Vastu Tips: మీరు, మీ ఇంట్లో సభ్యులు తరచుగా వ్యాధుల బారిన పడుతున్నారా.. ఈ ప్రత్యేక వాస్తు చర్యలు అనుసరించండి..

చాలాసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రోగాలు తగ్గకపోగా, ఏదో ఒక జబ్బు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. మీరు కూడా ఈ రకమైన సమస్యతో ఇబ్బంది పడుతుంటే,.. ఇంటి వాస్తు దోషం కూడా దీనికి కారణం కావచ్చు. వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని చిట్కాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. వీటిని పాటించడం ద్వారా మీరు, మీ ఇంటి సభ్యులను వ్యాధులను దూరంగా ఉంచవచ్చు.

Vastu Tips: మీరు, మీ ఇంట్లో సభ్యులు తరచుగా వ్యాధుల బారిన పడుతున్నారా.. ఈ ప్రత్యేక వాస్తు చర్యలు అనుసరించండి..
Vastu Tips
Follow us
Surya Kala

|

Updated on: Mar 16, 2024 | 8:48 AM

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి, మీరు , మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. చాలాసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రోగాలు తగ్గకపోగా, ఏదో ఒక జబ్బు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. మీరు కూడా ఈ రకమైన సమస్యతో ఇబ్బంది పడుతుంటే,.. ఇంటి వాస్తు దోషం కూడా దీనికి కారణం కావచ్చు. వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని చిట్కాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. వీటిని పాటించడం ద్వారా మీరు, మీ ఇంటి సభ్యులను వ్యాధులను దూరంగా ఉంచవచ్చు.

  1. వాస్తు ప్రకారం కుటుంబంలోని ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లో సానుకూల శక్తి ప్రసరణ. ఇంటి ప్రధాన ద్వారం సానుకూల శక్తిని ప్రసారం చేసే ప్రధాన వనరుగా పరిగణించబడుతుంది. కనుక ఇంటి ప్రధాన తలుపు, మూలలు సరైన స్థితిలో ఉండేలా ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తలుపుల్లో ఎక్కడా ఎలాంటి పగుళ్లు ఉండకూడదు.
  2. మెయిన్ డోర్‌పై మురికి పేరుకుపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇంటి ప్రధాన ద్వారంలో ఏదైనా దోషం ఉంటే, అది ఇంటి సభ్యుల పురోగతి, ఆరోగ్యం రెండింటిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ఇంటి ప్రధాన ద్వారంపై ఓం , స్వస్తిక చిహ్నాలను తవేసుకోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కనుక ఇంటి ప్రధాన ద్వారంపై ఎల్లప్పుడూ ఓం, స్వస్తిక చిహ్నాలను ఉంచండి.
  3. కుటుంబం సభ్యుల ఆరోగ్యం కోసం ఇంటి శుభ్రత గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇంటిని ప్రతిరోజూ శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి.  ఇంట్లో సాలీడు గూళ్లను ను ఉంచుకోవద్దు. ఇంటి గోడలపై సాలిగూళ్లు ఉంటే, వాటిని వెంటనే తొలగించండి. ఇంట్లో సాలిగూళ్లు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయని నమ్ముతారు.
  4. మంచి ఆరోగ్యం కోసం ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి ప్రవేశించిన చోట సౌండింగ్ విండ్ చైమ్‌ను ఏర్పాటు చేసుకోండి. ఇది ఇంట్లో సానుకూల ధ్వనిని ప్రసరింపజేస్తుంది. ఇంట్లోని అన్ని కిటికీలు, తలుపులు ఉదయాన్నే తెరవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్వచ్ఛమైన గాలి.  ఉదయపు సూర్య కిరణాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇవి ఇంట్లో హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్థాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని బ్రహ్మ స్థలం ఎప్పుడూ ఖాళీగా ఉంచాలి. ఇంట్లో దూలం కింద కూర్చోకూడదు లేదా నిద్రపోకూడదు. ఇలా చేయడం వల్ల వ్యాధి వచ్చే అవకాశం పెరుగుతుంది. పడకగదిలో మంచం ముందు అద్దాన్ని ఎప్పుడూ ఉంచకూడదు. పడుకునేటప్పుడు అద్దంలో చూడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి.
  7. నిద్రపోతున్నప్పుడు శరీరంలోని ఏ భాగమూ కనిపించని చోట అద్దం పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం, నిద్రపోతున్నప్పుడు అద్దంలో చూసుకోవడం వల్ల శరీరంలో ఏదో ఒక వ్యాధి వస్తుంది. పడకగదిలో అద్దం ఉంటే రాత్రి నిదురించే సమయంలో ఆ అద్దాన్ని గుడ్డతో కప్పాలి.
  8. రాత్రి పడుకునేటప్పుడు ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకూడదు. ఇలా చేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతుందని, నిద్రలేమికి దారితీస్తుందని నమ్ముతారు. ఉత్తరం వైపు తల పెట్టి ఎక్కువసేపు పడుకోవడం వల్ల తలనొప్పి, ఇతర వ్యాధులు వస్తాయని  విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC