- Telugu News Photo Gallery Summer Health Tips: What Is The Most Unhealthy Milkshake, Know Details in telugu
Summer Health Tips: వేసవి దాహార్తి తీర్చుకోవడనికి శక్తి కోసం తెగ ఫ్రూట్ మిల్క్ షేక్ తాగేస్తున్నారా.. బీ అలెర్ట్.. ఆరోగ్యానికి ప్రమాదం..
వేసవి కాలం వచ్చిందంటే చాలు చల్ల చల్లగా ఉండే పదార్ధాలను తినాలనే ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యముగా కూల్ డ్రింక్స్, జ్యూస్ లు , ఫ్రూట్ షేక్స్, స్మూతీలు, కొబ్బరి బొండాలు వంటి వాటిని తినడం ప్రారంభిస్తారు. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాదు రుచికి రుచిగా కూడా ఉంటాయి. వీటిల్లో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. శరీరానికి ఆరోగ్యాన్ని పెంచుతాయి. దీంతో కొందరు ఫ్రూట్ మిల్క్ షేక్స్ ను ఉదయం అల్పాహారంగా కూడా తీసుకుంటారు.
Updated on: Mar 16, 2024 | 8:14 AM

ఫ్రూట్ షేక్స్ పండ్ల వంటి పోషక పదార్ధాలతో తయారు చేయబడినప్పటికీ.. ఆరోగ్యానికి మంచిదా కాదా అనే అనే ప్రశ్న కొందరిలో కలుగుతూ ఉంటుంది. అయితే ఫ్రూట్ షేక్స్ విషయంలో ఆహార పదార్థాల కలయికలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లలో పాలను కలిపే సమయంలో తప్పని సరిగా జాగ్రత్త తీసుకోవాలి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం కొన్ని రకాల పండ్లు, పాల కలయిక ఆమా అనే విషపూరిత పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తాయి.

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం మిల్క్ షేక్స్ ఆరోగ్యానికి హానికరం. కంపెనీలు హెల్తీ డ్రింక్స్ పేరుతో ప్రజలకు వీటిని అందిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను, పాలను అసలు కలపకూడదు అని అంటున్నారు.

పాలలో అస్సలు కలపకూడని కొన్ని పండ్లు ఉన్నాయి. నిమ్మ, నారింజ, ద్రాక్ష, బొప్పాయి, పుచ్చకాయ వంటి ఫ్రూట్ మిల్క్ షేక్స్ శరీరానికి మంచిది కాదు.

ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలువబడే విటమిన్ సి, పాల ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయగల యాసిడ్ సమ్మేళనం అని పరిశోధనలో తేలింది.

ఫలితంగా పాలు ఆరోగ్యానికి హానికరం అయ్యే అవకాశం ఉంది. పాలలోని పోషక విలువలు కూడా పోతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఏదైనా పండ్లను పాలలో చేర్చడం పాలు విరుగుతాయి.

యాపిల్, చెర్రీ, స్ట్రాబెర్రీ, అనాస పండు, పియర్, జామలో ఉండే పోషకాలు మీ శరీరానికి అందాలనుకుంటే పాలలో వీటిని అస్సలు కలపవద్దు. ఇలా చేయడం వలన అజీర్ణం, పొత్తికడుపు నొప్పి, గుండెల్లో మంట, తిమ్మిర్లు, అసిడిటీ, విరేచనాలకు కారణమవుతుంది.




