AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: వంట ఇంట్లో ఈ వస్తువులు పదేపదే పడిపోతున్నాయా.. జాగ్రత్త సుమా..రానున్న కష్టాలకు సంకేతం!

కొన్ని వస్తువులు మళ్లీ మళ్లీ చేతి నుంచి కింద పడిపోవడం శుభపరిణామంగా పరిగణించబడదు. ప్రత్యేకించి వంటగదిలో చేతుల నుండి కొన్ని రకాల వస్తువులు కింద పడిపోతే వాస్తు శాస్త్రం ప్రకారం అది శుభ సంకేతంగా పరిగణించబడదు. అంతేకాదు వంటగదిలో కొన్ని వస్తువులు కింద పడడం అశుభకరం కూడా. కొన్ని రకాల వస్తువులు మీ చేతుల్లో నుండి పడిపోతే పొరపాటున కూడా దానిని విస్మరించవద్దు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

Vastu Tips: వంట ఇంట్లో ఈ వస్తువులు పదేపదే పడిపోతున్నాయా.. జాగ్రత్త సుమా..రానున్న కష్టాలకు సంకేతం!
Vastu Tips For Home
Surya Kala
|

Updated on: Sep 09, 2024 | 8:46 AM

Share

ఇంట్లో పనిచేసున్న సమయంలో చేతుల నుండి కొన్ని వస్తువులు పదే పదే జారిపోతూ ఉంటాయి. ఇలా జరగడానికి గల కారణాన్ని అర్థం చేసుకోలేకపోవడంతో పట్టించుకోకుండా ముందుకు సాగవచ్చు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఆలోచించారా? ఇలాంటి సంఘటన పదే పదే జరగడం వాస్తు శాస్త్రానికి సంబంధించినది కావచ్చు. కొన్ని వస్తువులు మళ్లీ మళ్లీ చేతి నుంచి కింద పడిపోవడం శుభపరిణామంగా పరిగణించబడదు. ప్రత్యేకించి వంటగదిలో చేతుల నుండి కొన్ని రకాల వస్తువులు కింద పడిపోతే వాస్తు శాస్త్రం ప్రకారం అది శుభ సంకేతంగా పరిగణించబడదు. అంతేకాదు వంటగదిలో కొన్ని వస్తువులు కింద పడడం అశుభకరం కూడా. కొన్ని రకాల వస్తువులు మీ చేతుల్లో నుండి పడిపోతే పొరపాటున కూడా దానిని విస్మరించవద్దు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

ఉప్పు : వంటగదిలో ఉప్పు పదే పదే పడిపోతే.. అది మంచి సంకేతంగా పరిగణించబడదు. ఇది అశుభమైనది పరిణామంగా పరిగణించబడుతుంది. ఉప్పు చంద్రుడికి , శుక్రుడికి సంబంధించినది. అటువంటి పరిస్థితిలో ఉప్పు పదే పదే పడిపోతుంటే.. మీ జీవితంలో ఏదో సంక్షోభం రాబోతుందని అర్థం.

పాలు: వంటగదిలో పాలు పదేపదే చిందడం శుభపరిణామంగా పరిగణించబడదు. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుందని.. ఇంటి సభ్యులకు మంచిది కదాని అర్ధమట. ఇలా పదే పదే జరుగుతుంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలు ఇలా నేల మీద పాడడం జాతకంలో చంద్రుడు బలహీనంగా మారుతున్నాడని సంకేతం. ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఉంటే అతని జీవితంలో కష్టాలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

వంట నూనే: వంటగదిలో లేదా ఇంట్లో ఎక్కడైనా వంట నూనే కింద పాడడం శుభ సంకేతం కాదు. వంట నూనె నేరుగా శనిశ్వరుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఇంట్లో వంట నూనె పదే పదే పడిపోతుంటే.. తప్పని సరిగా మీరు జాగ్రత్తగా ఉండాలి. జాతకంలో శనీశ్వరుడు బలహీనంగా మారడంతో పాటు జీవితంలో అకస్మాత్తుగా సమస్యలు తలెత్తవచ్చు.

వంటగది ఏ దిశలో ఉండాలి?

వాస్తు ప్రకారం ఇంటి విషయంలో చాలా విషయాలను గుర్తుంచుకోవాలి. వాస్తు ప్రకారం ఇళ్లను నిర్మించుకుంటారు. అయితే దీని తర్వాత కూడా ఇంట్లో ఏదో ఒక లోపం ఉండండం చాలా సార్లు జరుగుంది. ఈ విషయం గమనించవచ్చు. వంటగది ఇంట్లో ముఖ్యమైన భాగం. వంటగది లేకుండా ఏ ఇంటిని ఊహించలేము. కనుక ఇంటిని నిర్మించే సమయంలో వంటగదిని నిర్మిస్తుంటే.. దాని తలుపు ఎప్పుడూ దక్షిణం వైపు ఉండకూడదు. వంటగది తూర్పు- దక్షిణ దిశలో ఉంటే లేదా ఈశాన్య అది ఉత్తమంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదు. అంతేకాదు ఆ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి