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి పంచమ స్థానంలో అంటే ఆలో చన, క్రియేటివిటీ, ప్లానింగ్ వంటి విషయాలకు సంబంధించిన స్థానంలో శుక్ర, రాహు గ్రహాల కలయిక జరగటం విశేషం. ఈ కలయిక వల్ల సినిమా లేదా టీవీ రంగంలోని దర్శకులు, నటులు, రచయితలు వంటి వారు తమ ప్రతిభ పాటవాలతో అదృష్ట యోగాలను పండించు కుంటారు. ఈ ఏడాది వీరికి ప్రజాధరణ, డిమాండ్ బాగా పెరగటం ఖాయం. వీరికి అవార్డులు, రివా ర్డులు లభించడం కూడా తప్పనిసరిగా జరుగు తుంది. వీరికి సంబంధించిన రంగంలో వీరు కొత్త ప్రయోగాలు చేయడానికి, కొత్త ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు బాగా కలిసి వస్తాయి. క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడు తుంది. యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అదే స్థాయిలో ఆదాయం కూడా అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది.
మకర రాశి
ఈ రాశి వారికి నాలుగవ రాశిలో అంటే సుఖ సంతోషాలు, సామాజిక హోదా, వాహనయోగం, మంచి గుర్తింపు వంటి అంశాలకు సంబంధించిన స్థానంలో శుక్ర, రాహు గ్రహాల యుతి జరుగు తోంది. అందువల్ల ఈ రాశి వారికి వృత్తి ఉద్యో గాలపరంగా మహాభాగ్యయోగం పట్టడం జరుగు తుంది. సినిమా, టీవీ రంగాలకు సంబంధించి వీరు ఏ విభాగంలో ఉన్నప్పటికీ ఆ విభాగానికి వీరి వల్ల ఒక ప్రత్యేకత చేకూరుతుంది. ఈ రాశికి చెందిన నటులు ఎప్పటికప్పుడు సరికొత్త నటనా వైదుష్యంతో ఈ రంగాలను కొత్త పుంతలు తొక్కించడం జరుగుతుంది. తద్వారా వీరికి విశేషంగా ధన లాభం కలగటంతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వీరికి తప్పనిసరిగా అనేక అవకాశాలు కలిసి వస్తాయి. ఈ ఏడాది వీరి ప్రయత్నాలకు, పథకాలకు ఎదురే ఉండదని చెప్పవచ్చు.
(కౌశిక్, ప్రముఖ జ్యోతిష్య పండితులు)

Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

ఇవి కూడా చదవండి