- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu Guntur Karam to Pawan Kalyan Ustaad Bhagath Singh latest movie updates
Film Updates: మహేష్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ఉస్తాద్ వెనక్కి తగ్గినట్టేనా.?
మహేష్ బాబు ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు గుంటూరు కారం దర్శక నిర్మాతలు. ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేసారు. ఓటీటీలో వచ్చే బి గ్రేడ్ కంటెంట్‌తో యువత చెడిపోతున్నారని చాలా రోజులుగా కంప్లైంట్స్ ఉన్నాయి. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో వస్తున్న కుటుంబ కథా చిత్రం రవికుల రఘురామా. దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమా మార్చి 21న రీ రిలీజ్ కానుంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల కారణంగా ఒప్పుకున్న సినిమాలను పక్కనబెట్టారు పవన్ కళ్యాణ్.
Updated on: Mar 16, 2024 | 9:55 AM

మహేష్ బాబు ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు గుంటూరు కారం దర్శక నిర్మాతలు. ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేసారు. ఫైట్ సీక్వెన్స్ సమయంలో వచ్చే నాకోసమే నువ్వున్నది పాటను విడుదల చేసారు మేకర్స్. అయితే ఈ సినిమాలో 7వ పాట కూడా ఉంది. మార్చి 15న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు థమన్. ఇది తనకు ఇష్టమైన పాట అని తెలిపారు ఈ సంగీత దర్శకుడు.

ఓటీటీలో వచ్చే బి గ్రేడ్ కంటెంట్‌తో యువత చెడిపోతున్నారని చాలా రోజులుగా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనిపై కేంద్రం కొరడా ఝులిపించింది. బూతు, అడ్డగోలు శృంగార సన్నివేశాలతో కంటెంట్ నింపేస్తున్న 18 ఓటీటీలపై నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇవి తక్షణం అమలులోకి వస్తాయి.

చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో వస్తున్న కుటుంబ కథా చిత్రం రవికుల రఘురామా. గౌతమ్ సాగి, దీప్సిక ఇందులో జంటగా నటిస్తున్నారు. మార్చ్ వీడు 5న విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ను విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విడుదల చేసారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని.. కచ్చితంగా సినిమా కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని తెలిపారు మక్కల్ సెల్వన్.

దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమా మార్చి 21న రీ రిలీజ్ కానుంది. దీనికోసం భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర రీ రిలీజ్‌పై హీరోయిన్ అనిత స్పందించారు. నువ్వు నేనుతోనే తనకు తెలుగులో గుర్తింపు వచ్చిందని.. ఆ సినిమా ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు అనిత. ఉదయ్ సినిమా మరోసారి థియేటర్లలో విడుదల చేస్తుండటం ఆనందంగా ఉందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల కారణంగా ఒప్పుకున్న సినిమాలను పక్కనబెట్టారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే ఉస్తాద్ కూడా కొన్నాళ్లుగా ఆగిపోయింది. జూన్ నుంచి ఓజి కోసం డేట్స్ ఇవ్వనున్నారు పవన్. ఆ తర్వాత హరిహర వీరమల్లు కూడా ఉంది. దాంతో హరీష్ శంకర్ ఉస్తాద్ మరింత వెనక్కి వెళ్లేలా కనిపిస్తుంది.




